News
News
X

Earth Like Planets : ఈ విశ్వంలో బతికేందుకు అవకాశం ఉన్న గ్రహాలివే!

Earth Like Planets : ఈ అనంత విశ్వంలో భూమి లాంటి గ్రహాలు ఉన్నాయా? ఉంటే వాటిపై జీవులు ఉన్నాయా? ఈ ప్రశ్నలపై ఎందరో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. వాటికోసం అన్వేషిస్తున్నారు.

FOLLOW US: 

Earth Like Planets :  మనిషిని ఎప్పుడూ భయం వెంటాడుతూ ఉంటుందేమో. ఈరోజు ఈ క్షణం కన్నా రేపటి కోసం కంగారు పడుతూ ఉంటాడు. ఉన్నట్లుండి ఈ భూమిపై బతికే పరిస్థితులు మాయమైపోతే ఎలా. ఊహించలేని విపత్కర పరిస్థితులు ఉక్కిరిబిక్కిరి చేస్తే ఎలా. ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అవుతున్నా మనిషి  బతికే పరిస్థితులు భూమిపైన తప్ప ఇంకెక్కడైనా ఉన్నాయా అనే ప్రశ్నకు సమాధానం లభించకపోతే తనను తాను ఈ విశ్వంలో చిన్నపిల్లాడిలా ఊహించుకోవాలన్న ఊహను కూడా రానీయడు. మానవజాతికి ఉన్న కామన్ కాన్షియన్ నెస్ చెప్పేది ఒక్కటే భూమి మాత్రమే మనిషికి శాశ్వత స్థావరం కాదు. కోట్లకు కోట్లు జనాభా పెరిగిపోతున్న మన భూగోళం మీద ఏదో రోజు ఇప్పటిలా మనిషి ప్రశాంతంగా బతికే పరిస్థితులు ఉండకపోవచ్చు. లేదు కొన్ని లక్షల సంవత్సరాలుగా ఇక్కడే బతుకుతున్న మానవ జాతి మరో జాతి చేతిలో చిక్కనూ చిక్కవచ్చు. సో ఈ ప్రశ్నలకే సమాధానమే అసలు ఈ విశ్వం ఎంత పాతది అని వెతికేలా చేస్తోంది. ఇప్పుడు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ను అంతరిక్షంలో పరిశోధనలు చేసేది ఈ అనంత విశ్వంలో మనం మాత్రమే ఉన్నామా అనే ఆ పాత ప్రశ్నకు సమాధానం వెతకటం కోసమే.

1960 నుంచి అతి పెద్ద రేడియో ఏంటినాల సాయంతో భూమిపైనే కాకుండా ఈ విశ్వంలో మరెక్కడైనా ప్రాణులున్నాయా అని రోదసినంతా జల్లెడ పడుతున్నాం కానీ లాభంలేదు. కాలిఫోర్నియాలో ఏర్పాటు చేసిన టెలిస్కోపుల సముదాయం. విశ్వంలో మానవేతర నాగరికతలు అన్వేషించటమే పనిగా ఉన్న SETI లాంటి సంస్థలు వీటన్నింటి పరిశోధనలకు మూలం మానవనాగరికతకు తోడుగా నిలిచే మరో గ్రహాంతర నాగరికత కోసమే. సరే నాసా శాస్త్రవేత్తల పరిశోధనల ఆధారంగా ఈ విశ్వంలో మానవజాతి బతికేందుకు అనుకూలంగా ఉండొచ్చు భావిస్తున్న ప్రదేశాలు ఏమన్నా ఉన్నాయా. ఓసారి చూద్దాం. మన సోలార్ సిస్టంలో అయితే  మన చంద్రుడు, మార్స్, శని ఉపగ్రహం ఎన్ సిలడస్ లాంటివి కాస్తంత హోప్ ను ఇచ్చే గ్రహాలు ఉపగ్రహాలే. 

ప్రాక్సిమా సెంటారీ బీ

భూమి నుంచి 4.2 కాంతి సంవత్సరాల దూరంలో మాత్రమే ఉంటుంది ఈ ప్రాక్సిమా సెంటారీ బీ. భూమికి అతిదగ్గరగా ఉన్న భూమి లాంటి గ్రహం ఇదే. అంతే కాదు ఇక్కడ జీవం ఉండేందుకు కూడా ఆస్కారం ఉంది.  రేడియో వెలాసిటీ మెథడ్ ద్వారా ఇది ఉన్నట్లు 2016లో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మోడ్రన్ క్యాలుక్యులేషన్స్ వాడటం ద్వారా తేలింది ఏంటంటే. ప్రాక్సిమా సెంటారీ బీలో నీటి జాడలు కూడా ఉండి ఉండొచ్చని. భూమికి, దానికి ఉన్న వ్యాల్యూస్ క్యాలుక్యులేట్ చేస్తే వస్తున్న తేడా 0.87 మాత్రమే. సో భూమి లక్షణాలకు చాలా దగ్గరగా ఉన్న గ్రహం అది.

