News
News
X

Viral Video: సింగర్‌పై నోట్ల వర్షం కురిపించారు, అక్కడ ఇదో ఆచారమట - వైరల్ వీడియో

Viral Video: గుజరాత్‌లో ఓ ఫోక్ సింగర్‌పై నోట్ల వర్షం కురిపించారు.

FOLLOW US: 
Share:

Viral Video:

గుజరాత్‌లో..

గుజరాత్‌కు చెందిన ఓ గాయకుడిపై నోట్ల వర్షం కురిపించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఫోక్ సింగర్ కీర్తిదన్ గధ్వీ  భజన సమయంలో పాడిన పాట విని ముగ్ధులైన భక్తులు ఒక్కసారిగా నోట్ల వర్షం కురిపించారు. గుజరాత్‌లోని వల్సద్‌లో జరిగిందీ ఘటన. వల్సద్ అగ్నివీర్ గో సేవా దళ్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాటలు పాడాడు. చుట్టూ ఉన్న వాళ్లు ఒక్కసారి రూ.10, 20,50,100 నోట్లు ఆయనపై వెదజల్లారు. ప్రముఖ వార్తా సంస్థ ANI ఈ వీడియోని ట్విటర్‌లో పోస్ట్ చేసింది. పోడియంపైన కూర్చుని హార్మోనియం వాయిస్తూ కీర్తిదన్ పాట పాడుతున్నాడు. అప్పటి వరకూ కూర్చున్న ప్రేక్షకులంతా ఒక్కసారిగా ముందుకు వచ్చి నోట్లు చల్లడం మొదలు పెట్టారు. మొత్తం వేదిక అంతా కరెన్సీ నోట్లతో నిండిపోయింది. నిజానికి గుజరాత్‌లో ఇదో ట్రెండ్‌ అయిపోయింది. ఫోక్‌ సింగర్స్ ఎవరు ఎక్కడ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇచ్చినా వాళ్లపై ఇలా నోట్ల వర్షం కురిపిస్తారు. అంతే కాదు. ఇలా వచ్చిన డబ్బుని సామాజిక సేవకే వినియోగిస్తారట. అయితే...అనారోగ్యానికి గురైన ఆవులకు చికిత్స అందించడానికి, వాటి బాగోగులు చూడటానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ స్టేజ్‌పై కురిపించిన డబ్బునంతా ఆ ఆవుల ఆరోగ్యం కోసమే ఖర్చు చేస్తారట. అంతకు ముందు నవసరి గ్రామంలోనూ కీర్తిదన్‌ కచేరీ పెట్టగా అప్పుడు ఏకంగా రూ.50 లక్షల నోట్ల  వర్షం ఆయనపై కురిపించారు ఆడియన్స్. 

Published at : 12 Mar 2023 03:55 PM (IST) Tags: Gujarat Viral Video Folk Singer Showered Rupee Notes Showered Notes Kirtidan Gadhvi

సంబంధిత కథనాలు

Alleti Maheshwar Reddy : ఆరు నెలల్లో ఐదు పార్టీలు మారిన చరిత్ర మీది, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి మహేశ్వర్ రెడ్డి కౌంటర్

Alleti Maheshwar Reddy : ఆరు నెలల్లో ఐదు పార్టీలు మారిన చరిత్ర మీది, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి మహేశ్వర్ రెడ్డి కౌంటర్

TSPSC Exam Postpone: పేపర్ల లీకుల ఎఫెక్ట్ - హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష వాయిదా, కొత్త తేదీ ప్రకటించిన టీఎస్ పీఎస్సీ

TSPSC Exam Postpone: పేపర్ల లీకుల ఎఫెక్ట్ - హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష వాయిదా, కొత్త తేదీ ప్రకటించిన టీఎస్ పీఎస్సీ

ABP Desam Top 10, 28 March 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 28 March 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Pulivendula Firing : పులివెందుల కాల్పులకు ఆర్థిక లావాదేవీలే కారణం- ఎస్పీ అన్బురాజన్

Pulivendula Firing : పులివెందుల కాల్పులకు ఆర్థిక లావాదేవీలే కారణం- ఎస్పీ అన్బురాజన్

Merugu Nagarjuna: ఎస్సీ సబ్ ప్లాన్ పనులకు రూ.13,112 కోట్లు ఖర్చు - మంత్రి మేరుగు నాగార్జున

Merugu Nagarjuna: ఎస్సీ సబ్ ప్లాన్ పనులకు రూ.13,112 కోట్లు ఖర్చు  - మంత్రి మేరుగు నాగార్జున

టాప్ స్టోరీస్

KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

KTR On Amaravati :   అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మ‌ర‌డం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మ‌ర‌డం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి