By: Ram Manohar | Updated at : 27 Nov 2022 02:47 PM (IST)
మస్క్ ట్వీట్‌కు యూపీ పోలీస్‌లు ట్వీట్ వైరల్ అవుతోంది. (Image Credits: Twitter)
UP Police reply to Elon Musk Tweet:
ఫన్నీ రిప్లై..
ట్విటర్ సీఈవోగా ఎలన్ మస్క్ బాధ్యతలు తీసుకున్నాక...ఆ కంపెనీలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఆ బాధ్యతలు తీసుకున్న మొదటి రోజు నుంచే తరచూ వార్తల్లో నిలుస్తున్నారు మస్క్. ట్విటర్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఆయన చేసే ట్వీట్లు కూడా క్షణాల్లో వైరల్ అయిపోతున్నాయి. మస్క్ చేసిన ట్వీట్‌కి యూపీ పోలీస్‌లు కూడా స్పందించారు. మస్క్‌కు రిప్లైగా ఇచ్చిన ఈ ట్వీట్
వైరల్ అవుతోంది. "నేను ట్వీట్ చేశాననుకోండి. అది నా పనిలో భాగంగానే అనుకోవాలంటారా..?" అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు ఎలన్ మస్క్. ట్విటర్ తనదే కనుక...ట్వీట్ చేసినా కూడా పని చేసినట్టే కౌంట్ అవుతుందా అని అలా ఫన్నీగా ప్రశ్నించారు. దీనికి యూపీ పోలీస్ ట్విటర్ హ్యాండిల్ నుంచి వచ్చి రిప్లై అందరినీ అలరిస్తోంది. "యూపీ పోలీసులు మీ సమస్యల్ని కేవలం ఓ ట్వీట్‌తో పరిష్కరిస్తే..అది మా పనిలో భాగమే అనుకోవాలంటారా.." అని ట్వీట్ చేసింది. ఇదే స్క్రీన్‌షాట్ తీసి మరో ట్వీట్ చేశారు యూపీ పోలీస్‌లు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.
Yes it does!#TwitterSevaUPP @elonmusk pic.twitter.com/qfGxAdvjkj
— UP POLICE (@Uppolice) November 25, 2022
😂😂 Love it https://t.co/sjgEvvHBt7
— Anshuman Rai (@AnshumanRai3) November 26, 2022
Beautiful reply by @Uppolice https://t.co/W7pW7cbyMZ
— Commando Sumit Bhardwaj (@commando_sumit) November 26, 2022
ట్విటర్లో ఉద్యోగుల కోత ప్రక్రియ ముగిసిందని సమాచారం. త్వరలోనే ఇంజినీరింగ్ ఇతర విభాగాల్లో నియామకాలు మొదలవు తాయని కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ అన్నారు. ఆర్థిక పరిస్థితుల వల్లే ఉద్యోగులను ఇంటికి పంపించాల్సి వచ్చిందనిపేర్కొన్నారు. ఈ మేరకు వెర్జ్ ఓ కథనం ప్రచురించింది. టెస్లా అధినేత ఎలన్ మస్క్ కొన్ని రోజుల క్రితమే మైక్రో బ్లాగింగ్ వేదిక ట్విటర్‌ను కొనుగోలు చేశారు. వెంటనే సంస్థాగత చర్యలు చేపట్టారు. బ్లూటిక్ అంశంలో రకరకాల ప్రయోగాలు చేశారు. కంపెనీ నష్టాలను తగ్గించేందుకు ఉద్యోగులపై వేటు వేశారు. అంతర్జాతీయంగా దాదాపు 7500 మందిని తొలగించారు. ఇంటి వద్ద పనిచేస్తున్న వారికి ఆఫీస్‌కు రావాలని ఆదేశించారు. కఠోరంగా శ్రమించకపోతే ఇంటికి పంపించేస్తామని హెచ్చరించారు.
Also Read: క్రేజీ డెసిషన్స్‌తో పిచ్చెక్కిస్తున్న మస్క్ మామ - ట్రంప్ బాటలోనే కంగనా కూడా!
Elon Musk Twitter: ట్విటర్ అకౌంట్‌ను ప్రైవేట్‌లో పెట్టుకున్న ఎలన్ మస్క్, కారణమిదేనట!
loss in Adani Stocks: కలిసికట్టుగా ₹10 లక్షల కోట్లు - నష్టాన్ని రౌండ్ ఫిగర్ చేసిన అదానీ కంపెనీలు
Adani Enterprises: అదానీ పరువు అక్కడ కూడా పోయింది - డో జోన్స్ నుంచి అదానీ ఎంటర్ప్రైజెస్ ఔట్
BRS Vs BJP: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఖర్మరా బాబూ అంటున్న మంత్రి కేటీఆర్
K Viswanath Passed Away: విజయనగరంతో విశ్వనాథ్‌కు ప్రత్యేక అనుబంధం !
YSRCP Tensions : వైఎస్ఆర్సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?
Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?
Telangana Assembly Budget Sessions : ఈరోజు నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు- గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం!