By: ABP Desam | Updated at : 30 Nov 2022 10:41 AM (IST)
Edited By: Murali Krishna
(Image Source: Twitter)
UP Massive Fire: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఫిరోజాబాద్ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు.
ఇదీ జరిగింది
జస్రానా ప్రాంతంలోని పాధమ్ పట్టణంలో మంగళవారం ఇన్వర్టర్ బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పెద్దలు, ముగ్గురు పిల్లలు మొత్తం ఆరుగురు మరణించారని ఫిరోజాబాద్ ఎస్‌పీ తెలిపారు.
Uttar Pradesh | *3adults & 3children of a family lost their lives in fire that was ignited due to short circuit in an inverter *battery, in Padham town of Jasrana area under Firozabad district. 18 fire tenders reached on spot along with Police: Ashish Tiwari, SP Firozabad Police
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 29, 2022
ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే 18 అగ్నిమాపక యంత్రాలు, పోలీసులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ అప్పటికే ఆరుగురు మృతి చెందారు.
సీఎం దిగ్భ్రాంతి
ఈ ఘటనలో జరిగిన ప్రాణనష్టంపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి తగిన చికిత్స అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. మృతుల కుటుంబాలకు తక్షణమే రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను అందజేస్తామని సీఎం ప్రకటించారు.
#UPCM @myogiadityanath ने जनपद फिरोजाबाद के जसराना में एक दुकान में आग लगने की दुर्घटना में हुई जनहानि पर गहरा दुःख प्रकट किया है।
— CM Office, GoUP (@CMOfficeUP) November 29, 2022
मुख्यमंत्री जी ने दिवंगतों की आत्मा की शांति की कामना करते हुए शोक संतप्त परिजनों के प्रति संवेदना व्यक्त की है।
मुख्यमंत्री जी ने इस दुर्घटना में मृतकों के परिजनों को ₹2-2 लाख की आर्थिक सहायता राशि तत्काल वितरित किए जाने के निर्देश दिए हैं।
— CM Office, GoUP (@CMOfficeUP) November 29, 2022
Also Read: Uttar Pradesh: దూసుకెళ్లిన ఎంపీ కాన్వాయ్, చికిత్స పొందుతూ 9 ఏళ్ల బాలుడు మృతి
Petrol-Diesel Price 30 January 2023: తిరుపతిలో భారీగా పెరిగిన పెట్రోల్ రేటు, తెలంగాణలో స్థిరంగా ధరలు
Gold-Silver Price 30 January 2023: ₹58 వేలను దాటేలా కనిపిస్తున్న పసిడి, కొద్దికొద్దిగా పెరుగుతోంది
ABP Desam Top 10, 30 January 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్
-Rahul Gandhi In Srinagar: ప్రతిపక్షాల మధ్య విభేదాలున్నా, ఆరెస్సెస్- బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతాం: రాహుల్ గాంధీ
Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ
Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!
Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్
IND vs NZ 2nd T20: న్యూజిలాండ్‌పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ - మూడో మ్యాచ్ గెలిస్తే సిరీస్ మనదే!