అన్వేషించండి

Budget 2025 : కేంద్ర బడ్జెట్ 2025 - పరిశోధన, అభివృద్ధి, మౌలిక సదుపాయాలకు కేటాయింపులపై నిపుణుల అంచనాలు

Budget 2025 : పార్లమెంట్ లో బడ్జెట్ 2025 ప్రవేశపెట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా రక్షణ శాఖలో ఆర్ అండ్ డీ, మౌలిక సదుపాయాలపై కేటాయింపులను నిపుణులు అంచనా వేస్తున్నారు.

Budget 2025 : 2025 -26 సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అయితే పలు రంగాలకు కేటాయింపులను నిపుణులు అంచనా వేస్తున్నారు. 2024-25లో రక్షణ మంత్రిత్వ శాఖ (MoD)కు రూ. 6,21,940.85 కోట్లు కేటాయించారు. ఇది మంత్రిత్వ శాఖలలోనే అత్యధికం. ఇది 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేటాయింపుల కంటే దాదాపు రూ. 1 లక్ష కోట్లు (18.43 శాతం) ఎక్కువ, 2023-24 ఆర్థిక సంవత్సరం కంటే 4.79 శాతం ఎక్కువ. ఈ సారి బడ్జెట్ లో ఏసింగ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ విత్ iDEX (ADITI) పథకం ద్వారా ఇన్నోవేషన్‌కు రూ. 400 కోట్లు కేటాయించారు. 2025-26 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సమయం సమీపిస్తున్నందున, ఇతర విషయాలతోపాటు పరిశోధన & అభివృద్ధి, సంస్కరణలపై దృష్టి కేంద్రీకరించనున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు.

రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పై ముందుకు

జియోపాలిటికల్ డైనమిక్స్‌ను భారతదేశం విజయవంతంగా మార్గనిర్దేశం చేస్తోందని కార్బోరండమ్ యూనివర్సల్ లిమిటెడ్ మార్కెటింగ్ హెడ్ సుబ్బు వెంకటాచలం కొనియాడారు. 2025 డిఫెన్స్‌లో 'సంస్కరణల సంవత్సరం'గా మన ఆత్మనిర్భర్త ఆశయానికి మరింత దగ్గరవుతుందని ఆయన అన్నారు. ముఖ్యంగా మూలధన వ్యయంపై గణనీయంగా కేటాయింపులు ఉండడడం వినూత్న సాంకేతికతలను రంగంలోకి తీసుకువచ్చేందుకు, సైనిక ఆధునికీకరణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు వీలు కల్పిస్తుందని వెంకటాచలం చెప్పారు. దేశీయ ఉత్పత్తికి ఇది ప్రోత్సాహకరంగా ఉంటుందన్నారు. సైనిక వైఖరిని మరింత బలపర్చేందుకు దేశీయ ఉత్పత్తి సామర్థ్యం, ఆవిష్కరణ సామర్థ్యాలను విస్తరించడం చాలా కీలకమని, ఈ కేటాయింపులు విశ్వసనీయత, బాధ్యతను ప్రోత్సహిస్తుందన్నారు. "ప్రస్తుత కేటాయింపులు డిఫెన్స్‌పై స్టాండింగ్ కమిటీ 3 శాతం కంటే తక్కువగా ఉన్నందున, కీలకమైన ప్రాధాన్యతల కోసం ఖర్చును పెంచడానికి మాకు విస్తారమైన అవకాశాలు ఉన్నాయి" అని చెప్పారు.