ట్రాపిస్ట్ 1E

అక్వేరియస్ కాన్స్టలేషన్ లో ఓ రెడ్ డార్ఫ్ స్టార్ ట్రాపిస్ట్ 1. దీని చుట్టూ మొత్తం ఏడు గ్రహాలు ఉన్నాయి. వాటిలో ఒకటి భూమికి అతి దగ్గర పోలికలతో ఉంది. సిమిలారిటీస్ లో ఇండెక్స్ లో 0.85-0.92 మాత్రమే తేడాతో భూమిని పోలిన క్యాల్యుకేషన్స్ తో ఉంది. భూమి కంటే కొంచెం చిన్నగా ఉండే ఈ గ్రహం భూమి నుంచి 40 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ట్రాపిస్ట్ 1 ఈ పైన సముద్రాలు ఉండొచ్చని భావిస్తున్నారు. కానీ ఇది ఎప్పుడు ఒకవైపు మాత్రమే దాని స్టార్ ను చూస్తూ ఉంది. సో స్టార్ కి ఎక్స్ పోజ్ ఆ రెండో వైపు మొత్తం ఫ్రోజెన్ గా ఉండే అవకాశం ఉందని ఇక్కడ జీవం ఉండేందుకు ఆస్కారం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

లైటెన్ B

లైటెన్ B నే గ్లీజ్ 27౩B కూడా అంటారు. ఇది మొత్తం రాకీ రాకీ ప్లానెట్. దాని రెడ్ డార్ఫ్ స్టార్ చుట్టూ ఈ ప్లానెట్ తిరుగుతూ ఉంది. దీనిపైన లైట్ అండ్ హీట్ బాగా ఉండటంతో పాటు ఆ రెడ్ డార్ఫ్ స్టార్ కు దగ్గరగా ఉండటంతో ఈ ఎక్సో ప్లానెట్ పైన జీవం ఉండేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. భూమి నుంచి 12.2 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ లైటెన్ B కూడా జీవం ఉండేందుకు అవకాశం ఉన్న ఎక్సో ప్లానెట్స్ లో ఒకటి. భూమికి దగ్గరగా జీవం ఉండేందుకు ఆస్కారం ఉన్న ఐదో గ్రహంగా లైటెన్ B ఉండటంతో SETI ప్రాజెక్ట్ వాళ్లు దీనిమీదకు భూమి నుంచి సిగ్నల్స్ పంపారు. మన వాళ్లు పంపిన వాళ్లు సిగ్నల్స్ అక్కడికి చేరుకోవటానికి 12 ఏళ్లు పడుతుంది. అక్కడ నిజంగా ఎవరైనా ఉంటే దాని రిప్లై రావటానికి ఇంకో 12 ఏళ్లు పడుతుంది . సో మొత్తంగా 2041 నాటికి ఈ గ్రహం గురించిన సమాచారం అందే అవకాశం ఉంది.

కే2-72 E

2016లో కెప్లెర్ మీద వర్క్ చేస్తున్న శాస్త్రజ్ఞులు కే2 72 E కనుగొన్నారు. ఇది కూడా దాని స్టార్ చుట్టూ హ్యాబిటబుల్ జోన్ లో తిరుగతూ ఉంది. రెడ్ డార్ఫ్ స్టార్ అయిన కే2 భూమి నుంచి 217 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. కే2 72E తో పాటు మరో మూడు ఎక్సో ప్లానెట్స్ మీద కూడా కెప్లర్ తో రీసెర్చ్ చేస్తున్నారు.  

 గ్లీస్ 667 CF

భూమి నుంచి 22 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది గ్లీస్ 667 CF. దాని స్టార్ చుట్టూ తిరుగుతున్న ఈ రాకీ ప్లానెట్ పైన నీరు ఉండొచ్చని ప్రాణం ఉండేందుకు ఆస్కారం ఉఁదని శాస్త్రవేత్తలు అభిప్రాయం. ఇప్పటికీ యాక్టివ్ గా స్పేస్ పరిశోధనలు గ్లీస్ 667 CF మీద జరుగుతున్నాయి

GJ 3322B

సూపర్ ఎర్త్స్ లో ఒకటిగా పిలుచుకునే GJ3322B భూమికంటే రెండు రెట్లు పెద్దది. అది కూడా ఓ యుక్తవయస్సులో ఉన్న స్టార్ చుట్టూ తిరుగుతోంది ఈ గ్రహం. 2017 లో కనుగొన్నఈ గ్రహం మీద పరిశోధన జరుగుతున్నాయి ఇంకా దీని మీద జీవం ఉండేందుకు కావాల్సిన పరిస్థితులపైనా పరిశోధనలు సాగిస్తున్నారు శాస్త్రవేత్తలు.

