By: ABP Desam | Updated at : 05 Dec 2022 01:09 PM (IST)
Edited By: Murali Krishna
బద్దలైన ఎత్తైన అగ్ని పర్వతం- ఇండోనేసియాలో డేంజర్ బెల్స్!
Volcano In Indonesia: అగ్ని పర్వాతాల కారణంగా ఇండోనేసియాలో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తూర్పు జావాలోని వేలాది మంది నివాసితులను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ద్వీపంలోని ఎత్తైన అగ్నిపర్వతం మౌంట్ సెమేరు (Mount Semeru) విస్ఫోటనం చెందడంతో 8 కిలోమీటర్ల మేర నో-గో జోన్‌ను విధించారు. అక్కడ మొత్తం గ్రామాలను బలవంతంగా ఖాళీ చేయించారు.
Pyroclastic flow footage from the Semeru volcano in East Java, Indonesia. Imagine seeing that thing coming toward you. Terrifying. (footage sped up 5x) pic.twitter.com/84D4Dr6IIr
— Nahel Belgherze (@WxNB_) December 4, 2022
వరుస విపత్తులు
ఇటీవల భారీ భూకంపంతో అతలాకుతలమైన ఇండోనేసియాను ఇప్పుడు అగ్ని పర్వతాలు భయపెడుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున ఈ అగ్ని పర్వ తం విస్ఫోటనం చెందింది. ఈ క్రమంలోనే పెద్దఎత్తున లావా వెలువడటంతోపాటు దాదాపు ఒకటిన్నర కి.మీల ఎత్తువరకు దట్టమైన పొగ కమ్ముకుంది. దీంతో అధికారులు గరిష్ఠ స్థాయి హెచ్చరికలు జారీ చేశారు.
#Gunung #Semeru volcano Java Indonesia, eruption with pyroclastic flow, 04.12.20022, 11:41 local time, realtime speed
— Rita Bauer (@wischweg) December 4, 2022
my prayers are with the people living there pic.twitter.com/YRh7Hd3rOA
లావా ప్రవాహం తాకే అవకాశం ఉన్న బెసుక్ కొబోకాన్ నది ఆగ్నేయ ప్రాంతం నుంచి ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఇండోనేసియా అగ్నిపర్వతాల, భూసంబంధిత ప్రమాదాల నివారణ కేంద్రం హెడ్ హెండ్రా గుణవాన్ సూచించారు.
మౌనా లోవా
ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిపర్వతమైన హవాయి ద్వీపంలోని మౌనా లోవా నవంబర్ 28న బద్దలైంది. దీంతో భారీగా లావా, బూడిదను వెదజల్లింది. ఇప్పటికీ లావా ఎగజిమ్ముతోంది. దాదాపు 33 మీటర్ల నుంచి 200 మీటర్ల ఎత్తు వరకు లావా ఎగిసిపడుతోంది. అగ్ని పర్వత పరిసర ప్రాంతాలన్నీ బూడిదతో నిండిపోయాయి.
Watch: Fountains of lava up to 200 feet (60 meters) high have been fired into the air from Hawaii's Mauna Loa, geologists say, generating rivers of molten rock from the world's largest active volcano #MaunaLoa #Hawaii #volcano pic.twitter.com/naGOmqMmpw
— JUST IN | World (@justinbroadcast) November 29, 2022
విస్ఫోటనానికి ముందు మౌనా లోవా చుట్టూ వరుస భూకంపాలు వచ్చాయి. రిక్టర్ స్కేల్‌పై 3.0 కంటే తక్కువ తీవ్రతతో 18 భూకంపాలు సంభవించాయి. కాగా, ఈ అగ్నిపర్వతం సముద్ర మట్టానికి 13,670 అడుగుల ఎత్తులో ఉంది. మౌనాలోవా చివరగా 1984లో చివరగా 20 రోజుల పాటు లావా వెదజల్లింది.
Also Read: Senegal Parliament Video: పార్లమెంటులో సభ్యుల మధ్య ఘర్షణ- మహిళా ఎంపీపై దాడి!
KNRUHS: యూజీ ఆయూష్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడి! ఫిబ్రవరి 5, 6 తేదీల్లో వెబ్ఆప్షన్లు!
Gold-Silver Price 05 February 2023: కుప్పకూలిన బంగారం, వెండి రేట్లు - కొనాలనుకునే వాళ్లకు మంచి అవకాశం
AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో 'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!
Telangana Jobs: కొత్త వైద్య కళాశాలలకు 313 పోస్టుల మంజూరు, ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ!
Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా
Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన
Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!
NTR Death : తెరమీదకు ఎన్టీఆర్ మరణం, టీడీపీకి చెక్ పెట్టేందుకా? డైవర్ట్ పాలిటిక్సా?
TS High Court : న్యాయమూర్తికే నోటీసులిచ్చిన న్యాయవాది, జైలుకు పంపిస్తామని హైకోర్టు సీరియస్