Viral Video: దర్జాగా రోడ్డు దాటిన మొసలి- ఒకసారి ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో!
Viral Video: సౌత్ కరోలినా పార్కులో ఓ మొసలి.. రోడ్డు దాటుతోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral Video: అమెరికాలోని సౌత్ కరోలినాలో ఓ మొసలి దర్జాగా రోడ్డు దాటుతోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హంటింగ్‌టన్ బీచ్ స్టేట్ పార్క్ వద్ద ఒక మొసలి నెమ్మదిగా రోడ్డు దాటుతోంది. మొసలి రోడ్డు దాటుతోన్న సమయంలో కొంతమంది ట్రావెలర్స్ ఫొటోలు, వీడియోలు తీశారు.
నవంబర్ 7న తీసిన ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. మొసలు రోడ్డు మీదుగా అవతలి వైపున ఉన్న గడ్డి లోపలికి వెళ్తున్న సమయంలో ఎడమవైపు ఉన్న కొంతమంది ఫొటోలు తీస్తున్నారు.
మరో వీడియో
ఇలాంటి వీడియోనే ఒకటి ఈ మధ్య వైరల్ అయింది. ఆస్ట్రేలియా ఉత్తర ప్రాంతంలో మొసళ్లు ఎక్కువగా ఉండే ఓ లేక్ ప్రాంతంలో విహారయాత్రకు వెళ్లాడు ఓ వృద్ధుడు. ఏదో ఫ్రై చేసుకుందామని పెనం పట్టుకుని అటూ ఇటూ తిరుగుతున్నాడు. అయితే హఠాత్తుగా ఓ మొసలి చెరువు నుంచి బయటకొచ్చింది. వేగంగా వృద్ధుడి మీదకు దూసుకొచ్చింది. అది వస్తున్న విషయం చూసిన వృద్ధుడు ఏ మాత్రం తడబడలేదు. తన దగ్గర ఉన్న పెనంతో తిరగబడ్డాయి. దాని మూతి మీద ఒక్కటిచ్చాడు.
అలా పెనం దెబ్బ మూతి మీద పడగానే ఆ క్రోకడైల్ కూడా భయపడిపోయింది. వెంటనే వెనక్కి తిరిగి చెరువులోకి వెళ్లిపోయింది. ఇప్పుడీ వైరల్ అవుతోంది. ఆ పెద్దాయనకు కింగ్ కాయ్ హన్సెన్ అని పేరు పెట్టి అందరూ అభినందిస్తున్నారు.
A Northern Territory man has scared off a snappy crocodile with a frying pan after it rushed at him with its mouth agape.
— 10 News First (@10NewsFirst) June 21, 2022
A publican, local legend named 'King Kai Hansen', on Goat Island struck the croc on the nose twice, before the reptile scurried back into the water. pic.twitter.com/zNQ5wvZ5S8
Also Read: World's Strangest Animals: ఈ వింత జంతువులను ఎప్పుడైనా చూశారా? ఎక్కడ ఉంటాయో తెలుసా?