(Source: ECI/ABP News/ABP Majha)
Turkey Tragedy: టర్కీ రెస్క్యూ ఆపరేషన్‌లో రోమియో జూలీ,NDRF బృందాలకు సహకారం
Turkey Tragedy: టర్కీ సహాయక చర్యల్లో భారత్ నుంచి వెళ్లిన డాగ్‌స్క్వాడ్ బాధితులను కాపాడుతోంది.
Turkey Tragedy:
డాగ్‌స్క్వాడ్
టర్కీ సిరియాలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మృతుల సంఖ్య 24 వేలు దాటింది. ఇంకా శిథిలాల కింద ఎంత మంది నలిగిపోయారో లెక్క తేలడం లేదు. విపరీతమైన చలిలోనూ రెస్య్కూ ఆపరేషన్ జరుగుతోంది. ఎంతో మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. ప్రపంచ దేశాలూ టర్కీ సిరియాకు సహకారం అందించేందుకు సహాయక బృందాలను పంపుతున్నాయి. భారత్ కూడా ఈ జాబితాలో ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున వైద్య సాయం అందిస్తున్న ఇండియా...NDRF బృందాలనూ అక్కడికి పంపించి బాధితులకు అండగా నిలబడుతోంది. ఈ క్రమంలోనే ఓ డాగ్‌స్క్వాడ్‌నూ పంపింది. ఈ స్క్వాడ్‌లో మొత్తం నాలుగు శునకాలు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి. వాటి పేర్లు రోమియో, జూలీ, హనీ, రాంబో. రెండు NDRF బృందాలతో పాటు ఈ డాగ్ స్వ్కాడ్ కూడా టర్కీకి చేరుకుంది. ఇలాంటి భారీ విపత్తులు జరిగినప్పుడు శిథిలాల కింద వారిని గుర్తించి NDRF బృందాలకు సాయ పడుతుంటాయి ఈ శునకాలు. NDRF కమాండర్ గురుమీందర్ సింగ్ ఈ స్క్వాడ్ గురించి మరి కొన్ని వివరాలు అందించారు. సహాయక చర్యల్లో శునకాలు ఎంతో సహకరిస్తున్నట్టు చెప్పారు. జూలీ అనే శునకం ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని గుర్తించిందని, వెంటనే ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడగలిగామని తెలిపారు. భారత్‌తో పాటు మరి కొన్ని దేశాలూ డాగ్ స్క్వాడ్‌లను టర్కీకి పంపాయి.
NDRF Urban Search & Rescue medium team along with Rescue dogs and other necessary equipment lands at Adana Türkiye 🇹🇷 for #USAR #HADR Ops. #SavingLivesAndBeyond 🇮🇳@PMOIndia @HMOIndia @BhallaAjay26 @AtulKarwal @PIBHomeAffairs@IndianEmbassyTR pic.twitter.com/yGtkTV3rl0
— NDRF 🇮🇳 (@NDRFHQ) February 7, 2023
ఈ దీనస్థితిని గమనించిన భారత్... రెండు దేశాలకూ సాయం చేసేందుకు ముందుకొచ్చింది. "ఆపరేషన్ దోస్త్" పేరిట ఈ సహాయక చర్యలు అందిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో భారత్ అండగా ఉండేందుకు సిద్ధమైంది. విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ మేరకు ట్వీట్ చేశారు. ఆపరేషన్ దోస్త్‌లో భాగంగా...టర్కీ, సిరియాకు సాయం అందిస్తున్నట్టు ప్రకటించారు.
"ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల మధ్య సంబంధాల్లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. కానీ భారత్ మాత్రం అన్ని దేశాలతోనూ స్థిరమైన బంధాన్ని కొనసాగిస్తోంది. వసుధైవ కుటుంబం అనే సూత్రానికి కట్టుబడిన భారత్...మానవత్వంతో సాయం అవసరమైన వారికి అండగా నిలబడుతుంది"
-జైశంకర్, విదేశాంగ మంత్రిఇండియన్ ఎయిర్ ఫోర్స్...ప్రత్యేక విమానాల్లో భారీ ఎత్తున మెడికల్ ఎక్విప్మెంట్ను పంపుతోంది. ఇండియన్ ఆర్మీ మెడికల్ టీమ్‌కి చెందిన 54 మంది సిబ్బంది కూడా ఈ విమానాల్లో వెళ్తోంది. వైద్య పరమైన సాయం అందించేందుకు ముందుంటామని వెల్లడించింది. ఇలాంటి కష్టకాలంలో భారత్ సాయం చేస్తుండటంపై టర్కీ కృతజ్ఞతలు తెలిపింది. భారత్‌ను "దోస్త్"గా వ్యవహరించింది. దోస్త్ అనే పదం టర్కిష్‌లో ఎక్కువగా వాడతారు. అదే పదాన్ని కోట్ చేస్తూ ఆ దేశానికి చెందిన ప్రతినిధులు భారత్‌కు కృతజ్ఞతలు చెప్పారు.