Pattaya nightclub: బ్యాంకాక్ నైట్ క్లబ్‌లో భారతీయ వీఐపీకి అవమానం - బిల్లు కట్టనందుకు పాయింట్‌బ్లాంక్‌లో గన్ పెట్టి ...
Night Club: పట్టాయా నైట్ క్లబ్‌లకు బాగా అలవాటుపడిన ఓ ఇండియన్ వీఐపీ బిల్లు కట్టకపోవడంతో దాడి చేసికొట్టారు. గన్ను కణతకు గురి పెట్టి చంపుతామని బెదిరించారు.

VIP Indian customer assaulted at Pattaya nightclub: థాయిల్యాండ్‌కు వెళ్లి అక్కడి నైట్ క్లబ్బుల్లో జల్సా చేసే భారతీయ వీఐపీలు చాలా మంది ఉంటారు. వారి వివరాలు బయటకు రావు. కానీ కొన్ని ఘటనలు మాత్రం హైలెట్ అవుతూ ఉంటాయి. ఇటీవల పట్టయా వాకింగ్ స్ట్రీట్‌లో ఉన్న బాస్ క్లబ్‌లో ఓ భారతీయ వీఐపీ టూరిస్ట్‌పై దాడి జరిగింది. 33 ఏళ్ల ఈ భారతీయ వ్యక్తిని క్లబ్ మేనేజర్, సెక్యూరిటీ గార్డులు కలిసి కొట్టారు. బిల్ చెల్లించడంలో గొడవ వచ్చిన కారణంగా అతన్ని తుపాకీ చూపించి బెదిరించి దాడి చేశారు. పాస్‌పోర్ట్ కూడా తీసుకున్నారు.
ఈ ఘటన తర్వాత పోలీసులు క్లబ్‌పై దాడి చేశారు. అక్కడ డ్రగ్స్ వినియోగిస్తున్నారని గుర్తించి క్లబ్‌ను మూసేశారు. సెప్టెంబర్ 26 తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఈ భారతీయ టూ రిస్ట్ పట్టయాలోని ఇండియన్ క్లబ్‌లకు రెగ్యులర్ VIP కస్టమర్. సాధారణంగా బిల్‌ను మరుసటి రోజు బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ ద్వారా చెల్లిస్తాడు. ఆ రోజు కూడా బాస్ క్లబ్‌కు వచ్చాడు. క్లబ్ మేనేజర్ అతన్ని ఆహ్వానించి, అతని బంగారు లాకెట్‌ను తీసుకున్నాడు.
అయితే, క్లబ్ నుంచి బయటకు వెళ్లే సమయంలో లాకెట్ తిరిగి ఇవ్వమని, బిల్‌ను తర్వాత చెల్లిస్తానని ఆ టూరిస్ట్ చెప్పాడు. మేనేజర్ అందుకు ఒప్పుకోకుండా వెంటనే డబ్బు చెల్లించమని గొడవ చేశాడు. గొడవ పెద్దదై, ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఆ టూరిస్ట్ కాళ్లపై కర్రలతో కొట్టారు. మరో ఇండియన్ వ్యక్తి తుపాకీతో బెదిరించాడు. చివరకు అతని పాస్‌పోర్ట్ తీసేసుకుని, బలవంతంగా డబ్బు చెల్లించేలా చేశారు. భయపడిన ఆ టూరిస్ట్ డబ్బు చెల్లించి బయటకు వచ్చాడు. తన లాకెట్ తిరిగి రాలేదని, ఇకపై పట్టయాలో క్లబ్‌లకు వెళ్లడానికి భయంగా ఉందని పోలీసులకు ఫిర్యాదుచేశాడు.
సెప్టెంబర్ 30న పోలీసులు, టూరిస్ట్ పోలీసులు కలిసి బాస్ క్లబ్‌పై దాడి చేశారు. అక్కడ 300 మంది కస్టమర్లు ఉండగా, 9 మంది డ్రగ్స్ టెస్టులో పాజిటివ్‌గా తేలారు. 40 మందికి పైగా విదేశీయులు అక్రమంగా పని చేస్తున్నట్లు కనుగొన్నారు. వీళ్లలో చాలా మంది వర్క్ పర్మిట్ లేకుండా లేదా నకిలీ డాక్యుమెంట్లతో పని చేస్తున్నారు. డ్రగ్స్ తీసుకున్నవాళ్లను అరెస్ట్ చేసి, అక్రమ వర్కర్లను ఇమ్మిగ్రేషన్ అధికారులకు అప్పగించారు. క్లబ్‌ను మూసేసి, దాన్ని శాశ్వతంగా షట్‌డౌన్ చేయాలని అధికారులు సిఫార్సు చేశారు. మేనేజర్ మాత్రం పరారయ్యాడు.
పట్టయాలో ఇండియన్ టూరిస్టుల సంఖ్య బాగా పెరిగింది. కానీ, బిల్ వివాదాలు, కొన్ని అక్రమ కార్యకలాపాల వల్ల ఇలాంటి ఘటనలు కూడా పెరుగుతున్నాయి. గతంలో కూడా ఓ ఇండియన్ టూరిస్ట్‌పై దాడి జరిగిన నివేదికలు ఉన్నాయి. దీని వల్ల టూరిస్టుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.





