ఇది పరిశోధనతో పాటు డెవలప్‌మెంట్ లైఫ్‌సైకిల్‌ను వేగవంతం చేయడానికి, ఖర్చులను తగ్గించడానికి, కొత్త వ్యూహాలను, ఆవిష్కరణలను ప్రోత్సాహాన్ని ఇస్తుందని వెంకటాచలం అభిప్రాయపడ్డారు. అగ్రశ్రేణి సంస్థలలో పరిశోధనా విభాగాలను అభివృద్ధి చేయడానికి, అనేక రకాల ఆన్-గ్రౌండ్ సవాళ్లను పరిష్కరించడానికి ఇది సహాయపడుతుందని చెప్పారు. సైనికులతో పాటు వారి వాహనాలకు భద్రత, రక్షణ అత్యున్నత ప్రమాణాలను నిర్ధారిస్తుందన్నారు. ఇక డీఆర్డీవో ఛైర్మన్ ఇటీవల సూచించిన విధంగా ఆర్ అండ్ డీపై బడ్జెట్ వ్యయాలను ప్రస్తుత 5 శాతం నుండి 15 శాతానికి పెంచడం, రక్షణ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్ధవంతంగా అభివృద్ధి చేయడంలో సహాయపడుతుందని చెప్పారు. ఇది భారతదేశానికి గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తుందని, ముఖ్యంగా నెక్ట్స్ జనరేషన్ ఏరో ఇంజన్ సామర్థ్యాలను మరింత పెంచుతుందన్నారు.

మౌలిక సదుపాయాల ఖర్చును పెంచడం

ఇక రక్షణ రంగానికి కేటాయింపులపై ఇంద్రజల్ సీఈవో & సహ వ్యవస్థాపకుడు కిరణ్ రాజు మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాల ఖర్చులను పెంచడంపై కేంద్రం దృష్టి పెడుతుందని చెప్పారు. ప్రభుత్వం మన సాయుధ బలగాలను ఆధునీకరించడం, సరిహద్దు, తీర ప్రాంత భద్రతను పటిష్టం చేయడం, భారతదేశాన్ని ముందుకు నడిపించడానికి భవిష్యత్ ను ఆశించి అవసరమైన నిర్ణయాలు తీసుకోవడం వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తోందని, ఇది పురోగతి దశను సూచిస్తుందన్నారు. ఈ కేటాయింపులు కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాయన్నారు. చాలా రాష్ట్రాలు ఇప్పటికే డ్రోన్ వినియోగంలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించినప్పటికీ, అధిక మొత్తంలో డ్రోన్‌లకు మద్దతు ఇచ్చే మౌలిక సదుపాయాలు ఇప్పటికీ లేవన్నారు. డ్రోన్ సామర్థ్యాలను బలోపేతం చేయడంతో పాటు, స్వదేశీ డ్రోన్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. రాబోయే సంవత్సరాల్లో భారతదేశాన్ని మరింత స్వావలంబన, సురక్షితమైన దేశంగా మార్చేందుకు బడ్జెట్ 2025 ఒక ముఖ్యమైన దశను సూచిస్తుందని చెప్పారు.

Also Read : Budget 2025: కేంద్ర బడ్జెట్‌ ప్రజెంటేషన్‌ ప్రత్యక్ష ప్రసారాన్ని ఆన్‌లైన్‌లో ఎలా చూడాలి, ఏ సమయంలో బడ్జెట్‌ ఉంటుంది?

టాప్ హెడ్ లైన్స్

Smriti Mandhana Dominance : ప్రపంచ నంబర్ వన్ పీఠంపై స్మృతి మంధాన తిరుగులేని హవా.. గిల్ ,షెఫాలీలకు ఐసీసీ అవార్డులు
ప్రపంచ నంబర్ వన్ పీఠంపై స్మృతి మంధాన తిరుగులేని హవా.. గిల్ ,షెఫాలీలకు ఐసీసీ అవార్డులు
CM Vijay And Chandrababu Meeting: చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ.. దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్కంఠ, చర్చించిన అంశాలివే
చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ.. దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్కంఠ, చర్చించిన అంశాలివే
CM Vijay: సీఎం హోదాలో తొలిసారి ఏపీకి.. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న విజయ్‌
సీఎం హోదాలో తొలిసారి ఏపీకి.. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న విజయ్‌
AP Local Body Elections: గెజిట్ నోటిఫికేషన్ వచ్చాక ఎన్నికల షెడ్యూల్.. ఆన్‌లైన్‌లో నామినేషన్ల విజ్ఞప్తి పరిశీలన: ఏపీ ఎస్ఈసీ
గెజిట్ నోటిఫికేషన్ వచ్చాక ఎన్నికల షెడ్యూల్.. ఆన్‌లైన్‌లో నామినేషన్ల విజ్ఞప్తి పరిశీలన: ఏపీ ఎస్ఈసీ

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget