అన్వేషించండి

UN Chief On Afghanistan: ఎంత బలప్రయోగం చేసినా తగ్గేదెలె.. అఫ్గాన్‌లో పరిస్థితులపై ఆ దేశాధ్యక్షుడి కీలక ప్రకటన..

అఫ్గానిస్థాన్ లో తాలిబన్లు దురాక్రమణపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు, బాలికల పరిస్థితి మరింత దయనీయంగా ఉందని ఆవేదన చెందారు.

అఫ్గానిస్థాన్ పై నియంత్రణకు తాలిబన్లు దురాక్రమణ కొనసాగుతోంది. అఫ్లానిస్థాన్ లో పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. తాలిబన్లు అనుమాషకంగా ప్రవర్తిస్తోన్నారన్న ఆయన... తక్షణమే దాడులు నిలిపివేయాలని కోరారు. ఒకరి మీద ఒకరు బలప్రయోగం దీర్ఘకాలం అంతర్ యుద్ధానికి దారితీస్తుందన్నారు. చివరికి దేశం ఒంటరిగా మిగిలిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. 

అఫ్గాన్ ఒంటరి అవుతోంది.. 
 
అఫ్గానిస్థాన్ లో పరిస్థితులు దయనీయంగా ఉన్నాయని యూఎన్ సెక్రటరీ జనరల్ గుటెరస్ అన్నారు. అఫ్గానిస్థాన్ నియంత్రణ కోల్పోయిందన్న ఆయన... ఈ తరహా ఘర్షణలతో దేశం మరింత క్లిష్టపరిస్థితుల్లో చిక్కుకుందన్నారు. అఫ్గానిస్థాన్ ప్రజల ప్రయోజనాల కోసం తాలిబన్లు వెంటనే ఈ దాడుల్ని నిలిపివేయాలని కోరారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతుందన్నారు. చర్చలు జరపడానికి ముందుకు రావాలని కోరారు. అంతర్యుద్ధంతో సాధించేది ఏంలేదన్నారు. బలప్రయోగం ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవడం సరైనా మార్గం కాదన్న గుటెరస్... ఇటువంటి ఘర్షణలు దేశాభివృద్ధిపై ప్రభావం చూపుతాయన్నారు. చివరకు అఫ్గాన్‌ ఒంటరిగా మిగిలిపోతుందని హెచ్చరించారు. బలప్రయోగంతో అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోన్న వారికి అంతర్జాతీయ సమాజం స్పష్టమైన సందేశం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.  

60 శాతం పైగా తాలిబన్ల వశం

అమెరికా సైనిక దళాలు అఫ్గానిస్థాన్ ను విడిచిపెట్టడంతో తాలిబన్లు విజృంభిస్తున్నారు. తమ ఉనికి చాటుకోవడం కోసం వరుస దాడులకు పాల్పడుతున్నారు. తాబిబన్లు ఇప్పటికే దేశంలో అతి పెద్ద నగరాలైన హెరాత్, కాందహార్లను స్వాధీనం చేసుకున్నారన్నారు. అతి కొద్దికాలంలోనే దేశంలోని 60 శాతానికి పైగా తమ వశమైనట్లు ప్రకటించుకున్నారు.  ఇంకొన్ని రోజుల్లో దేశం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటామని ప్రకటించారు. తాలిబాన్లు దేశ రాజధాని కాబూల్ కు అతి సమీపంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. 

మహిళల పరిస్థితి దయనీయం

తాలిబన్లు ఆక్రమించుకున్న ప్రాంతాల్లో ప్రజల హక్కులు అణచివేతకు గురవుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా మహిళలు, బాలికల పరిస్థితి మరింత దయనీయంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని గుటెరస్ ఆవేదన వ్యక్తం చేశారు. తాలిబన్ల ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో మహిళలు, జర్నలిస్టులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయన్నారు. మానవ హక్కులపై ఆంక్షలు విధిస్తున్నారని తమకు అందిన నివేదికలతో పరిస్థితుల తీవ్రత అర్థం చేసుకోవచ్చని గుటెరస్ అన్నారు. పౌరులపై దాడులకు దిగడం అంతర్జాతీయ మానవతా చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఆయన అన్నారు. గత నెలలో సుమారు 1000 పైగా పౌరులు తాలిబన్ల దాడుల్లో మృతి చెందారని గుటెరస్ తెలిపారు. ముఖ్యంగా హెల్మాండ్, హెరాత్, కాందహార్ నగరాల్లో జరిగిన దాడుల్లో ప్రజలు అధిక సంఖ్యలో మృతిచెందారన్నారు. ఇప్పటికే 2,41,000 మంది పౌరులు దేశం విడిచివెళ్లిపోయారన్నారు.  

అష్రఫ్ ఘనీ రాజీనామా చేయాలని డిమాండ్

అఫ్గానిస్థాన్ లో ఉన్న మొత్తం 34 ప్రావిన్స్ లలో 18  తమ ఆధీనంలో ఉన్నట్లు తాలిబన్లు ప్రకటించారు. ఆ దేశ రాజధాని కాబుల్ సమీపానికి  చేరుకున్న తాలిబన్లు తమ మరణహోమాన్ని కొనసాగిస్తోన్నారు.  దేశాన్ని రక్షించుకునేందుకు తమ సాయశక్తులా పోరాడతామని ప్రభుత్వం చెబుతోంది. తాలిబన్లు, పాకిస్తాన్.... అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. . 

