News
News
X

Umesh Katti Passed Away: గుండెపోటుతో కర్ణాటక మంత్రి హఠాన్మరణం- ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

Umesh Katti Passed Away: కర్ణాటక మంత్రి ఉమేశ్ కత్తి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.

FOLLOW US: 

Umesh Katti Passed Away: కర్ణాటక మంత్రి ఉమేశ్‌ కత్తి (61) గుండెపోటుతో మంగళవారం అర్ధరాత్రి కన్నుమూశారు. అటవీ శాఖ మంత్రిగా ఉన్న ఉమేశ్ కత్తి మృతి చెందడంతో యావత్ రాష్ట్రం షాకైంది.

ఇలా జరిగింది

మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఛాతీ నొప్పి రావడంతో ఉమేశ్ కత్తి కుప్పకూలిపోయారు. ఆ సమయంలో ఉమేశ్.. డాలర్స్‌ కాలనీలోని తన నివాసంలో ఉన్నారు. వెంటనే చికిత్స కోసం ఉమేశ్ కత్తిని.. రామయ్య ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్సకు ఆయన శరీరం సహకరించకపోవడంతో రాత్రి 11.40 నిమిషాలకు ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. 

ప్రొఫైల్

  • ఉమేశ్ కత్తి స్వస్థలం బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా ఖడకలాట గ్రామం.
  • ఆయనకు భార్య లీల, కుమారుడు నిఖిల్‌, కుమార్తె స్నేహా ఉన్నారు.
  • బెళగావి జిల్లా హుక్కేరి నియోజకవర్గం నుంచి ఎనిమిది సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు.
  • ఐదు సార్లు మంత్రిగా సేవలందించారు.
  • ప్రస్తుతం అటవీ, ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రిగా ఉన్నారు.

మోదీ దిగ్భ్రాంతి

ఉమేశ్ కత్తి మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

" శ్రీ ఉమేష్ కత్తి జీ.. కర్ణాటక అభివృద్ధికి గొప్ప కృషి చేసిన అనుభవజ్ఞుడైన నాయకుడు. ఆయన మరణం బాధ కలిగించింది. ఈ విషాద సమయంలో నా ఆలోచనలు ఆయన కుటుంబం, మద్దతుదారులతో ఉన్నాయి. ఓం శాంతి.                                     "
-  ప్రధాని నరేంద్ర మోదీ

" నా సన్నిహిత మిత్రుడిని కోల్పోయాను, నాకు తను సోదరుడు, తనకు గుండె జబ్బులు ఉన్నాయని తెలుసు. కానీ ఇంత త్వరగా మమ్మల్ని విడిచి వెళతాడని ఊహించలేదు. తను రాష్ట్రానికి ఎంతో సేవలు చేశాడు. అనేక శాఖలను సమర్ధవంతంగా నిర్వహించాడు. ఆయన మరణం రాష్ట్రానికి భారీ నష్టం. దీనిని పూరించడం చాలా కష్టం.                                           "
- బసవరాజ్ బొమ్మై, కర్ణాటక సీఎం 

Also Read: Suella Braverman: బ్రిటన్ హోంమంత్రిగా భారత సంతతి మహిళ

Also Read: Bharat Jodo Yatra: రాజకీయాలకు మా నాన్న బలి అయ్యారు, ఇప్పుడు దేశాన్ని బలి కానివ్వను - రాహుల్ ఎమోషనల్ ట్వీట్

Published at : 07 Sep 2022 11:35 AM (IST) Tags: Karnataka minister Umesh Katti Passed Away Umesh Katti Dies Of Cardiac Arrest PM Modi Offers Condolences

సంబంధిత కథనాలు

Visakha Daspalla Lands : విశాఖ దసపల్లా భూములపై ప్రభుత్వం కీలక ఆదేశాలు, సీబీఐ విచారణకు ప్రతిపక్షాలు డిమాండ్!

Visakha Daspalla Lands : విశాఖ దసపల్లా భూములపై ప్రభుత్వం కీలక ఆదేశాలు, సీబీఐ విచారణకు ప్రతిపక్షాలు డిమాండ్!

NMMS scholarship 2022: పేద విద్యార్థులకు వరం - ఎన్ఎంఎంఎస్ ఉపకారవేతనం, ఎంపిక ఇలా!

NMMS scholarship 2022: పేద విద్యార్థులకు వరం - ఎన్ఎంఎంఎస్ ఉపకారవేతనం, ఎంపిక ఇలా!

BRAOU Admissions: అంబేడ్కర్ వర్సిటీ ప్రవేశ గడువు మళ్లీ పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

BRAOU Admissions: అంబేడ్కర్ వర్సిటీ ప్రవేశ గడువు మళ్లీ పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

Garuda Vahana Seva : గరుడవాహనంపై విహరించిన శ్రీవారు, జనసంద్రమైన తిరుమాడవీధులు

Garuda Vahana Seva : గరుడవాహనంపై విహరించిన శ్రీవారు, జనసంద్రమైన తిరుమాడవీధులు

ABP Desam Top 10, 1 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 1 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

టాప్ స్టోరీస్

Gandhi Jayanti 2022: శుక్రవారానికి గాంధీజీకి ఓ స్పెషల్ లింక్ ఉందట, ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడు ఆయనే

Gandhi Jayanti 2022: శుక్రవారానికి గాంధీజీకి ఓ స్పెషల్ లింక్ ఉందట, ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడు ఆయనే

VIjay CID : చింతకాయల విజయ్ ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

VIjay CID :  చింతకాయల విజయ్  ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

Munugode Bypoll : నవంబర్ లో మునుగోడు ఉపఎన్నిక, ఇంకా 40 రోజులే ఉన్నాయ్- సునీల్ బన్సల్

Munugode Bypoll : నవంబర్ లో మునుగోడు ఉపఎన్నిక, ఇంకా 40 రోజులే ఉన్నాయ్- సునీల్ బన్సల్

Bigg Boss 6 Telugu: ఓటింగ్ లో వెనుకబడ్డ ఆరోహి - ఎలిమినేషన్ తప్పదా?

Bigg Boss 6 Telugu: ఓటింగ్ లో వెనుకబడ్డ ఆరోహి - ఎలిమినేషన్ తప్పదా?