US Mid Term Election: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఐదుగురు ఇండియన్ అమెరికన్లు, అలా జరిగితే రికార్డే
US Mid Term Election: అమెరికాలోని మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతికి చెందిన నేతలు పోటీ చేయనున్నారు.
US Mid Term Election:
ఇప్పటికే నలుగురు..
అమెరికాలో దిగువ సభకు మధ్యంతర ఎన్నికలు నవంబర్ 8వ తేదీన జరగనున్నాయి. భారత సంతతికి చెందిన ఐదుగురు అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. House of Representativesకు తాము కచ్చితంగా ఎన్నికవుతాయమని ధీమాగా ఉన్నారు. అక్కడి ఒపీనియన్ పోల్స్ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ప్రస్తుతానికి నలుగురు సిట్టింగ్ ఎంపీలు మరోసారి ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారిలో అమి బేర, రాజా కృష్ణమూర్తి, ఆర్‌వో ఖన్నా, ప్రమీల జైపాల్ ఉన్నారు. వీరితో పాటు ఈ సారి బడా వ్యాపారి శ్రీ తనేదర్ కూడా ఈ సభకు ఎన్నికవుతారని అంతా అంచనా వేస్తున్నారు. మిచిగన్‌లోని 13వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఆయన పోటీ చేయనున్నారు. అయితే...ప్రస్తుతం భారత సంతతికి చెందిన ఎంపీల్లో అమీ బేర చాలా సీనియర్. కాలిఫోర్నియాలోని సెవెంత్ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆరోసారి ఆయన పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. వీరితో పాటు ఖన్నా, కృష్ణమూర్తి, జైపాల్ నాలుగో సారి House of Representatives మధ్యంతర ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
అక్కడి రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం చూస్తే...రిపబ్లికన్ అభ్యర్థులతో పోల్చి చూస్తే..ఈ నలుగురూ రాజకీయంగా బలంగాఉన్నారు. ఈ ఎన్నికల్లో మొదటి సారి పోటీ చేస్తున్న శ్రీ తనేదర్ కూడా గట్టి పోటీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఆయన కూడా గెలిస్తే...దిగువ సభకు ఎన్నికైన భారతీయ మూలాలున్న ఐదో ఎంపీగా రికార్డు సృష్టిస్తారు తనేదర్. అమెరికాలోని దిగువ సభకు ఎన్నికైన భారత సంతతికి చెందిన తొలి మహిల ప్రమీల జైపాల్ (57). అయితే..ఈ ఎన్నికల్లో మేరీలాండ్ నుంచి మరో ఇండియన్ అమెరికన్ మహిళ పోటీ చేయనున్నారు. Maryland House of Delegates మాజీ సభ్యురాలైన అరుణ మిల్లర్ విజయం సాధిస్తే..ఈ ప్రాంతం నుంచి దిగువ సభకు ఎన్నికైన మరో ఇండియన్ అమెరికన్‌గా చరిత్రలో నిలిచిపోతారు.
మరోసారి పోటీ చేస్తానన్న ట్రంప్..
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు అవే సంకేతాలిస్తున్నాయి. 2024లో జరిగే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని స్పష్టం చేశారు ట్రంప్. ఓ మీటింగ్‌కు హాజరైన ఆయన..."తరవాతి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారా" అన్న ప్రశ్నకు "తప్పకుండా చేస్తాను" అని సమాధానిచ్చినట్టు BBC రిపోర్ట్ చేసింది. మిడ్‌టర్మ్ ఎన్నికల్లో భాగంగా రిపబ్లికన్ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్న ఆయన ఓ ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. 2020లో జరిగిన ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ట్రంప్ మరోసారి ఆరోపించారు. "నేను రెండుసార్లు అధ్యక్ష పదవికి పోటీ చేశాను. మొదటి సారి కంటే రెండోసారి ఎక్కువ మొత్తంలో ఓట్లు సాధించాను. 2020లో జరిగిన ఎన్నికల్లో ఇప్పటి వరకూ ఏ సిట్టింగ్ అధ్యక్షుడికీ రాని స్థాయిలో నాకు ఓట్లు వచ్చాయి" అని స్పష్టం చేశారు.
Also Read: Imran Khan Attack: 'చూస్తున్నాం, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాం'- ఇమ్రాన్ ఖాన్ కాల్పుల ఘటనపై భారత్