News
News
X

SP Leader Car Hit By Truck: షాకింగ్ వీడియో- ఎస్‌పీ నేత కారును ఢీ కొట్టి ఈడ్చుకెళ్లిన ట్రక్కు!

SP Leader Car Hit By Truck: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ ట్రక్కు సమాజ్‌వాదీ పార్టీ నేత కారును ఢీ కొట్టింది.

FOLLOW US: 

SP Leader Car Hit By Truck: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఓ నాయకుడి కారును ఢీ కొట్టింది. అంతేకాకుండా ఆ కారును సుమారు అర కిలోమీటరు వరకు ఈడ్చుకెళ్లింది.

ఇదీ జరిగింది

సమాజ్‌వాదీ పార్టీ మెయిన్‌పురి జిల్లా అధ్యక్షుడు దేవేంద్ర సింగ్‌ కారును ఓ ట్రక్కు ఆదివారం రాత్రి ఢీ కొట్టింది. అనంతరం దాన్ని 500 మీటర్లు ట్రక్కుతోపాటే ఈడ్చుకెళ్లాడు డ్రైవర్. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

హత్య కుట్రా?

కారును ఢీ కొట్టిన అనంతరం ట్రక్కును ఆపాలని అక్కడున్న వారు వెంబడించినా డ్రైవర్ పట్టించుకోలేదు. వాహనాన్ని అలాగే వేగంగా పోనిచ్చాడు. 500 మీటర్ల దూరం వెళ్లాకా ఆగాడు.

ట్రక్కు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్‌ను యూపీలోని ఇటావాకు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఉద్దేశపూర్వకంగానే కారును ఢీ కొట్టారా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లేకుంటే కారును ఢీ కొట్టిన వెంటనే డ్రైవర్.. ట్రక్కును ఎందుకు ఆపలేదనే ప్రశ్న వినిపిస్తోంది. 

" మొయిన్‌పురి జిల్లాలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఓ ట్రక్కు వేగంగా వచ్చి సమాజ్‌వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడి కారును ఢీ కొట్టి ఈడ్చుకెళ్లింది. దీనిపై కేసు నమోదు చేశాం. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం.                                                 "
-పోలీసులు

ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సమాజ్‌వాదీ పార్టీ నేతకు చెందిన కారు కావడంతో రాజకీయ విమర్శలు కూడా వెల్లువెత్తాయి.

మరో ఘటన

దిల్లీలోని ఆనంద్‌ విహార్ పోలీస్‌ స్టేషన్‌లో ఇటీవల జరిగిన ఓ ఘటన వైరల్‌గా మారింది. 10 నుంచి 12 మంది అల్లరి మూక ఒకేసారి పోలీస్‌ స్టేషన్‌లోకి చొరబడ్డారు. అక్కడున్న హెడ్ కానిస్టేబుల్‌ను దుర్భాషలాడుతూ రెచ్చిపోయారు. అనంతరం కానిస్టేబుల్‌పై దాడి చేశారు. ఈ ఘటన ఆగస్టు 3నే జరిగినప్పటికీ ఆలస్యంగా బయటకు వచ్చింది.

Also Read: Patra Chawl Scam Case: సంజయ్‌ రౌత్‌కు మళ్లీ షాక్- ఆగస్టు 22 వరకు జుడీషియల్ కస్టడీ!

Also Read: Bihar Politics: BJPకి రాంరాం- కాంగ్రెస్, RJDతో నితీశ్ కుమార్ చర్చలు!

Published at : 08 Aug 2022 04:21 PM (IST) Tags: up mainpuri SP leader’s car hit dragged by truck

సంబంధిత కథనాలు

Petrol Price Today 07 October 2022: వాహనదారులకు ఊరట, స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు - అక్కడ భారీగా

Petrol Price Today 07 October 2022: వాహనదారులకు ఊరట, స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు - అక్కడ భారీగా

Gold Rate Today 07 October 2022: పసిడి ప్రియులకు షాక్ - ఎగబాకిన బంగారం ధరలు, ఊరటనిచ్చిన వెండి 

Gold Rate Today 07 October 2022: పసిడి ప్రియులకు షాక్ - ఎగబాకిన బంగారం ధరలు, ఊరటనిచ్చిన వెండి 

Weather Updates: అల్పపీడనం ఎఫెక్ట్ - 3 రోజులపాటు అక్కడ అతి భారీ వర్షాలు, IMD ఆరెంజ్ అలర్ట్

Weather Updates: అల్పపీడనం ఎఫెక్ట్ - 3 రోజులపాటు అక్కడ అతి భారీ వర్షాలు, IMD ఆరెంజ్ అలర్ట్

ABP Desam Top 10, 7 October 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 7 October 2022:  ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Anil Kumar Yadav : ఎన్టీఆర్ కొడుకులు చంద్రబాబుకు దాసోహం, మనవళ్లైనా టీడీపీని లాక్కోండి- అనిల్ కుమార్

Anil Kumar Yadav : ఎన్టీఆర్ కొడుకులు చంద్రబాబుకు దాసోహం, మనవళ్లైనా టీడీపీని లాక్కోండి- అనిల్ కుమార్

టాప్ స్టోరీస్

ఏపీ సీఐడికి లేక రాసిన విజయ్‌- కేసుల వివరాలు చెప్పాలని డిమాండ్

ఏపీ సీఐడికి లేక రాసిన విజయ్‌- కేసుల వివరాలు చెప్పాలని డిమాండ్

IND vs SA, Match Highlights: సంజు సక్సెస్ - మ్యాచ్ డెడ్ - ఒక్కడి ఊపు సరిపోలేదు!

IND vs SA, Match Highlights: సంజు సక్సెస్ - మ్యాచ్ డెడ్ - ఒక్కడి ఊపు సరిపోలేదు!

Sajjala Ramakrishna Reddy : మా విధానం మాకుంది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

Sajjala Ramakrishna Reddy :  మా విధానం మాకుంది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

Adipurush Director Om Raut : మేం ఏ తప్పూ చేయలేదు - నా రావణుడు ఇంతే!

Adipurush Director Om Raut : మేం ఏ తప్పూ చేయలేదు - నా రావణుడు ఇంతే!