China: నిప్పులు మింగాలి... అశుద్ధం తినాలి - ఉద్యోగులకు విచిత్రమైన టెస్టులు పెడుతున్న చైనా కంపెనీలు
Viral News: చైనా కంపెనీలు తమ ఉద్యోగులను రాచి రంపాన పెడుతున్నాయి. సంస్థపై విధేయత చాటుకోవడానికి నిప్పులు మింగాలి... అశుద్ధం తినాలి అనే టెస్టులు పెడుతున్నాయి.
China Office Asks Employees To Eat Fire Clad Cotton Buds : ఉద్యోగుల్లో ఆత్మవిశ్వాసం నింపడానికి, వారిలో సంస్థపై విధేయత పెంచడానికి ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు రకరకాల ప్రయత్నాలు చేస్తూంటాయి. గ్రూపు టూర్లకు తీసుకెళ్లడంతో పాటు చాలా లీజర్ కార్యక్రమాలు చేపడతాయి. ఆత్మవిశ్వాసం నింపడానికి వ్యక్తిత్వ వికాస నిపుణులతో క్లాసులు పెట్టిస్తూంటారు. వారు పెట్టే టాస్కులు కాన్ఫిడెన్స్‌ను పెంచుతాయి. అయితే చైనా కంపెనీలు మాత్రం వింత వింత ప్రయత్నాలు చేస్తాయి. అవి చేయమనే టాస్కుల గురించి తెలిస్తే ఆత్మవిశ్వానికి బదులు భయం.. కంపెనీపై విధేయతకు బదులు అసహ్యం పెరుగుతుంది.
ఇటీవల ఓ కంపెనీలో తమ ఉద్యోగులు నిప్పులు మింగాలనే ఓ పరీక్ష పెట్టారు. కాటన్ బాల్స్ కు నిప్పులు పెట్టి.. వాటిని లాలీపాప్‌లు అనుకుని గట్టిగా నోట్లో పెట్టుకుని మింగేయాలని చెప్పారు. ఆ ఉద్యోగులకు మరో ఆప్షన్ లేదు. అందరూ అదే చేశారు. కానీ ఓ ఉద్యోగి మాత్రం ఈ టార్చర్ భరించలేక సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.
Chinese companies are forcing employees to eat fire In "Confidence-Building" exercises.
— We Shuggie's View of China (@WeShuggie) January 9, 2025
Those employees are the lucky ones, in the past they had to eat the human flesh of the enemy for ideological purposes and to show allegiance/obedience to your military unit or CCP cadres. pic.twitter.com/RLPkaTbe7C
పోటీలో ఎలా పాల్గొనాలో కూడా కంపెనీ నిర్వాహకులు చెబుతారు. ఉద్యోగాల్ని కాపాడుకోవాలంటే ఈ స్కిట్స్ చేయక తప్పని పరిస్థితి. తనకు ఎంతో భయం వేసినా ఉద్యోగాల్ని కాపాడుకోవడానికి తప్పలేదని ఉద్యోగి చెప్పారు.
Team-building gone too far? A Chinese firm is under fire for forcing staff to swallow flames as a 'confidence booster.' 💥 Critics call it dangerous and unethical. What do you think?https://t.co/UxA5iqKfcl pic.twitter.com/MNL9Vrr9RC
— Spotlight on China (@spotlightoncn) January 8, 2025
అయితే ఇది చిన్నదేనని ఇంత కంటే ఘోరమైన టెస్టులు పెట్టే కంపెనీలు ఉన్నాయని కొంత మంది చెబుతున్నారు. అశుద్దం తినమని కూడా కొన్ని కంపెనీలు టెస్టులు పెడతాయని చెబుతున్నారు.
🇨🇳 FLASH - En #Chine, les employés d’une entreprise mangent des #vers, en #punition, pour ne pas avoir atteint leur objectif de vente. « Personne n’était mécontent de notre sytème quand nous l’avons mis en place » s’est justifié le manager. (@SCMPNews) pic.twitter.com/DOHEoVXoum
— Mediavenir (@Mediavenir) June 3, 2020
చైనా కంపెనీలు మొత్తానికి ఉద్యోగుల్ని రాచి రంపాన పెడుతున్నాయని మాత్రం క్లారిటీ వచ్చేసింది.