Karshmir Terror Attack: ఉగ్రవాదుల దాడిలో పెద్దల్ని కోల్పోయిన రెండు తెలుగు కుటుంబాలు - వీరి కన్నీళ్లకు సమాధానం ఎలా?
Pehalgam : పెహల్‌గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయినవారిలో ఇద్దరు తెలుగువారున్నారు. ఒకరు కావలి, మరొకరు వైజాగ్‌కు చెందిన వారు.

Pehalgam terror attack: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో నిన్న జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు తెలుగువారు చనిపోయారు. విశాఖకు చెందిన వి రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమళి ఉగ్రవావాదుల కాల్పుల్లో ప్రాణఆలు కోల్పోయారు. కుటుంబ సభ్యులు పహల్గాంకు బయల్దేరి వెళ్లారు. ఉగ్రవాదుల దాడినుంచి తప్పించుకునే ప్రయత్నంలో పారిపోతున్న చంద్రమౌళిని వెంటాడి కాల్చేశారని భద్రతా వర్గాలు చెప్పాయి. చంద్రమౌళి మృతదేహాన్ని సహచర టూరిస్టులు గుర్తించారు. చంద్రమౌళిది పాండురంగపురం. దీంతో ఆ ప్రాంతంలో విషాద చాయలు అలముకున్నాయి. ప్రత్యేక విమానంలో చంద్రమౌళి మృతదేహాన్ని విశాఖకు తీసుకు రానున్నారు.
కావరికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కూడా
జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ కూడా చనిపోయారు. బెంగళూరులో స్థిరపడ్డ మధుసూదన్ కుటుంబ సభ్యులతో విహారయాత్రకు వెళ్ళగా ఘటన జరిగింది. IBM సాఫ్ట్వేర్ కంపెనీలో సీనియర్ ఆర్కిటెక్ట్ విధులు నిర్వహిస్తున్న మధుసూదన్ ను ఉగ్రవాదులు హిందువా, ముస్లిమా అని ఆరా తీసి కాల్చి చంపారు. కావలి అన్నాల వారి వీధిలో నివాసముండే సోమిశెట్టి తిరుపాలు , పద్మ దంపతుల కుమారుడు. మృతుడు మధుసూదన్ కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. నేడు ప్రత్యేక విమానంలో మృతదేహాన్ని చెన్నైకి తరలిస్తారు. సాయంత్రంకి కావలికి చేరుకొనున్న మధుసూదన్ పార్థవ దేహం వస్తారు. తల్లిదండ్రులకు గుండె జబ్బు ఉండటంతో వారికి విషయం తెలియకుండా బంధువులు జాగ్రత్త పడుతున్నారు.
చంద్రబాబు సంతాపం
ప్రాణాలు కోల్పోయిన ఏపీ తెలుగు సంఘం సభ్యులు జేఎస్ చంద్రమౌళి, మధుసూదన్‌లకి సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. ఈ తీవ్ర దుఃఖ సమయంలో తమ ఆలోచనలు, ప్రార్థనలు వారి కుటుంబాలకు అండగా ఉన్నాయని, ఈ అపారమైన నష్టాన్ని తట్టుకునే శక్తిని వారు పొందాలని తాను ప్రార్థిస్తున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. ఉగ్రవాద చర్యలు సమాజానికి మచ్చ అని సీఎం చంద్రబాబు చెప్పారు.ఉగ్రవాదం, హింస వారు ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకోవడం వల్ల ఏదీ సాధించలేరని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంఘీభావంగా నిలుస్తోందని తెలిపారు. ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం మన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు తీవ్రవాదంపై ధృఢమైన, నిర్ణయాత్మక చర్యతో ప్రతిస్పందించడానికి తమ నిబద్ధతతో ఉన్నారని చెప్పారు. ఈ హేయమైన చర్యకు బాధ్యులైన వారిపై కఠినంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు అన్నారు .
Mourning the tragic loss of Sri JS Chandramouli Garu and Sri Madhusudhan Garu, members of our Telugu community, who lost their lives in yesterday’s terrorist attack in Pahalgam. Our thoughts and prayers are with their families during this time of profound grief, and I pray they…
— N Chandrababu Naidu (@ncbn) April 23, 2025
మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని ప్రభుత్వం ప్రకటించింది. చంద్రబాబునాయుడు ఉగ్రదాడి మృతులకు నివాళి అర్పించనున్నారు.





















