అన్వేషించండి

Elon Musk Twitter: ట్విటర్‌ అకౌంట్‌ను ప్రైవేట్‌లో పెట్టుకున్న ఎలన్ మస్క్, కారణమిదేనట!

Elon Musk Twitter: ఎలన్‌ మస్క్ తన ట్విటర్ అకౌంట్‌ను ప్రైవేట్‌లో పెట్టుకున్నారు.

Elon Musk Twitter Private:

ఫీచర్‌ను టెస్ట్ చేసిన మస్క్..

ట్విటర్‌లో రోజుకో మార్పు వస్తోంది. ఎలన్ మస్క్ హస్తగతం అయినప్పటి నుంచి రోజూ వార్తల్లో నిలుస్తోంది ఈ కంపెనీ. ఆర్థిక నష్టాల్లో ఉన్న సంస్థను గట్టెక్కించేందుకు ప్రయత్నిస్తున్నానంటూ మస్క్ చెబుతున్నా...ఆయన తీసుకునే ప్రతి నిర్ణయమూ సంచలనమవుతోంది. కొత్త ఫీచర్లు అందుబాటులోకి తీసుకొస్తున్నారు మస్క్. ఈ క్రమంలోనే తన ట్విటర్ అకౌంట్‌ను ప్రైవేట్‌లో పెట్టుకున్నారు. కొద్ది రోజుల క్రితమే... ట్విటర్‌లో పబ్లిక్, ప్రైవేట్‌ పోస్ట్‌ల ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి ట్విటర్ యూజర్స్..ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఫీచర్ సరిగ్గా పని చేయడం లేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ కంప్లెయింట్స్ ఆధారంగా..మస్క్ ఆ ఫీచర్‌ను టెస్ట్ చేయాలనుకున్నారు. 
అందుకే...తన అకౌంట్‌ను ప్రైవేట్‌లో పెట్టుకున్నారు. ఫీచర్‌లో కొన్ని టెక్నికల్ సమస్యలున్నాయని...త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని వెల్లడించారు. అప్పటికే ఓ యూజర్ ఈ ఫీచర్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు. తన అకౌంట్‌ను ప్రైవేట్‌లో పెట్టినా...పబ్లిక్ ఫీచర్‌ కన్నా ఎక్కువ మందికి రీచ్ అవుతోందని చెప్పాడు. దీనికి రెస్పాండ్ అయిన మస్క్ ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అని...త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆ తరవాత వెంటనే తన అకౌంట్‌ను ప్రైవేట్‌లో పెట్టుకుని టెస్ట్ చేశారు. 

పేరు కూడా మారింది..

ఎప్పటికప్పుడు కొత్త ట్వీట్లతో ఆకట్టుకునే టెస్లా అధినేత తాజాగా తన పేరు మార్చుకున్నారు. ట్విట్టర్ అకౌంట్ కు ఎలన్ మస్క్ అనే పేరు ఉండగా ఇప్పుడు దాన్ని ‘మిస్టర్ ట్వీట్’గా మార్చేశారు. పేరు మార్చుకున్న తర్వాత  ఆయన ఓ ట్వీట్ చేశారు. “నా ట్విట్టర్ అకౌంట్ పేరును మిస్టర్ ట్వీట్ అని మార్చుకున్నాను. కానీ, తిరిగి మార్చాలి అనుకున్నా ట్విట్టర్ అనుమతించడం లేదు” అంటూ ఫన్నీ ఎమోజీని పోస్టు చేశారు. ఆయన ట్వీట్ పై నెటిజన్లను చెలరేగిపోతున్నారు. పలువురు ఆయనను ఆటాడేసుకుంటున్నారు. ఎందుకు పేరు మార్చారంటూ ఫన్నీ ట్వీట్లు చేస్తున్నారు.  ఎలన్ మస్క్ వ్యవహారం ట్విట్టర్ ను కామెడీ చానెల్ గా మార్చేస్తున్నట్లు అనిపిస్తోందని నెటిజన కామెంట్ చేశారు. మార్చేసినట్లు అనిపించడం కాదు, నిజంగానే కామెడీ చానెల్ గా ఉందంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశారు. పేరు మార్చుకున్న వాళ్లంతా బ్లూ టిక్ కోల్పోయారు. మరి మీ అకౌంట్ ఎందుకు బ్లూ టిక్ కోల్పోలేదు? అంటూ మరో నెటిజన్ క్వశ్చన్ చేశారు. ఇకపై నా అకౌంట్ పేరును ఎలన్ మస్క్ అని పెట్టుకుంటాను అంటూ మరో నెటిజన్ బదులిచ్చాడు. వరుస ట్వీట్లతో మస్క్ పై జోకులు పేల్చుతున్నారు. 

ఎన్నో మార్పులు..

గత సంవత్సరంలో ట్విట్టర్ ను కోనుగోలు చేసిన తర్వాత మస్క్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తను అనుకున్న విధంగా ట్విట్టర్ లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. నష్టాల్లో ఉన్న ట్విట్టర్ ను లాభాల బాట పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే సుమారు సగానికి పైగా ఉద్యోగులను తొలగించారు. పలు దేశాల్లోని ట్విట్టర్ కార్యాలయాలను అమ్మకానికి పెట్టారు. ఇన్నీ చేసినా ఆయన అనుకున్నట్లుగా లాభాల్లోకి రాకపోగా మరింత నష్టాల్లో కూరుకుపోతోంది.

Also Read: Mumbai Terror Threat: ముంబయిలో మళ్లీ దాడులు చేస్తాం, NIAకి వార్నింగ్‌ ఇస్తూ మెయిల్ పంపిన తాలిబన్!

 

టాప్ హెడ్ లైన్స్

Hardik - Arshdeep Swap: PBKSకు హార్దిక్..! MIకు అర్ష్‌దీప్ .. ఐపీఎల్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని మెగా ట్రేడింగ్
PBKSకు హార్దిక్..! MIకు అర్ష్‌దీప్ .. ఐపీఎల్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని మెగా ట్రేడింగ్
Arjun Rajput Century: అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు ఎస్‌ఈసీ సన్నాహాలు.. సర్పంచికి 25, వార్డు సభ్యులకి 20 గుర్తులు కేటాయింపు
పంచాయతీ ఎన్నికలకు ఎస్‌ఈసీ సన్నాహాలు.. సర్పంచికి 25, వార్డు సభ్యులకి 20 గుర్తులు కేటాయింపు
Fake Death Certificate: ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fake Death Certificate: ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Arjun Rajput Century: అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
Governor Quota MLC: డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
Mahasakthi Movie OTT : ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Hyderabad Crime News: హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
Israel Politics: ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
Embed widget