News
News
వీడియోలు ఆటలు
X

Viral Video: ఎస్‌యూవీ వాహనాన్ని నోటితో లాగేసిన పెద్దపులి... మహీంద్రా కార్లు మహా రుచి అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్

మహీంద్రా కార్లు చాలా రుచిగా ఉంటానుకుంటా అందుకే పెద్ద పులి కూడా వదలడం లేదంటూ ఆనంద్ మహీంద్రా ఓ ట్వీట్ చేశారు. ఇప్పుడా ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.

FOLLOW US: 
Share:

సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటే మహీంద్రా సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తన దృష్టికి వచ్చే వినూత్న వీడియోలను తరుచూ పంచుకుంటారు. తాజాగా ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. మహీంద్రా ఎస్‌యూవీ వాహనాన్ని పెద్ద పులి పంటితో వెనక్కి లాగే వీడియోను ఆయన షేర్ చేశారు.

Also Read: సుప్రీంపై ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ఇక వర్చువల్‌గానే విచారణలు

ఎస్‌యూవీ లాగిపడేసి పెద్ద పులి

పులి వేట ఎప్పుడైనా చూశారా... పంజాతో ఒక్క వేటులో వేట చేజిక్కించుకుంటుంది. పులి వేటులో అంత పవర్ ఉంటే... ఇంక దాని గాటులో ఇంకెంత పవర్ ఉంటుంది. తన పవర్ చూపించిందో పెద్ద పులి. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఓ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. మహీంద్రా కార్లంటే మనుషులకే కాదు జంతువులకు కూడా ఇష్టమే అంటున్నారు. మహీంద్రా కార్లు మహా రుచిగా ఉంటాయనుకుంటా అందుకే ఈ పెద్ద పులి బంపర్‌ను నమిలేస్తుంది అని ట్వీట్ చేశారు. తన పళ్లతో పట్టుకుని, కారును తన శక్తితో వెనుకకు కారును పెద్దపులి లాగే వీడియో షేర్ చేశారు ఆనంద్ మహీంద్రా. ఈ వీడియో కర్నాటకలోని బన్నెరఘట్ట నేషనల్ పార్క్ లో పర్యాటకులు తీశారు. పులి తన పంటితో టూరిస్ట్ కారును వెనుకకు లాగింది. ఈ ఘటను మరో కారులో ఉన్న టూరిస్టులు వీడియో తీశారు. పర్యాటకులు మహీంద్రా గ్జైలో కారును పులి పదేపదే కొరుకుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. పెద్ద పులి కారు బంపర్‌ పట్టుకుని బలంగా కారును వెనక్కి లాగింది. 

Also Read: తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో యోగి.. అయోధ్య నుంచేనా పోటీ!

మహీంద్రా కార్లు చాలా రుచి

ఈ వీడియోలో గ్జైలో కారును పెద్ద పులి లాగడంలో ఆశ్చర్యం లేదని అనుకుంటున్నానని ఆనంద్ మహీంద్రా అన్నారు. బహుశా మహీంద్రా కార్లు చాలా రుచిగా ఉంటాయనుకుంటా అని మహీంద్రా ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది. పెద్ద పులి బలాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది నవంబరులో బన్నేర్‌ఘట్ట నేషనల్ పార్కులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా గురువారం షేర్ చేయగా ఇప్పటి వరకూ 4 లక్షల మంది వీక్షించారు. 

Also Read: Delhi HC on Marriage: 'అలా చెప్పి పెళ్లి చేయడం మోసమే..' దిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 02 Jan 2022 10:15 PM (IST) Tags: Viral video Tiger Drags SUV Anand Mahindra tweet Viral video tiger drags car

సంబంధిత కథనాలు

New Parliament Opening: పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని పట్టాభిషేకంలా మార్చేశారు - ప్రధానిపై రాహుల్ సెటైర్లు

New Parliament Opening: పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని పట్టాభిషేకంలా మార్చేశారు - ప్రధానిపై రాహుల్ సెటైర్లు

GSLV - F12 Launch: తిరుమల శ్రీవారి పాదాల చెంత జీఎస్ఎల్వీ ఎఫ్-12 నమూనా, ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు

GSLV - F12 Launch: తిరుమల శ్రీవారి పాదాల చెంత జీఎస్ఎల్వీ ఎఫ్-12 నమూనా, ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు

New Parliament: కొత్త పార్లమెంట్‌ చూడాలనుకుంటున్నారా, అయితే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాల్సిందే

New Parliament: కొత్త పార్లమెంట్‌ చూడాలనుకుంటున్నారా, అయితే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాల్సిందే

CUET UG Admit Card: సీయూఈటీ యూజీ అడ్మిట్‌ కార్డులు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

CUET UG Admit Card: సీయూఈటీ యూజీ అడ్మిట్‌ కార్డులు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

New Parliament Opening: కొత్త పార్లమెంట్‌పై RJD వివాదాస్పద ట్వీట్, శవపేటికతో పోల్చడంపై దుమారం

New Parliament Opening:  కొత్త పార్లమెంట్‌పై RJD వివాదాస్పద ట్వీట్, శవపేటికతో పోల్చడంపై దుమారం

టాప్ స్టోరీస్

Telangana Politics : అయితే కొత్త పార్టీ లేకపోతే కాంగ్రెస్ - పొంగులేటి, జూపల్లి డిసైడయ్యారా ?

Telangana Politics :  అయితే కొత్త పార్టీ లేకపోతే కాంగ్రెస్ - పొంగులేటి, జూపల్లి డిసైడయ్యారా ?

New Parliament Inauguration: కొత్త పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ

New Parliament Inauguration: కొత్త పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ

NT Rama Rao Jayanti : ఎన్టీఆర్‌ను దేవుడిని ఎందుకు కొలుస్తున్నారు? ఆయనకు ఎందుకు అంత క్రేజ్?

NT Rama Rao Jayanti : ఎన్టీఆర్‌ను దేవుడిని ఎందుకు కొలుస్తున్నారు? ఆయనకు ఎందుకు అంత క్రేజ్?

CSK vs GT IPL 2023 Final: మొతేరాలో ఫైనల్‌ మోత! సీఎస్కే, జీటీ పాజిటివ్‌, నెగెటివ్స్‌ ఇవే!

CSK vs GT IPL 2023 Final: మొతేరాలో ఫైనల్‌ మోత! సీఎస్కే, జీటీ పాజిటివ్‌, నెగెటివ్స్‌ ఇవే!