Viral Video: ప్రెసిడెంట్ చుట్టూ చిన్నారి సూపర్ మ్యాన్ చక్కర్లు- వైరల్ వీడియో
Viral Video: ఓ దేశ అధ్యక్షుడు చుట్టూ చిన్నారి సూపర్ మ్యాన్ చక్కర్లు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral Video: ఓ దేశాధ్యక్షుడు సీరియస్‌గా జాతినుద్దేశించి ప్రసంగిస్తోన్న వేళ సూపర్ మ్యాన్ దుస్తులతో చిన్నారి ఆయన చుట్టూ చక్కర్లు కొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఆ చిన్నారి ఎవరు? ఇది ఏ దేశంలో జరిగిందో చూద్దాం.
ఇదీ సంగతి
చిలీ అధ్యక్షుడు గాబ్రియేల్ బోరిక్ సీరియస్‌గా ప్రసంగిస్తున్నారు. అదే సమయంలో ఓ చిన్నారి సూపర్ మ్యాన్ ఆయన చుట్టూ సైకిల్‌పై చక్కర్లు కొట్టాడు. అయితే ఒక దేశ అధ్యక్షుడికి ఏ స్థాయి భద్రత ఉంటుందో అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి చుట్టూ ఇలా చిన్నారి చక్కర్లు కొట్టడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
Superman encircles Gabriel Boric after he submits his vote in today’s plebiscite 🇨🇱 pic.twitter.com/2Tk63noO62
— David Adler (@davidrkadler) September 4, 2022
ఎప్పుడు జరిగింది?
కొత్త రాజ్యాంగానికి మద్దతు ఇవ్వాలంటూ చిలీ ప్రభుత్వం ఇటీవల ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. దీనిపై ఆ దేశ అధ్యక్షుడు గాబ్రియేల్ ప్రసంగించారు. ప్రజలంతా సవరణలకు అనుకూలంగా ఓటు వేయాలని కోరారు. ఆ సమయంలో ఆయన చుట్టూ సూపర్ మ్యాన్ తరహా దుస్తులు ధరించిన ఓ చిన్నారి సైకిల్‌పై చక్కర్లు కొడుతూ కనిపించాడు.
అయితే అధ్యక్షుడు చుట్టూ అంత మంది భద్రతా సిబ్బంది ఉన్నా ఎలాంటి జంకూ లేకుండా చిన్నారి ఆయన చుట్టూ తిరిగాడు. అయితే ఆ చిన్నారి ఎవరు? అలా ఎందుకు తిరగాడు అనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. గతవారం రికార్డ్ అయిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరోవైపు ప్రజాభిప్రాయ సేకరణలో గాబ్రియేల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కొత్త రాజ్యాంగానికి అనుకూలంగా 4.9 మిలియన్ల మంది ఓటు వేశారు. 7.9 మిలియన్ల మంది చిలీ వాసులు దీన్ని వ్యతిరేకించారు.
మరో వీడియో
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు చెందిన కొన్ని వీడియోలు కూడా అప్పుడప్పుడూ వైరల్ అవుతుంటాయి. ఇటీవల బైడెన్ హెలికాప్టర్ దిగి వస్తూ కోటు వేసుకోవడానికి తెగ ప్రయత్నిస్తారు. కానీ ఎంతసేపటికి వేసుకోలేకపోతారు. దీంతో సహాయం కోసం తన భార్య బిల్ బైడెన్ వైపు తిరిగుతారు. చివరికి ఆమె సాయంతో కోటు వేసుకుంటారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
What's going on here? pic.twitter.com/ICzLGFH0bn
— RNC Research (@RNCResearch) August 8, 2022
Also Read: Coal Pilferage Case: దీదీకి షాక్ మీద షాక్- మరో మంత్రి ఇంటిపై సీబీఐ దాడులు!
Also Read: Supreme Court - CJI Lalit: జెట్ స్పీడ్‌లో సుప్రీం కోర్టు విచారణ- 4 రోజుల్లో 1800 కేసులు!