By: ABP Desam | Updated at : 09 Jun 2023 08:34 AM (IST)
Top Headlines Today:
నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ
మృగశిర కార్తె సందర్భంగా నేటి నుంచి హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. దీన్ని కాసేపట్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించనున్నారు. ఈ ప్రసాదం కోసం దేశవ్యాప్తంగా లక్షల్లో తరలి రానున్నారు. దీని కోసం ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. టూవీలర్స్‌కు, కార్లకు, వీఐపీ వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేసింది. రద్దీని దృష్టిలో పెట్టుకొని నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించింది.
సుప్రీంకోర్టులో సునీత పిటిషన్ విచారణ
వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డికి ఇచ్చిన ముందస్తు బెయిల్‌పై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో అవినాష్‌రెడ్డికి తెలలంగాణ వెకేషన్ బెంచ్ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ వివేక కుమార్తె సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది.
మోగా న్యూస్
మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి షురూ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి సోదరుడు, నటుడు నాగబాబు ఇంట్లో అతి త్వరలో పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఆయన కుమారుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) ఓ ఇంటివాడు కాబోతున్నారు. తెలుగు తెర 'అందాల రాక్షసి' లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)తో వరుణ్ తేజ్ ప్రేమలో ఉన్నారనేది కొత్త వార్త ఏమీ కాదు. చిత్రసీమ ప్రముఖులకు, ప్రేక్షకులకు తెలిసిన విషయమే. ఇవాళ వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి నిశ్చితార్థం ఇద్దరి కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహించడానికి ఏర్పాట్లు జరిగాయి. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ హీరోలు అందరూ హాజరు కానున్నారు. కొన్ని రోజుల క్రితమే వాళ్ళకు ఎంగేజ్మెంట్ డేట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. షూటింగ్స్, ఇతర కార్యక్రమాలు ఏవీ ఆ రోజు పెట్టుకోవద్దని చెప్పేశారు. పెళ్లి ముహూర్తం ఎప్పుడు? అనేది త్వరలో ఖరారు చేయనున్నారు.
అనుచరులతో పొంగులేటి భేటీ
కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ ముఖ్య అనుచరులతో సమావేశం కానున్నారు. అల్పాహార విందు పేరుతో మండలాల వారీగా ముఖ్యులను ఆహ్వానించారు. వారితో మాట్లాడి తీసుకున్న నిర్ణయంపై వారి అభిప్రాయాన్ని తీసుకోనున్నారు. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వారితో చర్చించి ఏ పార్టీలో చేరాలనే విషయంపై మాట్లాడారు.
నేటి నుంచే కుల వృత్తి చేసుకునే వారికి లక్ష
కులవృత్తి చేసుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం చేసే లక్ష ఆర్థిక సాయం నేటి నుంచి ప్రారంభం కానుంది. మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్న సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ పథకానికి లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో అర్హులను గుర్తించి సాయం అందిచనున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారు అనర్హులు. పూర్తిగా కుల వృత్తిపైనే ఆధార పడిన వాళ్లు మాత్రమే అర్హులు. వచ్చిన మొత్తాన్ని నెల రోజుల్లోనే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.
Minister RK Roja: పులకేశ్ ఆంధ్రాకు ఎప్పుడొస్తావ్? నారా లోకేశ్‌పై మంత్రి రోజా సెటైర్లు
IT Employees Car Rally: చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగుల కార్ ర్యాలీ ప్రారంభం - బోర్డర్ వద్ద టెన్షన్! వందల్లో పోలీసులు
Top Headlines Today: నేడు బాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగుల ర్యాలీ; తెలంగాణలో ఎన్నికల హడావుడి ఎందుకు లేదు? - నేటి టాప్ న్యూస్
Weather Latest Update: త్వరలో బంగాళాఖాతంలో తుపానుకు అవకాశం! నేడు వర్షాలు పడే ప్రాంతాలు ఇవే: ఐఎండీ
ABP Desam Top 10, 24 September 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
BRS Leaders For Chandrababu : చంద్రబాబుకు తెలంగాణ బీఆర్ఎస్ నేతల సపోర్ట్ - జగన్ పై విమర్శలు ! రాజకీయం ఉందా ?
Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత
Sintex: తెలంగాణలో రూ.350 కోట్లతో సింటెక్స్ తయారీ యూనిట్, 1000 మందికి ఉద్యోగాలు
కాంగ్రెస్ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
/body>