Top Headlines Today: త్వరలో జనసేనలోకి ఎంపీ, ఇద్దరు మాజీ మంత్రులు! రేవంత్ రెడ్డి భద్రతపై ఇంటెలిజెన్స్ ఫోకస్
AP Telangana Latest News 24 January 2024: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
Telugu News Today: సీఎం రేవంత్ రెడ్డి భద్రతపై ఫోకస్ - ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం
సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) భద్రతకు సంబంధించి రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన దగ్గర ఉన్న పోలీస్ భద్రతా సిబ్బందిని పూర్తిగా మార్చాలని నిర్ణయించింది. సీఎంకు సంబంధించి ప్రతీ సమాచారం లీక్ అవుతుందనే సెక్యూరిటీని మార్చినట్లు చెబుతున్నారు. గతంలో కేసీఆర్ (KCR) వద్ద పని చేసిన కొందరు సిబ్బంది ఇప్పుడు రేవంత్ వద్ద ఉండగా.. వారిని మార్చాలని నిర్ణయించారు. మాజీ సీఎం దగ్గర పని చేసిన ఏ ఒక్క అధికారిని, సిబ్బందిని కూడా సీఎం వద్ద పెట్టొద్దని సీఎంవోను ఐబీ ఆదేశించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
'పోటీ చేయనంటే సీఎం ఒప్పుకోవడం లేదు' - మంత్రి ధర్మాన ఆసక్తికర వ్యాఖ్యలు
వచ్చే ఎన్నికల్లో తనకు పోటీ చేసే ఆలోచన లేదని మంత్రి ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasada Rao) అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇప్పిలి (Ippili) ఆసరా ఉత్సవాల్లో ఆయన పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను తప్పకుండా పోటీ చేయాలనే సీఎం జగన్ (CM Jagan) కోరుతున్నారని తెలిపారు. పార్టీ వ్యవహారాలు చూసుకుంటానని సీఎంతో చెప్పగా.. అందుకు ఆయన ఒప్పుకోవడం లేదని అన్నారు. తాను పోటీ చేయడంపై ఇంకా సీఎం జగన్ కు స్పష్టత ఇవ్వలేదని స్పష్టం చేశారు. 25 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న తనకు మరోసారి బరిలో నిలవాలనే ఆలోచన లేనట్లు చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
'మేము పార్టీ మారే ప్రసక్తే లేదు' - సీఎంను కలవడంపై ఉమ్మడి మెదక్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల స్పష్టత
తాము పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఉమ్మడి మెదక్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఖండించారు. మంగళవారం సీఎంను కలిసి నియోజకవర్గాల సమస్యలు పరిష్కరించాలని, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరినట్లు స్పష్టం చేశారు. కాగా, ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (Mahipal Reddy), నర్సాపూర్ ఎమ్మెల్యే (Narsapur MLA) సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే కె.మాణిక్ రావు మంగళవారం సాయంత్రం సీఎంను ఆయన నివాసంలో కలిశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఎమ్మెల్సీ ఎన్నికల సీన్ రాజ్యసభ రిపీట్ కాకుండా వైసీపీ ప్లాన్ - రెబల్స్ పై అనర్హత వేటు!
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో త్వరలో ఖాళీ అవనున్న మూడు రాజ్యసభ స్థానాలను...తన ఖాతాలో వేసుకునేందుకు వైసీపీ (YSRCP)వ్యూహాలు రచిస్తోంది. వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (Vemireddy Prabhakar Reddy), టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, బీజేపీ సభ్యుడు సీఎం రమేష్ (Cm Ramesh)పదవీకాలం ముగియనుంది. సంఖ్యా బలంపరంగా చూస్తే ఈ మూడు రాజ్యసభ స్థానాలూ వైసీపీకే దక్కే అవకాశం ఉంది. గతేడాది జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. రాయలసీమ, ఉత్తరాంధ్రల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
వారం రోజుల్లో జనసేనలోకి ఒక ఎంపీ, ఇద్దరు మాజీ మంత్రులు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (AP Assembly Elections 2024)సమీపిస్తున్న కొద్దీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు రూపొందిస్తున్నాయి. గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నాయి. రెండోసారి అధికారంలోకి రావాలని వైసీపీ భావిస్తుంటే... ఈసారి వైసీపీని కొట్టి తీరాలన్న ధ్యేయంతో తెలుగుదేశం (TDP), జనసేన అడుగులు వేస్తున్నాయి. గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసిన టీడీపీ, జనసేన ఈ ఎన్నికల్లో మళ్లీ పొత్తుపెట్టుకున్నాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి