News
News
X

Watch Video: కదులుతున్న రైల్లో నుంచి దిగడం ఎంత ప్రమాదకరమో చూశారా - వైరల్ వీడియో

Watch Video: ముజఫర్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ కదులుతున్న రైల్లో నుంచి దిగి ప్రాణాల మీదకు తెచ్చుకుంది.

FOLLOW US: 
 
Watch Video:

ముజఫర్‌పూర్‌లో ఘటన...

కదులుతున్న రైల్లోకి ఎక్కడం, రైల్లో నుంచి దిగడం ప్రమాదకరం అని రైల్వే స్టేషన్లలో మైక్‌లు పెట్టి మరీ అనౌన్స్ చేస్తున్నా ఎవరూ పట్టించుకోవటం లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. కదులుతున్న రైలును దిగేందుకు ప్రయత్నించిన మహిళ రైలుకి, ప్లాట్‌ఫామ్‌కి మధ్య ఇరుక్కుపోయింది. ఇది చూసి స్టేషన్‌లో వాళ్లంతా షాక్‌కి గురయ్యారు. ఒక్కసారిగా జనాలు అరవటాన్ని గమనించిన RPF పోలీసులు వెంటనే పరిగెత్తి ఆ మహిళను కాపాడారు. విష్ణుపుర నుంచి నరకటిగంజ్‌కు వెళ్తున్న అంబిష ఖతూన్...ముజఫర్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ట్రైన్‌ కోసం ఎదురు చూస్తోంది. ప్లాట్‌ఫామ్‌పై బాత్‌రూమ్ లేకపోవటం వల్ల కాలకృత్యాలు తీర్చుకునేందుకు గ్వాలియర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కింది. ఎక్కిన వెంటనే ఉన్నట్టుండి రైలు కదిలింది. ఏం చేయాలో తెలియక వెంటనే అందులో నుంచి కిందకు దిగేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే కాలు జారి ప్లాట్‌ఫామ్‌ మధ్య ఇరుక్కుపోయింది. RPF పోలీసులు తక్షణమే స్పందించకపోయుంటే...తీవ్ర నష్టం జరిగుండేది. RPF పోలీసుల చొరవతో స్వల్ప గాయాలతో బయట పడింది. ప్రస్తుతం ఆమెను సర్దార్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
క్రాసింగ్‌ చేసేటప్పుడు జాగ్రత్త..

రైల్వే క్రాసింగ్ దాటుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా నిశితంగా గమనిస్తూ ఉండాలి. అలా కాకుండా కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు. ఇటీవల రైల్వే క్రాసింగ్‌ను వాహనంతో లేక నడుస్తూ హడావుడిగా దాటుతున్న ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఓ యువతి హెడ్‌ఫోన్స్ పెట్టుకుని రైల్వే క్రాసింగ్ దాటుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక విదేశీ మహిళ రైల్వే క్రాసింగ్ దాటుతోంది. అయితే చుట్టూ చూడకుండా హెడ్‌ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ బిజీగా రైల్వే క్రాసింగ్ దాటుతోంది. ఆ సమయంలో రైల్వే ట్రాక్‌పై ఓ ట్రైన్ ఫుల్‌ స్పీడ్‌గా హారన్‌ కొడుతూ వస్తోంది. హెడ్ ఫోన్స్ పెట్టుకోవడంతో ఆ యువతికి ఇది వినపడలేదు. దీంతో రైలు ఆ యువతిని ఢీ కొట్టింది. అయితే లక్కీగా ఆ యువతి చివరి క్షణంలో రైలును చూసి కొంచెం వేగంగా నడవడంతో ఘోర ప్రమాదం తప్పింది. ఆమెను రైలు బలంగా ఢీ కొట్టడంతో పక్కనున్న ట్రాక్‌పై ఆ యువతి పడి పోయింది. వైరల్ అవుతున్న ఈ వీడియో 'TRThaber' అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.  

View this post on Instagram
 
A post shared by TRT Haber (@trthaber)

Also Read: Kadapa Crime News: యువకులతో వెళ్లి శవమైన అమ్మాయి - హత్య కాదు, ఆత్మహత్యే!

Published at : 26 Oct 2022 02:47 PM (IST) Tags: watch video Moving Train Woman fell from moving train Muzaffarpur RPF

సంబంధిత కథనాలు

Guntur Knife Attack: గుంటూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం, వైద్య విద్యార్థిని దారుణహత్య - కారణం ఏంటంటే!

Guntur Knife Attack: గుంటూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం, వైద్య విద్యార్థిని దారుణహత్య - కారణం ఏంటంటే!

Telangana Cabinet Meeting: డిసెంబర్ 10న తెలంగాణ కేబినెట్ భేటీ, చర్చించే కీలకాంశాలు ఇవే

Telangana Cabinet Meeting: డిసెంబర్ 10న తెలంగాణ కేబినెట్ భేటీ, చర్చించే కీలకాంశాలు ఇవే

Konaseema News : ఉసురు తీసిన ఉపాధి, మస్కట్ లో మహిళ ఆత్మహత్య!

Konaseema News :  ఉసురు తీసిన ఉపాధి,  మస్కట్ లో మహిళ ఆత్మహత్య!

వాహనదారులకు గుడ్ న్యూస్, అందుబాటులోకి మరో సూపర్‌ టెక్నాలజీ - వాటిని ముందుగానే గుర్తించే యాప్‌ !

వాహనదారులకు గుడ్ న్యూస్, అందుబాటులోకి మరో సూపర్‌ టెక్నాలజీ - వాటిని ముందుగానే గుర్తించే యాప్‌ !

Bandi Sanjay : తప్పు చేయకపోతే 10 ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారు, ఎమ్మెల్సీ కవితకు బండి సంజయ్ సూటి ప్రశ్న!

Bandi Sanjay :  తప్పు చేయకపోతే 10 ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారు, ఎమ్మెల్సీ కవితకు బండి సంజయ్ సూటి ప్రశ్న!

టాప్ స్టోరీస్

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!

Naga Chaitanya: మరదలితో నాగచైతన్య - రెస్టారెంట్‌లో ఫుడ్ వీడియో చేసిన వెంకటేష్ కూతురు!

Naga Chaitanya: మరదలితో నాగచైతన్య - రెస్టారెంట్‌లో ఫుడ్ వీడియో చేసిన వెంకటేష్ కూతురు!

Soyam Babu Rao: 25 ఏళ్ల కిందట సారా ప్యాకెట్స్ తయారుచేసి అమ్మిన చరిత్ర మీది కాదా?: మంత్రిపై బీజేపీ ఎంపీ ఫైర్

Soyam Babu Rao: 25 ఏళ్ల కిందట సారా ప్యాకెట్స్ తయారుచేసి అమ్మిన చరిత్ర మీది కాదా?: మంత్రిపై బీజేపీ ఎంపీ ఫైర్

HIT 3: అర్జున్ సర్కార్‌గా నాని - ‘హిట్ 3’ రెడీ!

HIT 3: అర్జున్ సర్కార్‌గా నాని - ‘హిట్ 3’ రెడీ!