Uttam Kumar Reddy to visit Medigadda: మేడిగడ్డ సందర్శించాలని మంత్రి ఉత్తమ్ నిర్ణయం, వెంట వాళ్లు ఉండాలని అధికారులకు ఆదేశాలు
Kaleshwaram Project: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై నీటిపారుదల, నీటిపారుదల, ఫుడ్ అండ్ సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తొలిసారి సమీక్ష నిర్వహించారు.
Telangana Minister Uttam Kumar Reddy: హైదరాబాద్: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై నీటిపారుదల, నీటిపారుదల, ఫుడ్ అండ్ సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తొలిసారి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుపై, పెండింగ్ ప్రాజెక్టులపై సమీక్ష జరిపారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద పిల్లర్ కుంగుబాటుపై అధికారులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వివరించారు. మేడిగడ్డ నిర్మాణానికి రూ.4,600 కోట్లు వెచ్చించినట్లు మంత్రికి తెలిపారు. అయితే మేడిగడ్డలో ఓ పిల్లర్ ఒక మీటర్ మేర కుంగడంతో మరో మూడు పిల్లర్లపై దీని ప్రభావం పడిందన్నారు. మొత్తంగా చూస్తే బ్యారేజీ నాలుగు పిల్లర్లపై ప్రభావం పడిందని, దాన్ని ఏం చేయాలనే దానిపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పిల్లర్లు కుంగిన వెంటనే ప్రాజెక్టులో నీటిని ఖాళీ చేశామని, ఆ తరువాత పిల్లర్లు కుంగడం తగ్గినట్లు మంత్రి ఉత్తమ్ కు అధికారులు వివరించారు.
మేడిగడ్డ బ్యారేజీ సందర్శించాలని మంత్రి ఉత్తమ్ నిర్ణయం
ఈ సమీక్షలో భాగంగా తాను మేడిగడ్డ బ్యారేజీని సందర్శించాలని భావిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు చెప్పారు. ఈ మేరకు తాను మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మేడిగడ్డ నిర్మించిన ఏజెన్సీతో పాటు పర్యవేక్షించిన అధికారులను సైతం తన సందర్శన సమయంలో వెంట ఉండేలా చూడాలని సూచించారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఎంత వెచ్చించారు, ఎంత ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలని ప్లాన్ చేశారు, ఒక్కో ఎకరాకు సాగునీరుకు అయ్యే ఖర్చులపై నీటిపారుదల శాఖ అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు మేడిగడ్డ బ్యారేజీ వద్ద పిల్లర్ల కుంగుబాటుపై బీఆర్ఎస్ పై కాంగ్రెస్, బీజేపీలు తీవ్ర విమర్శలు చేశాయి. అయితే వాస్తవాలు తెలియకుండా ఆరోపణలు, విమర్శలు చేయడం తగదని గత బీఆర్ఎస్ ప్రభుత్వం సైతం అదే స్థాయిలో