By: ABP Desam | Updated at : 27 Jul 2021 07:30 PM (IST)
mirabhai
టోక్యో ఒలింపిక్స్ 2020లో 49 కేజీల విభాగంలో రజతం సాధించిన భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. మీరాబాయి చానుకు స్వాగత వేడుకపై ఈశాన్య ప్రాంత అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖల కేంద్ర మంత్రి జి .కిషన్ రెడ్డి స్పందించారు. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ క్రీడలలో రజతం సాధించి దేశం గర్వించేలా చేసిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానును అభినందిస్తూ ఓ సందేశాన్ని పంపారు.
‘జపాన్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ 2020 క్రీడల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజత పతకం సాధించిన పద్మశ్రీ సైఖోమ్ మీరాబాయి చానుకు నా హృదయపూర్వక అభినందనలు. భారతమాత గర్వించేలా మన దేశ అమ్మాయిలు ప్రతిష్టాత్మక క్రీడలలో పతకాలు సాధించడం పట్ల నా హృదయం గర్వంతో ఉప్పొంగుతున్నది. ఒలింపిక్ పోడియంపై రజక పతకం మెడలో ధరించి మీరాబాయి భారతదేశానికి చెందిన ప్రతి ఒక్కరి హృదయాన్నీ గెలుచుకుంది.
దృఢసంకల్పం, నిరంతర కృషి , సవాళ్లను అధిగమించాలనే తపన.. మనం కన్న కలలను సాధించడానికి ఏకైక మార్గం అని వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను మరోసారి నిరూపించారు. టోక్యో ఒలింపిక్ గేమ్స్‌లో ఆమె సాధించిన విజయం కేవలం క్రీడా ప్రపంచానికే కాకుండా, లక్ష్యం సాధించాలని అనుక్షణం ప్రయత్నించే ప్రతి ఒక్కరికి ప్రేరణగా నిలుస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
మిరాబాయి చాను సోమవారం రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసింది. ఈ సందర్భంగా మీరాబాయిని ఆయన సన్మానించారు. అంతేకాదు రూ.2 కోట్ల నగదు, ఈశాన్య రైల్వేలో ప్రమోషన్ ఇస్తున్నట్లు ప్రకటించారు. మీరాబాయి తన నైపుణ్యం, కఠోర శ్రమ, మొక్కవోని దీక్షతో కోట్లాది మంది భారతీయులలో స్ఫూర్తి నింపిందని అశ్విని వైష్ణవ్ అన్నారు. ఆమెను కలవడం, సన్మానించడం సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. ఇప్పటికే ఈశాన్య రైల్వేలో పని చేస్తున్న ఆమెను ఇప్పుడు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (స్పోర్ట్స్)గా ప్రమోట్ చేశారు.
వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను సుదీర్ఘ ప్రయాణానికి టోక్యో ఒలింపిక్స్ రజత పతకం తొలిమెట్టుగా నిలుస్తుంది. భవిష్యత్తులోనూ ఆమె సాధించనున్న మరిన్ని విజయాలను చూసి మనందరం గర్వించే క్షణాలకు టోక్యో విజయం నాందిగా నిలవనుంది. మీరాబాయి చాను అద్భుతమైన ప్రయాణంలో ఆమెకు తోటి భారతీయులందరి మద్దతు ఉంటుందని విశ్వసిస్తున్నాను. దేశానికి అంతర్జాతీయ పురస్కారాలను అందించటంలో, అత్యున్నత క్రీడా పతకాలను సాధించటంలో ఈశాన్య రాష్ట్ర యువత క్రీడల పట్ల చూపిస్తున్న ఉత్సాహం, వారి చురుకైన క్రీడా సంస్కృతి, దోహద పడుతున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు.
కాగా, టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం అందించిన తొలి క్రీడాకారిణిగా వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను నిలిచారు. 49 కేజీల విభాగంలో రజత పతకం సాధించి త్రివర్ణ పతాకం రెపరెపలాడించిన మీరాబాయికి మణిపూర్ ప్రభుత్వం తగిన గౌరవం కల్పించింది. పోలీస్ శాఖలో అడిషనల్ సూపరింటెండ్ ఆఫ్ పోలీస్‌గా నియమించాలని నిర్ణయం తీసుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో విజయం అనంతరం స్వదేశానికి చేరుకున్న మీరాబాయికి పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు.
Rs 2 Lakh Pension: మీరు 40ల్లోకి వచ్చారా, రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.2 లక్షల పెన్షన్ పొందాలంటే ఇప్పుడెంత పెట్టుబడి పెట్టాలి?
NITW: వరంగల్ నిట్‌లో గ్రూప్-డి పోస్టుల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ
Palaniswami in Vijayawada: ఏపీలో తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి - విజయవాడ దుర్గమ్మ దర్శనం
Tollywood Drugs Case: సినీ భాషలో డ్రగ్స్ దందా, పెడ్లర్ ను రైటర్ అని, డ్రగ్స్ కావాలంటే ‘షల్ వీ మీట్’ అంటూ కోడ్స్
అనుభవం లేకపోయినా ప్రజల్నే నమ్ముకున్నా, గోద్రా అల్లర్లపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణేష్ నిమజ్జనం రేపే, ఉదయం 11:30కి హుస్సేస్ సాగర్‌లో
Ram Skanda Movie : 'స్కంద' కోసం రామ్ ఎన్ని కిలోల బరువు పెరిగారో తెలుసా?
AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, నేడే చివరి రోజు - సభ ముందుకు కీలక బిల్లులు
Tiger 3 Teaser : 'టైగర్ 3'లో సల్మాన్ ఖాన్ దేశభక్తుడా? దేశ ద్రోహిగా మారాడా?
/body>