తుది నివేదిక వచ్చాకే విమాన ప్రమాదంపై క్లారిటీ - పైలట్లు వరల్డ్ క్లాస్ - రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు
Ahmedabad plane crash: విమాన ప్రమాద నివేదికపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. తుది నివేదిక వచ్చాక అసలు కారణం తెలుస్తుందన్నారు.

Ahmedabad plane crash: అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై భారతీయ విమాన ప్రమాద పరిశోధన బ్యూరో (AAIB) ప్రారంభ నివేదికపై కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు స్పందించారు. AAIBకి సహాయం చేయడానికి .. అన్ని సంబంధిత వర్గాలను సమన్వయం చేస్తున్నామని తెలిపారు. మంత్రిత్వ శాఖలో ఈ నివేదికను విశ్లేషిస్తున్నామన్నారు. త్వరలో తుది నివేదికను కూడా వస్తుందని.. ఆ తర్వాత ఏదైనా నిర్ధారణకు రాగలుగుతామన్నారు.
రామ్ మోహన్ నాయుడు ANIతో మాట్లాడారు. 'పైలట్‌లు సిబ్బంది విషయంలో ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన శ్రామిక శక్తి మనకు ఉందని నమ్ముతున్నాను. పైలట్‌లు సిబ్బంది విమానయాన పరిశ్రమకు వెన్నెముక లాంటివారు.' అని స్పష్టం చేశారు.
#WATCH | Vizag | On AAIB's preliminary report on AI 171 crash, Union Civil Aviation Minister Ram Mohan Naidu Kinjarapu says, "This is a preliminary report, at the ministry we are analysing it...We are coordinating with AIBB for any support they need. We are hoping that the final… pic.twitter.com/UsJB7yD1Xj
— ANI (@ANI) July 12, 2025
AAIB నివేదికలో ఏమన్నారు?
భారతీయ విమాన ప్రమాద పరిశోధన బ్యూరో (AAIB) ప్రాధమిక వేదిక ప్రకారం, ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన 30 సెకన్లు మాత్రమే ఆకాశంలో ఉంది. రెండు ఇంజిన్‌ల ఇంధన కట్ఆఫ్ స్విచ్‌లు 'RUN' నుండి 'CUTOFF'కి మారాయి. అంటే ఇంజిన్‌కు ఇంధనం అందడం ఆగిపోయింది. ఇంజిన్‌కు ఇంధనం అందకపోవడంతో అది శక్తిని కోల్పోయింది. విమానం కూలిపోయింది.
తక్కువ ఎత్తు కారణంగా RAT పని చేయలేదు
విమానం టేకాఫ్ అయిన కొద్ది సెకన్లలోనే రెండు ఇంజిన్‌లు ఆగిపోయాయి, దీనివల్ల అది అవసరమైన శక్తిని పొందలేకపోయింది. దీని తరువాత, రామ్ ఎయిర్ టర్బైన్ (RAT), ఇది విమానానికి అత్యవసర శక్తి అవసరమని హెచ్చరిస్తుంది. కానీ తక్కువ ఎత్తులోనే ఇంధనం ఆగిపోవడంతో ఇది పని చేయలేదు. అయితే, దీని తరువాత, పైలట్ ఇంజిన్‌ను ప్రారంభించడానికి ప్రయత్నించాడు, కాని అప్పటికే చాలా ఆలస్యమైంది. విమానం కూలిపోయింది.
AAIB ప్రాథమిక నివేదికపై వ్యాఖ్యానించడానికి విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా నిరాకరించింది. ఇదే విషయాన్ని ఎక్స్ పెట్టిన పోస్టులో వెల్లడించింది. "దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. అందుకే ప్రస్తుత వెలుగులోకి వచ్చిన విషయాలపై మేము వ్యాఖ్యానించలేం. దర్యాప్తునకు కావాల్సిన సమాచారాన్ని మేము AAIBకి పంపుతున్నాము." అని తెలిపింది.
Air India stands in solidarity with the families and those affected by the AI171 accident. We continue to mourn the loss and are fully committed to providing support during this difficult time.
— Air India (@airindia) July 11, 2025
We acknowledge receipt of the preliminary report released by the Aircraft Accident…





















