News
News
X

Uber Cab Delay: క్యాబ్‌ లేట్‌గా వచ్చిందని కంప్లైంట్, కంపెనీకి షాక్ ఇచ్చిన కోర్ట్

Uber Cab Delay: క్యాబ్‌ లేట్‌గా వచ్చిందని కస్టమర్ ఫిర్యాదు చేయగా..ఊబర్ కంపెనీ రూ .20 వేల జరిమానా కట్టాల్సి వచ్చింది.

FOLLOW US: 

Uber Cab Delay:

రూ.20 వేల జరిమానా..

ఓలా, ఊబర్ మన లైఫ్‌లో భాగమైపోయాయి. కాస్తంత దూరం వెళ్లాలన్నా సరే ఈ సర్వీస్‌లు వాడుకుంటున్నాం. కరెక్ట్ టైమ్‌కి వచ్చేస్తే సమస్యమేమీ ఉండదు. కానీ...అవి ఆలస్యమవటమో, క్యాన్సిల్‌ అవడమో అయితేనే చిరాకు మొదలవుతుంది. ముంబయిలో ఓ మహిళకు ఇలాంటి సమస్యే ఎదురైంది. కరెక్ట్ టైమ్‌కి ఊబర్ సర్వీస్ అందించలేకపోయింది. ఈ కారణంగా..ఓ మహిళ ఫ్లైట్ మిస్ అయింది. కోపంతో ఊగిపోయిన ఆ మహిళ వెంటనే కన్‌జ్యూమర్ కోర్ట్‌కు వెళ్లింది. ఊబర్‌పై ఫిర్యాదు చేసింది. తనకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాల్సిందేనని డిమాండ్ చేసింది. చివరకు ఊబర్ ఆమెకు భారీగా పరిహారం చెల్లించుకోవాల్సి వచ్చింది. కస్టమర్‌ని మానసికంగా ఎంతో ఇబ్బంది పెట్టినందుకు రూ.10,000 మొత్తం చెల్లించాల్సిందేనని Consumer Court తేల్చి చెప్పింది. అంతే కాదు. ఆలస్యంగా క్యాబ్‌ను పంపి ఆమెకు ఫ్లైట్ మిస్ అయ్యేలా చేసినందుకు మరో రూ.10,000 కట్టాలని ఆదేశించింది. మొత్తంగా రూ.20,000 చెల్లించాలని Uber Indiaకంపెనీకి కన్‌జ్యూమర్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఇదంతా జరిగింది ఇప్పుడు కాదు. నాలుగేళ్ల క్రితం. ఇన్నాళ్లకు ఈ కేసులో తీర్పు వచ్చింది.  

నాలుగేళ్ల క్రితం జరిగింది..

News Reels

కవిత శర్మ అనే ఓ లాయర్ ముంబయి నుంచి చెన్నైకి ఫ్లైట్ జర్నీ చేసేందుకు రెడీ అయ్యారు. 2018 జూన్ 12న సాయంత్రం 5.50 గంటలకు ఫ్లైట్ ఉంది. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేందుకు ఊబర్ క్యాబ్ బుక్ చేసుకున్నారు. తన ఇంటి నుంచి ఎయిర్‌పోర్ట్‌కు 36 కిలోమీటర్ల దూరం. క్యాబ్ బుక్ చేసుకున్న పావుగంట తరవాత వచ్చింది. ఎస్టిమేటెడ్ టైమ్‌ కన్నా ఎక్కువ సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆలస్యమవుతోందని కస్టమర్ పదేపదే డ్రైవర్‌కు కాల్ చేస్తే "బిజీ" వస్తూనే ఉంది. క్యాబ్ ఆలస్యంగా రావటం వల్ల ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాల్సిన టైమ్‌కు వెళ్లలేకపోయారు. ఫలితంగా..ఫ్లైట్ మిస్ అయింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే..ఎస్టిమేటెడ్ ఫేర్ కన్నా ఎక్కువే తీసుకున్నాడు డ్రైవర్. ఇదంతా చూసి చిరాకు పడిన కస్టమర్ వెంటనే ఊబర్‌కు లీగల్ నోటీస్ పంపారు. ఎక్స్‌ట్రా అమౌంట్‌ను వాపస్ చేసిన కంపెనీ..లీగల్ నోటీస్‌కు మాత్రం స్పందించలేదు. ఆ తరవాతే ముంబయి కన్‌జ్యూమర్‌ కోర్ట్‌కు వెళ్లి కవిత శర్మ ఫిర్యాదు చేశారు. 

Also Read: పెళ్లై ఐదు నెలలైంది- కలిసే సినిమాకెళ్లారు, కానీ మధ్యలో బయటకు వెళ్లిన భార్య మాయం!

Published at : 27 Oct 2022 11:56 AM (IST) Tags: Mumbai Consumer Court Uber Cab Delay Uber Cab Delay

సంబంధిత కథనాలు

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

CM KCR : అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ స్టార్టప్ లు- స్కైరూట్, ధృవ సంస్థలకు సీఎం కేసీఆర్ అభినందనలు

CM KCR : అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ స్టార్టప్ లు- స్కైరూట్, ధృవ సంస్థలకు సీఎం కేసీఆర్ అభినందనలు

OU Phd: వెబ్‌సైట్‌లో ఓయూ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షల హాల్ టికెట్లు, పరీక్ష షెడ్యూలు ఇదే!

OU Phd: వెబ్‌సైట్‌లో ఓయూ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షల హాల్ టికెట్లు, పరీక్ష షెడ్యూలు ఇదే!

MP Vijayasai Reddy : త్వరలో 10 పోర్టులున్న రాష్ట్రంగా ఏపీ, దేశానికే రోల్ మోడల్ - ఎంపీ విజయసాయి రెడ్డి

MP Vijayasai Reddy :  త్వరలో 10 పోర్టులున్న రాష్ట్రంగా ఏపీ, దేశానికే రోల్ మోడల్ - ఎంపీ విజయసాయి రెడ్డి

ABP Desam Top 10, 26 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 26 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

టాప్ స్టోరీస్

Etala Rajendar : పరిమితికి మించి అప్పులు చేసి కేంద్రంపై దుష్ప్రచారం - టీఆర్ఎస్ సర్కార్‌పై ఈటల ఫైర్ !

Etala Rajendar : పరిమితికి మించి అప్పులు చేసి కేంద్రంపై దుష్ప్రచారం - టీఆర్ఎస్ సర్కార్‌పై ఈటల ఫైర్ !

Baba Ramdev: నోరు జారిన రామ్‌ దేవ్ బాబా, మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు,

Baba Ramdev: నోరు జారిన రామ్‌ దేవ్ బాబా, మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు,

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?

House Hacking: హైదరాబాద్‌లో ఇల్లు కొనేందుకు డబ్బుల్లేవా? హౌజ్‌ హ్యాకింగ్‌తో కల నిజం చేసుకోండి!

House Hacking: హైదరాబాద్‌లో ఇల్లు కొనేందుకు డబ్బుల్లేవా? హౌజ్‌ హ్యాకింగ్‌తో కల నిజం చేసుకోండి!