అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

లాఫింగ్ గ్యాస్ పీల్చి ప్రాణాలు పోగొట్టుకున్న యువతి, ఇది అంత ప్రమాదకరమా?

Laughing Gas: యూకేలో ఓ యువతి మితిమీరి లాఫింగ్ గ్యాస్ పీల్చడం వల్ల ప్రాణాలు కోల్పోయింది.

Laughing Gas Side Effects: యూకేలో ఓ యువతి లాఫింగ్ గ్యాస్‌ అతిగా పీల్చి ప్రాణాలు కోల్పోయింది. రోజూ రెండు మూడు బాటిల్స్‌ లాఫింగ్ గ్యాస్‌ని పీల్చి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం యూకేలోని 24 ఏళ్ల ఎలెన్ మెర్సెర్ (Ellen Mercer) రోజూ నైట్రస్ ఆక్సైడ్‌ని మితి మీరి పీల్చడాన్ని అలవాటు చేసుకుంది. ఆమెకి అదో వ్యసనంగా మారింది. అయితే...కొద్ది రోజులుగా ఆమె నడవలేపోతోంది. నడిచేందుకు ప్రయత్నించినా కింద పడిపోతోంది. ఆమెని హాస్పిటల్‌కి తరలించారు. ట్రీట్‌మెంట్ ఇచ్చినా ఆమె స్పందించలేదు. మరుసటి రోజు ప్రాణాలు కోల్పోయింది. ఆమె చనిపోయే సమయానికి యూకేలో నైట్రస్ ఆక్సైడ్‌ని పీల్చడం ఇల్లీగల్ కాదు. గతేడాది నవంబర్‌లోనే ప్రభుత్వం లాఫింగ్ గ్యాస్‌ని Class C Drug లిస్ట్‌లో చేర్చింది. కాకపోతే...కేవలం మత్తుకోసం అదే పనిగా పీల్చడం మాత్రం నేరమే అని స్పష్టం చేసింది. అలాంటి వాళ్లకి రెండేళ్ల పాటు జైలుశిక్ష విధిస్తామని వెల్లడించింది. మెడికేషన్‌లో భాగంగా తీసుకోవడాన్ని మాత్రమే సమర్థించింది. గతేడాది 16-59 ఏళ్ల మధ్యలో ఉన్న వాళ్లలో 1.3% మంది, 16-24 ఏళ్ల మధ్యలో ఉన్న వాళ్లలో 4.2% మంది నైట్రస్ ఆక్సైడ్‌ని వినియోగించారని అక్కడి లెక్కలు వివరించాయి. గతంతో పోల్చుకుంటే ఈ వినియోగం బాగా తగ్గిపోయిందని ప్రభుత్వం వెల్లడించింది. 

అయితే...ఎలెన్ విపరీతంగా పీల్చడం వల్ల స్పృహ కోల్పోయింది. పడక నుంచి లేవడానికి కూడా వీల్లేకుండా అలాగే బెడ్ రిడెన్ అయిపోయింది. ఆమె పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో శ్వాస కోశ సమస్యలతో చనిపోయినట్టు తేలింది. ఊపిరి తీసుకోడానికి ఇబ్బంది పడినట్టు వెల్లడైంది. ఎక్కువ రోజుల పాటు అలా నైట్రస్ ఆక్సైడ్‌ని పీల్చడం వల్ల Pulmonary Thromboembolism కి గురైందని వైద్యులు వెల్లడించారు. అంటే...ఊపిరితిత్తులకు రక్త ప్రసరణ ఆగిపోవడం. నైట్రస్ ఆక్సైడ్‌ని ఎక్కువగా పీల్చడం వల్ల ఊపిరితిత్తులకు రక్త సరఫరా ఆగిపోయి చనిపోతారు. ఈ గ్యాస్‌ని వైద్యుల సలహా లేకుండా వాడితే ఎంత ప్రమాదకరమో ఈ ఘటనతో అర్థమైంది.

నైట్రస్ ఆక్సైడ్‌తో కలిగే నష్టం ఇదే..

లాఫింగ్ గ్యాస్‌ని కేవలం వైద్యుల సలహా మేరకు మాత్రమే వినియోగించాలి. నైట్రస్ ఆక్సైడ్ పీల్చేప్పుడు (Nitrus Oxide) కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా ప్లాస్టిక్ మాస్క్ పెట్టుకోవాలి. ముక్కు, నోరు కవర్ అయ్యేలా ఈ మాస్క్ ధరించాలి. ఆ మాస్క్ ద్వారానే లాఫింగ్ గ్యాస్ పీల్చాలి. పిల్లలకీ ఈ గ్యాస్‌ని ముక్కు ద్వారా డ్రగ్‌గా ఇస్తారు. డెంటల్‌కి సంబంధించిన చికిత్స చేసే సమయంలో ఈ లాఫింగ్ గ్యాస్‌నే అనస్థీషియాలా ఇస్తారు. కాసేపటి వరకూ పేషెంట్స్‌ రిలాక్స్ అయిపోతారు. ఇంకొంత మంది నిద్రలేమి సమస్యని దూరం చేసుకోడానికీ వైద్యుల సలహా మేరకు ఈ డ్రగ్‌ని వినియోగిస్తారు. అయితే...ఈ డోస్‌ పెరిగితే విపరీతంగా నవ్వు వచ్చేస్తుంది. ఒక్కోసారి గాల్లో తేలినట్టు అయిపోతుంది. మితిమీరిన ఆనందం వస్తుంది. అదే సమయంలో తీవ్రమైన తలనొప్పితో ఇబ్బంది పడతారు. పిల్లలకు డోస్ ఎక్కువైతే వాంతులు అయిపోతాయి. అయితే...ఈ గ్యాస్ తీసుకున్న వారిలో 5% మందిలో మాత్రమే సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. పరిమితికి మించి తీసుకుంటేనే నైట్రస్ ఆక్సైడ్ (Side Effects of Nitrus Oxide) ప్రాణాంతకంగా మారుతుంది. 

Also Read: Whooping Cough: ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త ఇన్‌ఫెక్షన్, పెరుగుతున్న మృతుల సంఖ్య

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఈ రిజల్ట్‌తో ఫ్యూచర్ క్లియర్..  కాంగ్రెస్‌, BJPకి ఆ శక్తి లేదుఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందేపెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
Embed widget