Top Headlines Today: టీడీపీ అధికారంలోకి వస్తే ప్రతీ ఏటా డీఎస్సీ- ప్రశ్నార్థకంగా రాజయ్య పొలిటికల్ కెరీర్
AP Telangana Latest News 11 February 2024: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
Telugu News Today: టీడీపీ అధికారంలోకి వస్తే ప్రతీ ఏటా డీఎస్సీ' - శంఖారావం సభలో నారా లోకేశ్ కీలక హామీ
రానున్న ఎన్నికల్లో టీడీపీదే ఘన విజయమని.. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతీ ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. శ్రీకాకుళం (Srikakulam) జిల్లా ఇచ్ఛాపురంలో (Ichapuram) 'శంఖారావం' పేరిట ఎన్నికల ప్రచారానికి ఆయన ఆదివారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా స్థానిక సురంగిరాజా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
బాల్క సుమన్‌కు నోటీసులు, సీఎం రేవంత్‌ను తిట్టిన కేసులో ఇచ్చిన పోలీసులు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు మంచిర్యాల జిల్లా పోలీసులు ఆదివారం నోటీసులు అందించారు. గత వారం రోజుల క్రితం మంచిర్యాల జిల్లా కేంద్రంలో బిఅర్ఏస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో బాల్క సుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
వేదికపైనే వైసీపీ నేతల మధ్య విభేదాలు బట్టబయలు
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహళ్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణంలో జరిగిన నాలుగో విడత ఆసరా మహిళలకు అందించే చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ప్రస్తుత రాయదుర్గం వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారైన ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవింద్ రెడ్డి ల మధ్య వ్యక్తిగత విమర్శలకు వేదికగా మారింది. ఒకే వేదికపై రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి విమర్శలు చేయగా, ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి ప్రతి విమర్శలు చేయడం అక్కడ చేరిన మహిళా సంఘాల ప్రతినిధులు, మహిళలు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ప్రశ్నార్థకంగా రాజయ్య పొలిటికల్ ఫ్యూచర్! మాజీ డిప్యూటీ సీఎంకు అన్నీ అడ్డంకులే!
తెలంగాణ తొలి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటకొండ రాజయ్య రాజకీయ భవిష్యత్తు రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. ఈ నెల 3వ తేదీన బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన రాజయ్య.. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ లో రాజయ్య చేరికకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. గత ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజయ్యకు గులాబీ పార్టీ టికెట్ ఇవ్వకుండా కేటాయించారు. టికెట్ కు బదులు రాష్ట్ర రైతుబంధు చైర్మన్ పదవి ఇచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఎన్డీఏలో చేరేందుకు జగన్ ప్రతిపాదన - అందుకే ఏపీ పొత్తులపై బీజేపీ తేల్చుకోలేకపోతోందా ?
సార్వత్రిక ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో జమలీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే దేశంలో అన్ని చోట్లా బీజేపీ ప్రిపరేషన్స్ దాదాపుగా పూర్తి చేసింది. కానీ ఏపీ విషయానికి వచ్చే సరికి ఆ పార్టీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. పొత్తులతో వెళ్లాలా.. వెళ్తే ఏ పార్టీతో వెళ్లాలి..లేకపోతే ఒంటరిగా వెళ్లాలా అన్నదానిపై ఇప్పటి వరకూఓ అభిప్రాయానికి రాలేదు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి