Viral News: అరుదైన గుర్రాలను గిఫ్ట్‌గా ఇచ్చిన పుతిన్, తెగ మురిసిపోతున్న కిమ్
Putin Gifts Horses: రష్యా అధినేత పుతిన్ నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్‌కి 24 అరుదైన గుర్రాలను గిఫ్ట్‌గా ఇచ్చాడు. వాటిని చూసుకుని కిమ్ తెగ మురిసిపోతున్నాడు.
Viral News in Telugu: రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌కి అదిరిపోయే గిఫ్ట్‌లు ఇచ్చాడు. వాటిని చూసుకుని కిమ్ తెగ మురిసిపోతున్నాడు. ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగించడానికి ఉత్తర కొరియా రష్యాకి భారీ ఎత్తున ఆయుధ సహకారం అందిస్తోంది. ఈ సాయానికి కృతజ్ఞతగా కిమ్‌కి 24 గుర్రాలు గిఫ్ట్‌గా ఇచ్చాడు పుతిన్. Orlov Trotter అనే జాతికి చెందిన గుర్రాలంటే కిమ్‌కి ఎంతో ఇష్టమట. అందుకే వాటినే బహుకరించాడు పుతిన్. ఈ గుర్రాలపై స్వారీ చేస్తూ ఎంజాయ్ చేశాడు కిమ్. సరిహద్దు ప్రాంతంలో వీటిని స్వారీ చేశాడు. రెండేళ్ల క్రితం కూడా ఇవే గుర్రాలపై స్వారీ చేశాడు. అప్పట్లో ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి. అటు కిమ్ కూడా పుతిన్‌కి ఈ ఏడాది జూన్‌లో Pungsan జాతికి చెందిన కుక్కల్ని గిఫ్ట్‌గా ఇచ్చినట్టు అక్కడి మీడియా వెల్లడించింది. రెండు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరిన క్రమంలో ఇలా ఒకరికొకరు గిఫ్ట్‌లు ఇచ్చుకున్నారు. ఆగస్టులో పుతిన్ కిమ్‌కి 447 మేకలు ఇచ్చాడు. అణ్వాయుధాలు, బాలిస్టిక్ మిజైల్స్ తయారీపై పెద్ద ఎత్తున ఖర్చు పెడుతోంది నార్త్ కొరియా.
మిలిటరీలో గుర్రాలు..
ఇదే సమయంలో మిలిటరీ యూనిట్స్‌ని ఏర్పాటు చేసుకునేందుకూ భారీగానే నిధులు కేటాయిస్తోంది. 2020-23 మధ్య కాలంలో గుర్రాలనూ దిగుమతి చేసుకుంటోంది. మిలిటరీలో ఈ గుర్రాలను వినియోగించేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు కిమ్. గుర్రాలను నార్త్ కొరియాకి ఓ వీరత్వపు ప్రతీకగా చూస్తారు. కిమ్‌కి వ్యక్తిగతంగా గుర్రాలంటే చాలా ఇష్టం. అందుకే అటు మిలిటరీ కోసమే కాకుండా పర్సనల్‌గానూ గుర్రాలను కొనుగోలు చేస్తున్నారు. నిజానికి యుద్ధాలలో వీటిని వాడరు. కానీ వాటిని యుద్ధానికి చిహ్నంగా చూస్తారు. అందుకే అంతగా వాటికి ప్రాధాన్యత ఇస్తారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఇప్పట్లో తెరపడేలా కనిపించడం లేదు. సై అంటే సై అని రెండు దేశాలూ కాలు దువ్వుతూనే ఉన్నాయి. శాంతి చర్చలు మధ్యలో జరిగినప్పటికీ అవేమీ ఫలించలేదు. పైగా మరింత తీవ్రమవుతోంది యుద్ధం. (Also Read: Viral Video: స్టెప్పులతో అదరగొట్టిన ట్రంప్, 78 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా డ్యాన్స్ - వీడియో)
రష్యాపై తీవ్ర విమర్శలు..
అంతర్జాతీయంగా రష్యా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి పలు సార్లు రష్యాని మందలించింది. అయినా పుతిన్ వెనక్కి తగ్గడం లేదు. ఆస్తి నష్టం, ప్రాణనష్టం భారీగా వాటిల్లుతోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పుతిన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ జోక్యం చేసుకుని సమస్యని పరిష్కరించాలని కోరారు. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించారు. జెలెన్‌స్కీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించారు. జెలెన్‌స్కీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇది యుద్ధాల కాలం కాదని, సమస్యలను కూర్చుని పరిష్కరించుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. భారత్ ఈ విషయంలో అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందని స్పష్టం చేశారు. ఈ తరహా విధ్వంసం జరగడం సరికాదని అన్నారు.
Also Read: Viral Video: బైక్‌పైన షికార్లు చేస్తున్న భారీ మొసలి, వాహనదారులంతా షాక్ - వీడియో