Top Headlines Today: చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్ షర్మిల! బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులుగా కొత్త వారికి ప్రాధాన్యం
AP Telangana Latest News 23 January 2024: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
Telugu News Today: చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్ షర్మిల - ఉరవకొండలో వైఎస్ జగన్ విమర్శలు !
ఉరవకొండలో వైఎస్ఆర్ ఆసరా నిధులకు బటన్ నొక్కే కార్యక్రమంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిలపై పరోక్ష విమర్శలు చేశారు. ఆమె చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్ మారారని విమర్శలు గుప్పించారు. ఏపీలో చంద్రబాబుకు చాలా మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారన్నారు. వారిలో బీజేపీలో కొంత మంది ఉన్నారని..పక్క రాష్ట్రంలో ఉండే దత్తపుత్రుడు కూడా చంద్రబాబు స్టార్ క్యాంపెయినరేన్నారు. రాష్ట్రాన్ని చీల్చిన కాంగ్రెస్ పార్టీలోనూ కొత్తగా కొందరు స్టార్ క్యాంపెయినర్లు చంద్రబాబు కోసం చేరారని ఆరోపించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ? గవర్నర్‌కు పైలు పంపిన ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకానికి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. ఛైర్మన్ (Chairman)పదవి కోసం 50 మంది, సభ్యుల కోసం 321 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Cs) ఎ.శాంతికుమారి (Shanthi kumari), న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి (Tirupathi), సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి నిర్మల(Nirmala)తో కూడిన స్క్రీనింగ్ కమిటీ దరఖాస్తులను పరిశీలించింది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా విశ్రాంత ఐపీఎస్ అధికారి మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి నియామకం అయ్యే అవకాశం ఉంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
శ్రీకృష్ణదేవరాయలు రాజీనామాకు కారణాలేంటి ?- టీడీపీలో సీటు కన్ఫామ్ అయిందా?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార వైసీపీ (Ycp)కి షాకుల మీదు షాకులు తగులుతున్నాయి. నేతలు వరుసబెట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(Jaganmohan Reddy) ఝలక్ ఇస్తున్నారు. వైసీపీ గుడ్ బై చెబుతున్నారు. తెలుగుదేశం (Tdp), జనసేన (Janasena) కండువాలు కప్పుకుంటున్నారు. ఎప్పుడు ఎవరు వైసీపీకి షాకిస్తారో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. పొద్దున్నే వైసీపీలో ఉన్న నాయకులు..సాయంత్రానికి ఉంటారో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలుపొందిన కీలక నేతలంతా ఒక్కొక్కొరుగా పార్టీని వీడుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
జగన్ అన్నయ్య గారూ... సుబ్బారెడ్డిగారు ఏపీ అభివృద్ధి చూపిస్తారా? రాజధాని ఎక్కడండీ?
జిల్లా పర్యటనల్లో ఉన్న ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల వైసీపీ నేతలకు ఘాటు రిప్లై ఇచ్చారు. వైవీ సుబ్బారెడ్డి చెప్పనట్టు చర్చకు తాను సిద్ధమని తనతోపాటు మేథావులు, ప్రతిపక్షనేతలు వస్తారని టైం ప్లేస్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇకపై జగన్‌ను అన్నయ్యగారూ అని పిలుస్తానంటూ కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ గా నియమితురాలైన వైఎస్ షర్మిల(YS Sharmila) జిల్లాల పర్యటన ప్రారంభించారు. సోమవారం ఆమె ప్రకటించినట్టుగానే ఎన్నికలకు ముందు ఆమె జిల్లాల్లో పర్యటించి.. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలుత ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కీలకమైన శ్రీకాకుళం నుంచి షర్మిల తన యాత్రను ప్రారంభించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులుగా కొత్త వారికి ప్రాధాన్యం - కేసీఆర్ భిన్నమైన ప్రయోగం చేయబోతున్నారా ?
అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత బీఆర్ఎస్ పార్టీ లోక్ సభ ఎన్నికలను చాలెంజింగ్ గా తీసుకుంది. ఆషామాషీగా కాకుండా పూర్తి స్థాయిలో విజయం కోసం ప్రయత్నించాలని నిర్ణయించుకుంది. అందుకే అభ్యర్థుల విషయంలో కేసీఆర్ ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నారు ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ అభ్యర్థుల్లో బలంగా ఉన్న ఒకరిద్దర్ని తప్ప అందర్నీ మార్చేయాలనుకుంటున్నారు. దాదాపుగా అందర్నీ కొత్త వారిని దించి ప్రయోగం చేయాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇందు కోసం తటస్థులైన ప్రముఖుల్ని సంప్రదిస్తున్నట్లుగా చెబుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి