Top Headlines Today: జాతీయ రాజకీయాల్లో తెలుగు వారి పాత్ర ఇక కనిపించదా?- అభివృద్ధికి సహకరించాలని మోదీని కోరిన రేవంత్
AP News, Telangana News, YSRCP, BRS, TDP News, Congress, Telugu News
Telugu News Today: చంద్రబాబు టూర్‌లో ఉద్రిక్తతలు! వాహనాల అద్దాలు ధ్వంసం
ఉమ్మడి అనంతపురం జిల్లా చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ధర్మవరం ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత గోనుగుంట్ల సూర్యనారాయణ వర్గీయుల మధ్య తీవ్ర గొడవ చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెనుగొండ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న రా.. కదలిరా.. కార్యక్రమానికి పరిటాల శ్రీరామ్ వర్గీయులతో పాటు మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ వర్గీయులు వాహనాల్లో వస్తున్న సమయంలో బత్తలపల్లి మండల కేంద్రంలో ఘర్షణలకు దిగారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఆస్తులు తాకట్టు పెట్టకుండా అప్పులిస్తారా ? - సచివాలయం తనఖాపై టీడీపీ విమర్శలకు కొడాలి నాని కౌంటర్
ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టారని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలను మాజీ మంత్రి కొడాలి నాని తిప్పికొట్టారు. ఆస్తులు తాకట్టు పెట్టకుండా బ్యాంకులు అప్పులు ఎలా ఇస్తాయని ప్రశ్నించారు. సచివాలయాన్ని తాకట్టు పెట్టారని చంద్రబాబుకు గగ్గోలు పెడుతున్నారని.. నేడు రాష్ట్ర అప్పులు 4లక్షల కోట్లు ఉంటే దులో 2.50లక్షల కోట్లు చంద్రబాబు చేసినవేనన్నారు. ఏ ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండానే.... చంద్రబాబు రెండున్నర లక్షల కోట్లు అప్పు చేశారా అని ప్రశ్నించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
పెద్దన్నలా తెలంగాణ అభివృద్ధికి సహకరించాలన్న రేవంత్- కచ్చితంగా హెల్ప్ చేస్తామన్న మోదీ
దేశంలో నేడు జరుగుతున్న అభివృద్ధికి ఆదిలాబాద్ ఓ ఉదాహరణగా అభివర్ణించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రామగుండం ఎన్టీపీసీ స్టేజ్ వన్ పవర్ ప్లాంట్‌ను జాతికి అంకింత చేసిన ప్రధాన మంత్రి వర్చువల్‌గా పలు శంకుస్థాపనలు చేశారు. ములుగు, బేలాలో రెండు జాతీయ రహదారులకు, ఆరు ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడిన ప్రధాని తెలంగాణ ప్రజల కలల సాకారానికి కేంద్రం ఎప్పుడూ ముందే ఉంటుందని తెలియజేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటే- కుటుంబ పాలనతో జరిగిదేమీ లేదని ప్రధాని విమర్శలు
ఆదిలాబాద్‌లో అధికారిక కార్యక్రమాలు పూర్తైన తర్వాత బీజేపీ విజయ సంకల్ప సభను ఏర్పాటు చేసింది. తెలంగాణ బీజేపీ ఏర్పాటు చేసిన సభకు హాజరైన ప్రధానమంత్రి మోదీ కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ తన ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి మోదీ... పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో కూడా వచ్చే మార్పు ఏమీ ఉండబోదని పెదవి విరించారు. రెండు పార్టీల విధానం ఒక్కటేనని విమర్శించారు. కుటుంబ పాలనలో ఒకటి దోచుకోవడం రెండు అబద్దాలు వ్యాప్తి చేయడమే వారి విధానాలు అని విమర్శలు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
జాతీయ రాజకీయాల్లో తెలుగు వారి పాత్ర ఇక కనిపించదా? తెలంగాణ సీఎం వ్యాఖ్యలపై భారీ చర్చ
జాతీయ రాజకీయాలు(National politics).. ఈ మాట అనగానే దేశం మొత్తం కళ్లకు కడుతుంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ఆసేతు హిమాచలం గురించి నాయకులు చర్చించే అవకాశం జాతీయ రాజీకీయాల్లో సస్పష్టం. ఒకప్పుడు అనేక మంది తెలుగు వారు(Telugu leaders).. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(Andhrapradesh) సహా.. మద్రాసు రాష్ట్రం(Madra state) నుంచి కూడా అనేక మంది నాయకులు జాతీయస్థాయిలో ఓ వెలుగు వెలిగారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి