UP Election 2022: ఎన్నికలకు ముందే యోగికి అఖిలేశ్ గిఫ్ట్.. ఏంటో తెలుసా?
సమాజ్‌వాదీ పార్టీ ఫుల్ జోష్‌లో ఉంది. తాజాగా ఆ పార్టీ అధికార ప్రతినిధి.. భాజపా కార్యాలయానికి ఓ గిఫ్ట్ పంపారు. ఎన్నికల తర్వాత దాన్ని ఉపయోగించాలని సలహా ఇచ్చారు. ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా?
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ భాజపా నుంచి సమాజ్‌వాదీ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. దీంతో సమాజ్‌వాదీ పార్టీ అధికార ప్రతినిధి ఐపీ సింగ్ భాజపాకు ఓ గిఫ్ట్ పంపించారు. ఏం గిఫ్ట్ తెలుసా? తాళం కప్ప. అవును.. మార్చి 10న ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత భాజపా కార్యాలయానికి తాళం వేయడానికి ఈ లాక్‌ను పంపించారట.
లఖ్‌నవూలోని హజ్రాత్ గంజ్, విధాన సభ 7 అనే చిరునామాకు ఈ తాళం కప్ప షిప్పింగ్ అయిన మెసేజ్‌ను ఆయన తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
ओमप्रकाश राजभर जी,जयंत चौधरी जी,
— I.P. Singh (@IPSinghSp) January 11, 2022
राजमाता कृष्णा पटेल जी,संजय चौहान जी और अब स्वामीप्रसाद मौर्य जी समाजवादी पार्टी के साथ हैं।
मैंने BJP मुख्यालय पर @swatantrabjp जी को एक ताला तोहफे के रूप में भेज दिया है, 10 मार्च के बाद लगा घर लौट जाइएगा।
लहर नहीं, अब सपा की आँधी चल रही है। pic.twitter.com/DOu4v58L4G
భాజపాకు షాక్..
ఎన్నికలకు ముందు భాజపాకు యూపీలో షాక్ తగిలింది. మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య తన కేబినెట్ పదవికి రాజీనామా చేసి సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. తన రాజీనామా లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
తన రాజీనామా లేఖలో కూడా స్వామి ప్రసాద్ మౌర్య ఇదే కారణం చెప్పారు. అంతేకాంకుండా రానున్న రోజుల్లో మరింత మంది భాజపా ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారని జోస్యం చెప్పారు.
దేశంలో కీలకమైన ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపుర్ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు విడతలుగా ఎన్నికలు జరపనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అన్ని రాష్ట్రాల ఎన్నికలకు కౌంటింగ్ మార్చి 10న నిర్వహించనున్నారు
Also Read: ABP CVoter Survey: యూపీకి యోగి, ఉత్తరాఖండ్‌కు హరీశ్ రావత్.. సీఎంలుగా వీళ్లే కావాలట!
Also Read: ABP C-Voter Survey: యూపీలో భాజపా హవా.. ఉత్తరాఖండ్‌లోనూ కాషాయం జోరు.. పంజాబ్‌లో మాత్రం!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి