News
News
X

PM Modi Mother Health Update: ప్రధాని మోదీ తల్లికి అస్వస్థత- ఆసుపత్రికి తరలింపు!

PM Modi Mother Health Update: ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ మోదీ ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తరలించారు.

FOLLOW US: 
Share:

PM Modi Mother Health Update: ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ (100)ని ఆసుపత్రికి తరలించారు. ఆమె అస్వస్థతకు గురికావడంతో అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఇటీవల ముగిసిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాని మోదీ తన తల్లిని కలిశారు. గుజరాత్‌లో రెండో దశ పోలింగ్‌కు ఒకరోజు ముందు డిసెంబర్ 4న.. గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లోని తన తల్లి నివాసానికి వెళ్లిన మోదీ.. ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. అంతకుముందు, జూన్ 18న ఆమె 100వ పుట్టినరోజు సందర్భంగా తల్లి హీరాబెన్‌తో ప్రధాని మోదీ గడిపారు.

సోదరుడికి

ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీకి కర్ణాటకలోని మైసూరులో మంగళవారం యాక్సిడెంట్ జరిగింది. ఈ కారు ప్రమాదంలో ఆయన గాయపడ్డారు. ప్రహ్లాద్ మోదీ తన కుటుంబంతో కలిసి బందీపుర్‌కు వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. 

మీడియా కథనాల ప్రకారం, ప్రమాదం జరిగిన సమయంలో ప్రహ్లాద్ మోదీ భార్య, కుమారుడు మెహుల్, కోడలు, మనవడు మేనత్‌లు ఆయన వెంట ఉన్నారు. మెర్సిడెస్ బెంజ్‌లో ఆయన తన కాన్వాయ్‌తో పాటు బందీపుర్‌కు వెళుతుండగా మధ్యాహ్నం 2 గంటల సమయంలో కారు డివైడర్‌ను ఢీకొట్టింది.

టైమ్స్ నౌ ప్రకారం.. ప్రహ్లాద్ మోదీ, ఆయన కుటుంబ సభ్యులు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం JSS ఆసుపత్రిలో చేర్చారు. కడ్కోళ్ల అనే ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆయన డ్రైవర్ సత్యన్నారాయణకు కూడా గాయాలయ్యాయి. ప్రహ్లాద్ మోదీకి ప్రమాదం తప్పినట్లు సమాచారం.

ప్రహ్లాద్ మోదీ.. ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ ఫెడరేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్. 66 ఏళ్ల ప్రహ్లాద్.. 2001లో సంస్థ స్థాపించినప్పటి నుంచి అందులో ఉన్నారు. హీరాబెన్ మోదీకి జన్మించిన ఆరుగురు పిల్లలలో ప్రహ్లాద్ నాలుగో సంతానం.

Also Read: Bharat Jodo Yatra: 'జోడో యాత్రకు భద్రత కల్పించండి'- అమిత్ షాకు కాంగ్రెస్ లేఖ

Published at : 28 Dec 2022 01:39 PM (IST) Tags: PM Modi Mother PM Narendra Modi Mother Admitted In Hospital pm modi mother age pm modi mother health update

సంబంధిత కథనాలు

Stocks to watch 03 February 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - SBI, ITC మీద ఓ కన్నేయండి

Stocks to watch 03 February 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - SBI, ITC మీద ఓ కన్నేయండి

ABP Desam Top 10, 3 February 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 3 February 2023:  ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Petrol-Diesel Price 03 February 2023: ఏపీలో భగ్గుమన్న చమురు ధరలు, తెలంగాణలో స్థిరంగా రేట్లు

Petrol-Diesel Price 03 February 2023: ఏపీలో భగ్గుమన్న చమురు ధరలు, తెలంగాణలో స్థిరంగా రేట్లు

Gold-Silver Price 03 February 2023: భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు - సామాన్యుడు కొనే పరిస్థితే లేదు

Gold-Silver Price 03 February 2023: భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు - సామాన్యుడు కొనే పరిస్థితే లేదు

Jee Main 2023 answer key: జేఈఈ మెయిన్‌ సెషన్‌ 1 ప్రాథమిక కీ విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

Jee Main 2023 answer key: జేఈఈ మెయిన్‌ సెషన్‌ 1 ప్రాథమిక కీ విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

టాప్ స్టోరీస్

KCR Political strategy : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?

KCR Political strategy : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?

K Viswanath : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక

K Viswanath : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!

Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!