Watch Video: ఇదేం పిల్లిరా బాబు, చూశారంటే హార్ట్ అటాక్ తప్పదు - వైరల్ వీడియో
Watch Video: సోషల్ మీడియాలో పిల్లి వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
Watch Video:
సగం తెలుపు, సగం నలుపు..
సోషల్ మీడియోలో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. ఏదో మామూలు వీడియో కూడా ఇట్టే వైరల్ అయిపోతుంది. కానీ...కొన్ని మాత్రం "ఇవి తప్పకుండా వైరల్ అవ్వాల్సినవే" అనే కేటగిరీలో ఉంటాయి. ఇప్పుడలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొన్ని సార్లు వింత జంతువుల వీడియోలు చూసి భయపడిపోతాం. ఇప్పుడు అలాంటి వెరైటీ పిల్లి ఒకటి వెలుగులోకి వచ్చింది. సగం నలుపు, సగం తెలుపు రంగులో ఉన్న ఆ పిల్లి ముఖాన్ని చూసి షాక్ అవుతున్నారు నెటిజన్లు. మామూలుగానే పిల్లిని చూస్తే కొందరు భయపడిపోతారు. ఇక ఈ పిల్లిని చూస్తే మాత్రం రాత్రి నిద్ర కూడా పట్టదు. అంత భయంకరంగా ఉంది దాని ముఖం. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పిల్లి వీడియో వైరల్ అవుతోంది. ఈ పిల్లి బాడీ అంతా బ్లాక్‌గా ఉంది. కానీ ముఖంలో మాత్రం సగం తెలుపు రంగు ఉంది. ఈ Black and Whiteముఖమే అందరి మైండ్ బ్లాక్ చేసేసింది. అందులోనూ..ఈ పిల్లి చీకట్లో నడుచుకుంటూ వస్తుంటే ఏదో వింత జంతువు వచ్చి మీద పడిపోతుందేమో అన్నంత భయంగా ఉంది. ఇప్పటికే 30 లక్షల మంది ఈ వీడియోను చూశారు. 2 లక్షల మంది లైక్ చేశారు. ఇంకా ఇది షేర్ అవుతూనే ఉంది. అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లోనూ ఈ వీడియో కనిపిస్తోంది.
View this post on Instagram