By: ABP Desam | Updated at : 11 Aug 2021 11:35 AM (IST)
Representational Image/Pixabay
అతడు ఓ గ్యాంగ్ రేప్ కేసులో ఏడేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. బెయిల్ ఇప్పించేందుకు అతడి భార్య చేయని ప్రయత్నమంటూ ఏదీ లేదు. చివరికి.. ఆమె హైకోర్టును ఆశ్రయించి.. తన బాధను వెల్లడించింది. తనకు తల్లిని కావాలని ఉందని, ఇందుకు తన భర్తకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరింది. అయితే, కోర్టు ఆమె విన్నపాన్ని తోసిపుచ్చలేదు. దీనిపై న్యాయ నిపుణుల అభిప్రాయాన్ని కోరింది.
ఉత్తరాఖండ్‌కు చెందిన సచిన్ ఓ గ్యాంగ్ రేప్ కేసులో అరెస్టయ్యాడు. కోర్టు అతడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. గత ఏడేళ్లుగా అతడు జైల్లోనే ఉంటున్నాడు. దీంతో అతడి భార్య ఒంటరి జీవితాన్ని గడుపుతోంది. ఈ నేపథ్యంలో కనీసం పిల్లలు కనేందుకైనా తన భర్తకు కొన్ని రోజులు బెయిల్ ఇవ్వాలని ఉత్తరాఖండ్ హైకోర్టును ఆశ్రయించింది.
ఈ కేసును పరిశీలించిన హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి.. న్యాయ మిత్ర సలహా కోరారు. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి కేసులపై ఎలాంటి తీర్పునిచ్చారో తెలుసుకోవాలని తెలిపారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ తదితర దేశాల్లో ఇలాంటి కేసుల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాయో తెలుసుకుని తమకు తెలియజేయాలని పిటీషనర్ తరపు న్యాయవాదిని కోరారు. తల్లి కావాలని కోరుకోవడం భార్యగా ఆమె హక్కు అని, ఆమె విజ్ఞప్తిని కొట్టిపడేయలేమని వెల్లడించారు.
సామూహిక అత్యాచారం కేసులో కఠిన కారాగార శిక్ష అనభవిస్తున్న ఖైదీని ఇలా పిల్లలను కనడం కోసం విడుదల చేయవచ్చా? అని హైకోర్టు సందేహం వ్యక్తం చేసింది. అలాగే, తండ్రి జైల్లో ఉంటే ఆ బిడ్డను పోషించడం తల్లికి భారం కాదా? అని ప్రశ్నించారు. ఇంట్లో తండ్రి ఉనికి లేకపోతే పిల్లల మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? ఖైదీని పిల్లలను కనేందుకు అనుమతిస్తే.. అతడి బిడ్డ బాగోగులకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? భవిష్యత్తులో అతడి బిడ్డ పితృత్వం కోసం హక్కును కోరే అవకాశాలపై కూడా వివరణాత్మక సమాచారం కావాలని హైకోర్టు కోరింది. ఖైదీ సచిన్ కుటుంబికులు ఇప్పటికే రెండుసార్లు బెయిల్ కోసం ప్రయత్నించగా కోర్టు తిరస్కరించింది. మరి అతడి భార్య పెట్టుకున్న పిటీషన్‌పై ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Also Read: అది దెయ్యమేనా? కెమేరాకు చిక్కిన వింత ఆకారం.. నాగపూర్ ప్రజల్లో గుబులు!
Also Read: ‘ఫస్ట్ నైట్’ బెడ్‌ను రోజా పూలతోనే అలంకరించాలట.. ఎందుకో తెలుసా?
Also Read: విచిత్రం.. ఇతడికి కడుపు లేదు, పేగుల్లేవు.. అయినా బతికేస్తున్నాడు!
Bank CEO Quits: క్యాబ్ డ్రైవర్ అకౌంట్‌లోకి 9వేల కోట్లు - ఆ బ్యాంకు సీఈవో రాజీనామా!
Chandrayaan 3: రేపటి నుంచి చంద్రుడిపై రాత్రి సమయం, ఇక భారత్‌కు నిరాశేనా?
Rainbow Hospitals: గుండె లోపాలు జయించిన చిన్నారులతో రెయిన్బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ వరల్డ్ హార్ట్ డే వేడుకలు
న్యూడ్ ఫోటోల కోసం టీనేజ్ బాలికపై ఒత్తిడి, ఒప్పుకోనందుకు పోలీసుల్నే హడలెత్తించాడు!
Ganesh Immersion: 250 మంది పోకిరీల అరెస్ట్, మందుబాబులూ మీరే ఆలోచించుకోవాలి - సీపీ ఆనంద్
Chandrababu Naidu Arrest : చంద్రబాబు కేసుల్లో కక్ష సాధింపు లేదు - కోర్టే రిమాండ్ విధించింది - సజ్జల కీలక వ్యాఖ్యలు
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
CM Jagan: ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ప్రారంభించిన సీఎం - దీంతో ప్రయోజనాలు ఇవే
Shiva Rajkumar: హీరో సిద్ధార్థ్‌కు క్షమాపణలు చెప్పిన కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్
/body>