By: Ram Manohar | Updated at : 28 Dec 2022 04:02 PM (IST)
నోయిడాలో ఓ యజమాని పని మనిషిపై దారుణంగా ప్రవర్తించింది. (Image Credits: Twitter)
Viral Video:
నోయిడాలో..
నోయిడాలో యజమానులు, పని మనుషుల మధ్య గొడవలు చాలా కామన్ అయిపోయాయి. ఏదో ఓ కారణంతో...పని మనుషులపై దాడి చేస్తున్నారు యజమానులు. ఇప్పటికే పలు అపార్ట్‌మెంట్‌లలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు మరోసారి ఇలాంటి ఘటనే మరోటి వైరల్ అవుతోంది. లిఫ్ట్‌లో నుంచి పని మనిషిని బలవంతంగా బయటకు లాగుతూ ఓ మహిళ దారుణంగా ప్రవర్తించింది. లిఫ్ట్‌లో ఉన్న సీసీ కెమెరాలో ఇదంతా రికార్డ్ అయింది. ట్విటర్‌లో ఈ వీడియో పోస్ట్ చేయగా...వైరల్ అయింది. మెడను గట్టిగా పట్టుకుని చేతులను కట్టేసి బయటకు లాగిన విజువల్స్ రికార్డ్ అయ్యాయి. నోయిడాలోని క్లియో కౌంటీ సొసైటీలో సెక్టార్ 121లో జరిగిందీ ఘటన. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు నిందితురాలు షెఫాలీ కౌల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితురాలిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం...షెఫాలీ కౌల్ రోజూ చిత్ర హింసలకు గురి చేస్తోంది. ఇంట్లోనే కట్టేసి దారుణంగా కొడుతున్నట్టు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వీడియోపై నెటిజన్లు సీరియస్‌గా రియాక్ట్ అవుతున్నారు. "ఇలాంటి వాళ్లను అలా వదిలేయకూడదు. కఠినంగా శిక్షించాలి" అని కామెంట్ చేస్తున్నారు. "ఎంత దారుణం. ఇలాంటి వాళ్లను చట్ట పరంగా శిక్షించాలి. మనుషుల్ని ట్రీట్ చేసే విధానం ఇది కాదు" అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. "కేవలం నెలకు రూ.2-5 వేల జీతం ఇచ్చి బానిసలుగా చూస్తుంటారు" అని మరొకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మహిళా కమిషన్ తప్పకుండా స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.
#WATCH | Domestic help beaten by a woman in Cleo County society, Noida
— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 27, 2022
On basis of a man's complaint that his daughter was beaten by Shephali Kaul in whose house she worked, case registered at Phase 3 PS. Action to be taken on basis of evidence:ADCP Central Noida
(CCTV visuals) pic.twitter.com/nduQADNzus
Very sad. Guilty should be punished and example to be set.
— Uday P. Maheshwari (@Uday97667) December 28, 2022
This is insane. This woman should be taught a lesson by the law enforcement. No human likes to be treated the way that this worker has been treated by her employer. @PoliceNoida
— Shashidhar Gowda (@mrhustlerh) December 27, 2022
Also Read: PM Modi Mother Health Update: ప్రధాని మోదీ తల్లికి అస్వస్థత- ఆసుపత్రికి తరలింపు!
Gujarat Junior Clerk Exam Cancel: హైదరాబాద్‌లో పేపర్ లీకేజీ కలకలం, జూనియర్ క్లర్క్ ఎగ్జామ్ రద్దు చేసిన గుజరాత్
Breaking News Live Telugu Updates: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ విజేతగా నొవాక్ జకోవిచ్
CM Jagan Delhi Tour : రేపు దిల్లీకి సీఎం జగన్, ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు హాజరు
KTR: ఈ 31న రూ.49 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
Pattipati Pullarao : టీడీపీ సీఎం అభ్యర్థి చంద్రబాబే, వైసీపీలోనే ఆ కన్ఫ్యూజన్ - పత్తిపాటి పుల్లారావు
Nellore Rural MLA: నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు ! వైసీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
BRS Parliamentary Party Meeting: బీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ - ముఖ్యంగా ఆ విషయాలపైనే ఫోకస్ !
Ramana Dikshitulu : ఏపీలో ఆలయాల పరిస్థితి దయనీయం, రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు
Australian Open 2023: 2023ను రికార్డుతో మొదలెట్టిన ‘జోకర్’ - పదో ఆస్ట్రేలియన్ ఓపెన్ సొంతం!