నాటో ప్రతినిధుల భేటీ

అఫ్గాన్ లో రోజురోజుకూ దిగజారుతున్న పరిస్థితులపై నాటో ప్రతినిధులు బ్రసెల్ లో శుక్రవారం భేటీ అయ్యారు. ఆ దేశ పరిస్థితులపై చర్చించారు. అఫ్గానిస్థాన్ ప్రభుత్వంతో నిరంతరం సంప్రదిస్తున్నామని, పరిస్థితులపై సమాచారం తెలుసుకుంటున్నామని నాటో ప్రతినిధులు తెలిపారు. నాటో దేశాలు, అంతర్జాతీయ సమాజం అఫ్గాన్ పరిస్థితులపై ఆందోళన చెందుతున్నట్లు ప్రకటించారు.  

తాలిబన్లను నిలువరిస్తాం

దేశంలో తాలిబన్ల దుశ్చర్యలకు అడ్డుకట్టవేయడమే తమ ప్రధాన ఉద్దేశమని అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ అన్నారు. ఏఎన్ఐ వార్త సంస్థతో మాట్లాడిన ఆయన ప్రజలను తాలిబన్ల హింస నుంచి రక్షిస్తామన్నారు. ప్రస్తుత పరిస్థితులలో అఫ్ఘన్ భద్రత, రక్షణ దళాల మోహరింపు మొదటి ప్రాధాన్యత అన్నారు.  దేశం రెండు దశాబ్దాలుగా దాడులు ఎదుర్కొంటుందన్న ఆయన... ఎట్టి పరిస్థితుల్లో తాలిబన్ల హింసను అనుమతించమన్నారు. దేశాన్ని అస్థిర పరిచి, ప్రజా ఆస్తులను ధ్వంసం చేసే వారి చర్యలను నిలువరిస్తామని పేర్కొన్నారు.  


UN Chief On Afghanistan: ఎంత బలప్రయోగం చేసినా తగ్గేదెలె.. అఫ్గాన్‌లో పరిస్థితులపై ఆ దేశాధ్యక్షుడి కీలక ప్రకటన..

అంతర్జాతీయ భాగస్వాములతో సంప్రదింపులు

అఫ్గానిస్తాన్ ప్రజలను ఉద్దేశించి ఆ దేశ అధ్యక్షుడు అష్రప్ ఘనీ చేసిన ప్రసంగంలో స్థానిక నాయకులు, అంతర్జాతీయ భాగస్వాములతో పరిస్థితిపై సంప్రదింపులు జరుపుతున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది. తాలిబన్ల దాడి నుంచి తప్పించుకునేందు దేశం తరలిపోతున్న పౌరుల సంఖ్య పెరుగుతున్నందున దేశానుద్దేశించి ఘనీ ప్రసంగం చేశారు. రాజధాని కాబూల్ వైపు తాలిబన్లు దూసుకోస్తున్నారు. దేశంలోని రెండో అతిపెద్ద నగరం కాందహార్,  అనేక ఇతర ప్రాంతీయ రాజధానులను స్వాధీనం చేసుకున్నారు. తిరుగుబాటుదారులు లష్కర్ గాహ్ నగరాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. దేశంలోని ప్రాంతీయ రాజధానులలో మూడింట ఒక వంతు తాలిబన్ల నియంత్రణలో ఉంది. 20 సంవత్సరాల సైనిక కార్యకలాపాల తర్వాత అమెరికా, ఇతర విదేశీ దళాలను ఉపసంహరణ సమయంలో తాలిబన్లు దాడులు చేస్తున్నారు. 

Also Read: Nityananda: ఆ పీఠంపై కన్నేసిన నిత్యానంద.. ఒక్క ప్రకటనతో దుమారం.. వెంటనే తాళాలు వేసి, గదులు సీజ్

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న  పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
Citroen Basalt: బసాల్ట్ కారును పరిచయం చేసిన సిట్రోయెన్ - ఏం డిజైన్ భయ్యా!
బసాల్ట్ కారును పరిచయం చేసిన సిట్రోయెన్ - ఏం డిజైన్ భయ్యా!
Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Elections 2024 Tirupati Public Talk: తిరుపతి ఓటర్ల మదిలో ఏముంది..? ఎవరికి ఓటేస్తారు..?KTR on Phone Tapping Case | దొంగలవి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు..నీకేం భయం రేవంత్..? అంటూ కేటీఆర్ ప్రశ్నHardik Pandya vs Rohit Sharma: రాజకీయాల్లోనే కాదు ఇప్పుడు ఆటల్లోనూ క్యాంపులుSiddhu Jonnalagadda Tillu Square Pre Release: ఈవెంట్ కు అనుపమ  ఎందుకు రాలేదో చెప్పిన సిద్ధు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న  పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
Citroen Basalt: బసాల్ట్ కారును పరిచయం చేసిన సిట్రోయెన్ - ఏం డిజైన్ భయ్యా!
బసాల్ట్ కారును పరిచయం చేసిన సిట్రోయెన్ - ఏం డిజైన్ భయ్యా!
Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Naveen Polishetty: అమెరికాలో యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి ప్రమాదం - తీవ్ర గాయాలు!
అమెరికాలో యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి ప్రమాదం - తీవ్ర గాయాలు!
Varun Gandhi : వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరుతారా ? - ఫిలిభిత్ ప్రజలకు  బహిరంగ లేఖ
వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరుతారా ? - ఫిలిభిత్ ప్రజలకు బహిరంగ లేఖ
Pratinidhi 2 Teaser: చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
Embed widget