Weather Latest Update: ఆంధ్రప్రదేశ్‌తో అల్పపీడన ప్రభావం- తెలంగాణలో చలి వాతావరణం
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చాలా భిన్నంగా కనిపిస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడవచ్చు.
ఈశాన్య రుతపవనాలకు తోడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ రెండింటి కారణంగా కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే తమిళనాడుకు ఆనుకొని ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని చోట్ల వానలు దంచి కొడుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చాలా భిన్నంగా కనిపిస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడవచ్చు. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్,్ యానంపై పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
రెండు మూడు రోజుల్లో అల్పపీడనం ప్రభావం కనిపిస్తుందని పేర్కొంది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో దీని ఎఫెక్ట్ కనిపిస్తుందని వెల్లడించింది.
Fishermen warnings for Andhra Pradesh dated 15.11.2022 pic.twitter.com/hvsCpcpJ9F
— MC Amaravati (@AmaravatiMc) November 15, 2022
Fisherman warnings for Andhra Pradesh dated 15-11-2022 pic.twitter.com/1Nah4OhelW
— MC Amaravati (@AmaravatiMc) November 15, 2022
తెలంగాణలో పరిస్థితి ఇలా..
హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు విడుదల చేసిన వెదర్ బులెటిన్ ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం పొడిగా ఉంటుంది. ఎక్కడా వర్ష సూచన లేదు. వచ్చే 3 రోజులు ఇలాగే వాతావరణం పొడిగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
— IMD_Metcentrehyd (@metcentrehyd) November 15, 2022
తెలంగాణలో వర్షాల సంగతి పక్కనపెడితే చలి మాత్రం వణికించనుంది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా చలిగాలులు ఇబ్బంది పెట్టనున్నాయి. మూడు రోజుల పాటు బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.
మంగళవారం హైదరాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 16.8 డిగ్రీలు ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగాా ఈ ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే ప్రమాదం ఉంది. 11 డిగ్రీల నుంచి 9 డిగ్రీల మధ్య నమోదు అయ్యే ఛాన్స్ ఉన్నట్టు చెబతున్నారు. అందుకే ఈ మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.