అన్వేషించండి

Viral News: రైల్వే ట్రాక్‌పైకి వచ్చిన సింహాలను ఢీకొట్టిన ట్రైన్, తీవ్ర గాయాలతో విలవిల

Gujarat: గుజరాత్‌లో రైల్వే ట్రాక్‌పైకి వచ్చిన రెండు సింహాలను ట్రైన్ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు సింహాలు తీవ్రంగా గాయపడ్డాయి.

Train Hits Lions: గుజరాత్‌లో రెండు సింహాలు రైల్వే ట్రాక్‌పైకి వచ్చాయి. సరిగ్గా అదే సమయంలో ట్రైన్ వేగంగా దూసుకుని వచ్చి వాటిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సింహాలు తీవ్రంగా గాయపడ్డాయి. రైల్వే ట్రాక్‌ల వద్ద ఇలా తరచూ ప్రమాదాలు జరిగి వన్య ప్రాణులు బలి అవుతున్నాయి. హతీగఢ్‌-భేసన్ మధ్య ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 9 ఏళ్ల వయసున్న సింహానికి తీవ్ర గాయాలైనట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంతో మహువా సూరత్ ప్యాసింజర్ దాదాపు గంటపాటు నిలిచిపోయింది. అటవీ అధికారులు వెంటనే అప్రమత్తమై ఘటనా స్థలానికి వచ్చారు. ఆ రూట్‌లో  ప్రమాదాలు జరిగే అవకాశముందని ముందుగానే అప్రమత్తమంగా ఉన్నారు. సమాచారం అందిన వెంటనే అక్కడికి వెళ్లారు. అప్పటికే సింహం తీవ్ర గాయాలతో నేలకొరిగింది. చికిత్స అందించేందుకు తరలించారు. మరో సింహానికీ గాయాలయ్యాయి. ఈ రైల్వే ట్రాక్ వద్ద ప్రమాదాలు జరుగుతాయని తెలిసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని స్థానికులు మండి పడుతున్నారు. ఈ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

రైల్ ఢీకొని ఏనుగు మృతి..

ఇటీవలే అసోంలో ఇలాంటి ఘటనే జరిగింది. రైల్ ఢీకొట్టడం వల్ల ఏనుగుకి తీవ్ర గాయాలయ్యాయి. చాలా సేపు ట్రాక్‌పైనే విలవిలలాడి ప్రాణాలు కోల్పోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏనుగుని గమనించి బ్రేక్ వేసేందుకు లోకోపైలట్ ప్రయత్నించాడు. కానీ...స్పీడ్ కంట్రోల్ కాకపోవడం వల్ల బలంగా ఏనుగుని ఢీకొట్టింది. రైల్‌లో ఉన్న ఓ ప్యాసింజర్ ఇదంతా వీడియో తీశాడు. అడుగు కూడా కదల్లేని స్థితిలో ఏనుగు ట్రాక్‌పైనే పడిపోయింది. కొన ఊపిరితో చాలా సేపు కొట్టుమిట్టాడి చివరకు మృతి చెందింది. రైలు బలంగా ఢీకొట్టడం వల్ల ఏనుగు కాళ్లు బలమైన గాయాలయ్యాయి. విపరీతంగా రక్తస్రావమైంది. నొప్పి తట్టుకోలేక గట్టిగా ఘీంకరించింది. అక్కడి నుంచి వెళ్లిపోవాలని ప్రయత్నించినా దాని వల్ల కాలేదు. రెండు అడుగులు వేసి అక్కడే పడిపోయింది. కాసేపటికే ప్రాణాలు విడిచింది. 

ఈ వరుస ప్రమాదాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. రైల్వే ట్రాక్‌ల వద్ద వన్య ప్రాణులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోనున్నారు. వాతావరణం సహకరించనప్పుడు మాత్రమే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు. గాయపడ్డ సింహాలకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు తెలిపారు. 

Also Read: NEET Row: UPSC పరీక్షా వ్యవస్థలో కీలక మార్పులు, ఇకపై అభ్యర్థులకు ఫేషియల్ రికగ్నిషన్‌ తప్పనిసరి!

టాప్ హెడ్ లైన్స్

Rahul Gandhi Lok Kalyan Marg Protest: ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
Union Bank Of India Posts: యూనియన్ బ్యాంక్‌లో 395 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు, రూ. 47 లక్షల వరకు ప్యాకేజీ
యూనియన్ బ్యాంక్‌లో 395 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు, రూ. 47 లక్షల వరకు ప్యాకేజీ
Breaking News: ఎమ్మెల్యే బాలకృష్ణకు గాయాలు.. ఫోన్ చేసి పరామర్శించిన మంత్రి నారా లోకేష్
ఎమ్మెల్యే బాలకృష్ణకు గాయాలు.. ఫోన్ చేసి పరామర్శించిన మంత్రి నారా లోకేష్
Harish Rao: మంత్రి మాట నమ్మి రైతులు మోసపోయారు, మీకు ఉరిశిక్ష వేసినా తప్పులేదు: హరీష్ రావు
మంత్రి మాట నమ్మి రైతులు మోసపోయారు, మీకు ఉరిశిక్ష వేసినా తప్పులేదు: హరీష్ రావు

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadambari Jethwani Case Facts: ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
Rahul Gandhi Lok Kalyan Marg Protest: ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
Uday Ruddarraju: ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
Balakrishna Injured: బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
Rag Mayur: రాగ్ మయూర్ నటనకు నేషనల్ లెవల్ వేడుకలో అవార్డు
రాగ్ మయూర్ నటనకు నేషనల్ లెవల్ వేడుకలో అవార్డు
Benefits Of Walk After Dinner: రాత్రి తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే జరిగే మేలేంటి? ఎలా వాక్ చేస్తే మంచిది?
రాత్రి తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే జరిగే మేలేంటి? ఎలా వాక్ చేస్తే మంచిది?
Indians Died In Russia Attack: ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
Embed widget