By: ABP Desam | Updated at : 25 Sep 2021 10:32 AM (IST)
Edited By: RamaLakshmibai
Sneha Dubey
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని ఇమ్రాన్ తన ప్రసంగంలో కోరారు. పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలకు యూఎన్‌లోని భారత ప్రతినిధి స్నేహ దూబే కౌంటర్ ఇచ్చారు. జమ్మూకశ్మీర్, లడాఖ్‌లు.. ఎప్పటికీ ఇండియాలోనే భాగమని ఆమె స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్, లడాఖ్‌లను ఇండియా నుంచి ఎవరూ వేరు చేయలేరన్నారు. ఉగ్రవాదులకు పాకిస్థాన్ అడ్డాగా మారుతోందని ఆమె ఆరోపించారు. ఉగ్రవాదులను పాక్ పెంచి పోషిస్తున్న విషయాన్ని ప్రపంచ దేశాలు బహరంగంగా అంగీకరిస్తున్నాయని ఆమె అన్నారు.
Also Read: క్వాడ్' సదస్సులో శాంతి మంత్రం.. వ్యాక్సిన్ సరఫరా, ప్రపంచ భద్రతే లక్ష్యం
యూఎన్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఉగ్రవాదులు ఎక్కువ శాతం పాకిస్థాన్‌లో ఉన్న విషయాన్ని గ్రహించాలని దూబే తెలిపారు. ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్న చరిత్ర పాకిస్థాన్‌కు ఉందని ఆమె ఆరోపించారు. ఒసామా బిన్ లాడెన్‌కు పాకిస్థానే ఆశ్రయం ఇచ్చిందన్నారు. ఇప్పటికీ ఆ ఉగ్రవాదిని పాకిస్థాన్ ఓ అమరుడిగా గుర్తిస్తోందన్నారు. పాకిస్థాన్ ఓ అరాచక దేశమని, కానీ ప్రపంచ దేశాలకు భిన్నంగా కనిపించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. పాక్ అవలంబిస్తున్న విధానాల వల్లే ఉగ్రవాదులు పెట్రేగిపోతున్నారని దూబే పేర్కొన్నారు. సుదీర్ఘకాలం నుంచి ఇండియా, పాక్ మధ్య ఉన్న కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించేందుకు అత్యవసర చర్యలు చేపట్టాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ కోరారు. వీడియో లింకు ద్వారా ఆయన యూఎన్ సమావేశాల్లో మాట్లాడారు. భారత్ సైనిక సామర్థ్యాన్ని పెంచుకుంటోందని, అత్యాధునిక అణ్వాయుధాలను డెవలప్ చేస్తోందని, దీని వల్ల రెండు దేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. భారత్‌లో హిందూ తీవ్రవాదం పెరుగుతోందని, దీని వల్ల ముస్లిం జనాభాకు సమస్య వస్తోందని ఇమ్రాన్ ఆరోపించారు.
Also Read: లిక్విడ్ లడ్డూ ఎలా చేయాలంటే.. సెలెబ్రిటీ చెఫ్ సరాంశ్ ఇన్ స్టా పోస్టు వైరల్
Also Read: సీఎం జగన్ కాలికి గాయం... దిల్లీ పర్యటన రద్దు... దిల్లీ చేరుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్
Also Read: పాటంటే బాలుకు ప్రాణం.. గొంతుకు సర్జరీ జరిగినా ఆపలేదు గానం
Also read: శ్రీవారి సర్వ దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల..ఈ లింక్స్ క్లిక్ చేసి టికెట్లు బుక్ చేసుకోండి
APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్‌కు 6,455 మంది ఎంపిక!
Hyderbad Crime : ఆన్లైన్ లో కాంటాక్ట్ చేసి హైదరాబాద్ కు రప్పించి, వ్యాపారి నుంచి డైమండ్ కొట్టేసిన కేటుగాడు
AP Localbody Elections: ఏపీలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలకు త్వరలో ఎన్నికలు, నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ
Traffic Challans: సామాన్యుడికి ఓ న్యాయం - సార్లకో న్యాయమా ? బోత్ ఆర్ నాట్ సేమ్ ఎందుకు!
Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్
Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?
IND vs NZ 1st T20: భారత్ ముందు పోరాడే లక్ష్యం ఉంచిన న్యూజిలాండ్ - చివరి ఓవర్లో చితక్కొట్టుడు!
BBC Documentary Row: ప్రధాని మోదీపై డాక్యుమెంటరీ వివాదం, ఢిల్లీ వర్సిటీ వద్ద రచ్చ రచ్చ - పలువురు విద్యార్థుల అరెస్ట్
నిరుద్యోగులకు గుడ్ న్యూస్, మరో 2391 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ అనుమతి!