Minister Dharmana: 'పోటీ చేయనంటే సీఎం ఒప్పుకోవడం లేదు' - మంత్రి ధర్మాన ఆసక్తికర వ్యాఖ్యలు
Dharmana Prasada Rao: తనకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన లేదని మంత్రి ధర్మాన అన్నారు. పార్టీ వ్యవహారాలు చూసుకుంటానంటే సీఎం జగన్ ఒప్పుకోవడం లేదని చెప్పారు.
Minsiter Dharmana Prasada Rao Comments on Contesting elections: వచ్చే ఎన్నికల్లో తనకు పోటీ చేసే ఆలోచన లేదని మంత్రి ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasada Rao) అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇప్పిలి (Ippili) ఆసరా ఉత్సవాల్లో ఆయన పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను తప్పకుండా పోటీ చేయాలనే సీఎం జగన్ (CM Jagan) కోరుతున్నారని తెలిపారు. పార్టీ వ్యవహారాలు చూసుకుంటానని సీఎంతో చెప్పగా.. అందుకు ఆయన ఒప్పుకోవడం లేదని అన్నారు. తాను పోటీ చేయడంపై ఇంకా సీఎం జగన్ కు స్పష్టత ఇవ్వలేదని స్పష్టం చేశారు. 25 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న తనకు మరోసారి బరిలో నిలవాలనే ఆలోచన లేనట్లు చెప్పారు. 'వచ్చే ఎన్నికల్లో పోటీపై నేను ఇంకా సీఎం జగన్ కు స్పష్టత ఇవ్వలేదు. 33 ఏళ్లకే మంత్రినయ్యాను. ప్రజలంతా తాను పోటీ చేయాలని చెబితే అదే విషయం సీఎంకు తెలియజేస్తా. ఆయన నిర్ణయం మేరకు నడుచుకుంటాను.' అని ధర్మాన స్పష్టం చేశారు.
Also Read: Pawan Kalyan News: వారం రోజుల్లో జనసేనలోకి ఒక ఎంపీ, ఇద్దరు మాజీ మంత్రులు, ముహూర్తం ఫిక్స్ చేసిన పవన్