టీ గార్డెన్ B

భూమికి దగ్గరగా ఉన్న 30 గ్రహాల్లో ఇదొక్కటి. 12.5 కాంతి సంవత్సరాల దూరంలోనే ఉన్న ఈ గ్రహంపైకి రేడియో సిగ్నల్స్ పంపటం శాస్త్రవేత్తలకు తేలికైన పని. టీ గార్డెన్ బీ తో పాటు సీ కూడా జీవం ఉండేందుకు ఆస్కారం ఉండే గ్రహం కావొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భూమికంటే కొంచెం పెద్దదైన ఈ గ్రహంలో నీరు ద్రవరూపంలోనే ఉండొచ్చని భావిస్తున్నారు.

ఇవే కాకుండా మొత్తం 4 వేల గ్రహాలను శాస్త్రవేత్తలు ఇప్పటి వరకూ గుర్తించారు. వీటిలో జీవం ఉండేందుకు ఆస్కారం ఉన్న గ్రహాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉంది. భూమి తప్ప మరో ఏదైనా గ్రహం మానవజాతికి భవిష్యత్తులో ఆవాసం కానుందా అనే ఆలోచనలపై ఆశలు రేకెత్తిస్తోంది.

Published at : 10 Jul 2022 08:30 PM (IST) Tags: Earth earth like planet Webb telescope Universe life in other planets

సంబంధిత కథనాలు

Venkaiah Naidu : దేశ రాజకీయాల్లో ఇక వెంకయ్యనాయుడు పాత్రేంటి ? రాజకీయంగా రిటైర్మెంటేనా ?

Venkaiah Naidu : దేశ రాజకీయాల్లో ఇక వెంకయ్యనాయుడు పాత్రేంటి ? రాజకీయంగా రిటైర్మెంటేనా ?

Bihar: బిహార్‌లో ఈ అనూహ్య మార్పు వెనక ఆమె హస్తం ఉందా? నితీష్ మనసు ఉన్నట్టుండి ఎలా మారింది?

Bihar: బిహార్‌లో ఈ అనూహ్య మార్పు వెనక ఆమె హస్తం ఉందా? నితీష్ మనసు ఉన్నట్టుండి ఎలా మారింది?

Independence Day 2022: ఈసారి ఎర్రకోటలోని స్వాతంత్య్ర వేడుకలకు ఓ స్పెషాల్టీ ఉంది, అదేంటో తెలుసా?

Independence Day 2022: ఈసారి ఎర్రకోటలోని స్వాతంత్య్ర వేడుకలకు ఓ స్పెషాల్టీ ఉంది, అదేంటో తెలుసా?

TS Cabinet Meet : తెలంగాణ కేబినెట్ భేటీ, మునుగోడు ఉపఎన్నికపై చర్చ!

TS Cabinet Meet : తెలంగాణ కేబినెట్ భేటీ, మునుగోడు ఉపఎన్నికపై చర్చ!

Breaking News Live Telugu Updates: యూపీలో 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా- నాలుగు మృతదేహాలు వెలికితీత

Breaking News Live Telugu Updates: యూపీలో 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా- నాలుగు మృతదేహాలు వెలికితీత

టాప్ స్టోరీస్

MP Gorantla Madhav Issue : ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై ప్రధానికి లేఖ రాసిన పంజాబ్ ఎంపీ

MP Gorantla Madhav Issue : ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై ప్రధానికి లేఖ రాసిన పంజాబ్ ఎంపీ

Rayachoti Crime : కోడలి తల నరికిన అత్త, తలతో పోలీస్ స్టేషన్ కు!

Rayachoti Crime :  కోడలి తల నరికిన అత్త, తలతో పోలీస్ స్టేషన్ కు!

NBK108 Announcement : ఇంతకు ముందు ఎప్పుడూ చేయనటువంటి పాత్రలో నందమూరి బాలకృష్ణ

NBK108 Announcement : ఇంతకు ముందు ఎప్పుడూ చేయనటువంటి పాత్రలో నందమూరి బాలకృష్ణ

కొత్త తరహా ఆండ్రాయిడ్ వెర్షన్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - 1000 జీబీ వరకు స్టోరేజ్ కూడా!

కొత్త తరహా ఆండ్రాయిడ్ వెర్షన్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - 1000 జీబీ వరకు స్టోరేజ్ కూడా!