X

Delhi Tour: సీఎం జగన్ కాలికి గాయం... దిల్లీ పర్యటన రద్దు... దిల్లీ చేరుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్

ఏపీ సీఎం జగన్ దిల్లీ పర్యటన రద్దైంది. ఆయన కాలు బెణకడంతో వైద్యుల సూచన మేరకు ఆయన పర్యటన రద్దు చేస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే దిల్లీ చేరుకున్నారు.

FOLLOW US: 

ఏపీ సీఎం జగన్‌ దిల్లీ పర్యటన రద్దైంది. శుక్రవారం ఉదయం వ్యాయామ సమయంలో సీఎం జగన్‌ కాలు బెణికింది. సాయంత్రానికి  కూడా నొప్పి తగ్గకపోవడంతో డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో సీఎం దిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. సీఎం జగన్‌కు బదులుగా హోంమంత్రి మేకతోటి సుచరిత ఇవాళ దిల్లీ వెళ్లనున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నేతృత్వంలో జరిగే సమావేశంలో హోంమంత్రి పాల్గొంటారు.

Also Read: కేశినేని రాజకీయ వైరాగ్యం.. ఇక పోటీకి దూరం !

సీఎం కేసీఆర్ దిల్లీ టూర్

తెలంగాణ సీఎం కేసీఆర్ దిల్లీకి చేరుకున్నారు. బీఏసీ భేటీ.. తర్వాత బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో దిల్లీకి వెళ్లారు. దిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్​కు టీఆర్ఎస్ లోక్​సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు స్వాగతం పలికారు. మూడు రోజుల పాటు సీఎం కేసీఆర్ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవ్వనున్నారు. సీఎం కేసీఆర్​తో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కూడా దిల్లీకి చేరుకున్నారు. సీఎం కేసీఆర్ శనివారం కేంద్ర జల్​శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్​తో కేసీఆర్ సమావేశమవుతారు. కృష్ణా, గోదావరి నదీ జలాల అంశాలు, నదీ యాజమాన్యబోర్డుల పరిధి నోటిఫికేషన్ సంబంధిత అంశాలపై కేసీఆర్ చర్చిస్తారు.

Also Read:  ఒకటే ఫోటో .. కేటీఆర్, విజయసాయిరెడ్డి ప్రచారం ! ఇంతకీ ఎవరిది ఫేక్ ?

మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో సమావేశం

ఆదివారం కేంద్ర హోంశాఖ నిర్వహించే సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గోనున్నారు.​మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశమవుతున్నారు. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలపైనా అమిత్ షా చర్చిస్తారు. హోంశాఖ సమావేశం అనంతరం కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్​తో కేసీఆర్ భేటీ అవుతారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపైనా సీఎం కేసీఆర్ చర్చిస్తారు. ఆదివారం సాయంత్రం కేసీఆర్ తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. 

Also Read:  భారీ రిక్రూట్‌మెంట్‌కు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్... వైద్య, ఆరోగ్యశాఖలో 14,200 పోస్టుల భర్తీకి ఆమోదం

Also Read: కాంగ్రెస్‌లో ఎవరూ హీరోలు కాదు.. రేవంత్‌పై ఊగిపోయిన జగ్గారెడ్డి !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: cm kcr AP News TS News AP Cm Jagan KCR Delhi Tour cm jagan delhi tour

సంబంధిత కథనాలు

AP HighCourt :  పోలీసు శాఖలో వారిని విలీనం చేయడంపై పిటిషన్ ! ఎలా చేశారో చెప్పాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం !

AP HighCourt : పోలీసు శాఖలో వారిని విలీనం చేయడంపై పిటిషన్ ! ఎలా చేశారో చెప్పాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం !

Anantapur: తల్లి మృతదేహంతో తహసీల్దారు కార్యాలయంలో ఆందోళన... పాసుపుస్తకం రాలేదని మనస్తాపంతో మహిళా రైతు మృతి..!

Anantapur: తల్లి మృతదేహంతో తహసీల్దారు కార్యాలయంలో ఆందోళన... పాసుపుస్తకం రాలేదని మనస్తాపంతో మహిళా రైతు మృతి..!

Breaking News Live Updates: హుజూరాబాద్ ఉప ఎన్నికలు.. మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ

Breaking News Live Updates: హుజూరాబాద్ ఉప ఎన్నికలు.. మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ

Chandra Babu : దొరకని మోడీ, షా అపాయింట్‌మెంట్లు.. ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన!

Chandra Babu : దొరకని మోడీ, షా అపాయింట్‌మెంట్లు.. ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన!

Crime News: భర్తను చంపితే బీమా డబ్బులొస్తాయని ప్లాన్.. ప్రియుడితో కలిసి స్కెచ్.. చివరకు..

Crime News: భర్తను చంపితే బీమా డబ్బులొస్తాయని ప్లాన్.. ప్రియుడితో కలిసి స్కెచ్.. చివరకు..
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Prabhas: మళ్లీ ముంబైకు ప్రభాస్... రాముడికి టాటా చెప్పిన తర్వాతే!

Prabhas: మళ్లీ ముంబైకు ప్రభాస్... రాముడికి టాటా చెప్పిన తర్వాతే!

Romantic Badass Trailer: దుమ్మురేపుతున్న ‘రొమాంటిక్’ బదాస్ ట్రైలర్.. ఊపిచ్చే డైలాగులతో రచ్చ!

Romantic Badass Trailer: దుమ్మురేపుతున్న ‘రొమాంటిక్’ బదాస్ ట్రైలర్.. ఊపిచ్చే డైలాగులతో రచ్చ!

Beating the Groom: వరుడిని చితకొట్టాలి.. వధువుపై ఉమ్మేయాలి.. ఎట్టెట్టా? ఇది వాళ్ల ఆచారమట!

Beating the Groom: వరుడిని చితకొట్టాలి.. వధువుపై ఉమ్మేయాలి.. ఎట్టెట్టా? ఇది వాళ్ల ఆచారమట!

Sleeping Bus: ఫుడ్ పెట్టి జోల పాడే ‘స్లీపింగ్ బస్సు’, కుంభకర్ణులకే ప్రత్యేకం... ప్రపంచంలోనే తొలి సర్వీసు

Sleeping Bus: ఫుడ్ పెట్టి జోల పాడే ‘స్లీపింగ్ బస్సు’, కుంభకర్ణులకే ప్రత్యేకం... ప్రపంచంలోనే తొలి సర్వీసు