అన్వేషించండి

YV Subbareddy: వైసీపీకి కేంద్రంలో కీలకంగా వ్యవహరించనున్న వైవీ సుబ్బారెడ్డి- జగన్ ప్లాన్ ఇదేనా!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నారు. ఒక పదవి మార్పుతో పార్టీలో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.

YV Subbareddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నారు. ఒక పదవి మార్పుతో పార్టీలో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ గా భూమన...
తిరుమల తిరుపది దేవస్థానం ఛైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి రెండో సారి బాధ్యతలను స్వీకరించనున్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో టీటీడీ ఛైర్మన్ గా పని చేసిన ఆయన ఇప్పుడు మరోసారి ఛైర్మన్ గా నియమితులయ్యారు. ఛైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి నియామకం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కూడా భూమన కరుణా కర్ రెడ్డి ఛైర్మన్ గా పని చేశారు. ఇప్పుడు ఆయన కుమారుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హయాంలో భూమన కరుణాకర్ రెడ్డి ఛైర్మన్ గా ఛార్జ్ తీసుకోనున్నారు. 

కీలకంగా వైవీ. సుబ్బారెడ్డి..
తిరుపతి శాసన సభ్యుడిగా ఉన్న భూమన  టీటీడీ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టనున్న క్రమంలో ఇప్పటి వరకు ఛైర్మన్ గా సేవలు అందిస్తోన్న వై.వి. సుబ్బారెడ్డి అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. 2019 నుండి టీటీడీ ఛైర్మన్ గా వై.వి. సుబ్బారెడ్డి పని చేస్తున్నారు. ఇప్పుడు ఆయన స్దానంలో భూమన కరుణాకర్ రెడ్డికి భాద్యతలను అప్పగించారు. దీంతో సుబ్బారెడ్డి రిలీవ్ కాబోతున్నారు. అయితే తరువాత రోజుల్లో సుబ్బారెడ్డి పాత్ర ఎలా ఉంటుందన్న అంశంపై పార్టీ నేతల్లో చర్చ మొదలైంది.

కేంద్ర బాధ్యతల్లోకి సుబ్బారెడ్డి..
వై.వి. సుబ్బారెడ్డికి వైఎస్ కుటుంబంతో అత్యంత దగ్గర బంధుత్వం ఉంది. అంతే కాదు పార్టి వ్యవహరాల్లో ఇప్పటి వరకు సుబ్బారెడ్డి కీలకంగా ఉంటున్నారు. అటు పార్టీ కార్యకలాపాలు, ఇటు ప్రభుత్వ వ్యహరాలను సైతం, సుబ్బారెడ్డి పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఇక  ఢిల్లీ వేదికగా పార్టీ వ్యవహరాలు, రాజకీయ పరిణామాలు పరిశీలించి తిరిగి మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావటం కీలకంగా సుబ్బారెడ్డి భాద్యతలు ఉంటాయని అంటున్నారు. పార్లమెంట్ లో అత్యధిక ఎంపీలు ఉన్న పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టి నాలుగో స్దానంలో ఉంది. దీంతో కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టి కీలకంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో మరో తొమ్మిది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక పార్టి కార్యకలాపాలపై ఫుల్ ఫోకస్ పెట్టేందుకు జగన్ వ్యూహ రచన చేస్తున్నారు. దీంతో ఢిల్లీలో కీలకంగా వ్యహరించాలంటే, అత్యంత నమ్మకస్తులు, పార్టీకి విధేయులు కావాల్సి ఉంటుంది. ఆ విధంగా చూస్తే వైవీ సుబ్బారెడ్డికి సీఎం జగన్ కేంద్ర బాధ్యతలను అప్పగించనున్నారు.

విజయసాయి రెడ్డితో పాటుగా సుబ్బారెడ్డి...
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో వైసీపీ ఫ్రెండ్ షిప్ చేస్తోంది. కీలక వ్యవహరాల్లో సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టికి చెందిన ఎంపీలు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వంతో ఉన్న పరిచయాలతో వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర స్దాయిలో పొత్తుల వ్యవహరం కూడా కీలకం కానుంది. కనుక కేంద్రంతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ, అక్కడ పరిస్థితులు, రాష్ట్రంలోని రాజకీయ వాతావరణాన్ని అంచనాలు వేసుకుంటూ రాజకీయాలు నపపాలంటే, ప్రస్తుతం ఉన్న విజయసాయి రెడ్డికి తోడుగా సుబ్బారెడ్డి పార్టీ కోసం జాతీయ స్థాయిలో పనిచేసే అవకాశం కనిపిస్తోంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
Andhra Loan Politics: అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
India vs Canada: కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
Andhra Loan Politics: అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
India vs Canada: కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం -
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Rains Update: బలహీనపడిన అల్పపీడనం, నేడు ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు- తెలంగాణలో వాతావరణం ఇలా
బలహీనపడిన అల్పపీడనం, నేడు ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు- తెలంగాణలో వాతావరణం ఇలా
Indiramma Houses: అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
Embed widget