News
News
వీడియోలు ఆటలు
X

Top Headlines Today: తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రధానమైన వార్తలు సూటిగా సంక్షిప్తంగా

గల్లీ నుంచి గ్లోబల్‌ వరకు ఏం జరగబోతుందో ఇక్కడ చూడండి.

FOLLOW US: 
Share:

నేటి నుంచి మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం 

నేటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. వైసీపీ ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, గృహ సారథులు, కన్వీనర్లు జనంలోకి వెళ్లి సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తారు. ప్రజల అభిప్రాయాలు తీసుకుంటారు. ఈ నెల 20 వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ప్రజల అభిప్రాయం తీసుకుంటారు. గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడా తెలియజేస్తూ ఐదు ప్రశ్నలు ఉండనున్నాయి. ప్రతి ఇంటికి వెళ్ళినపుడు వారి అనుమతితో జగన్ ఫోటో ఉన్న స్టిక్కర్ కూడా అందిస్తారు. వారికి నచ్చితే స్టిక్కర్ గోడకు అంటించుకోవచ్చు. సెల్ ఫోన్ పై కూడా అంటించే స్టిక్కర్ ఇవ్వనున్నారు. మొత్తానికి వైసిపి అతి పెద్ద మాసివ్ సర్వే ప్రోగ్రాం చేయబోతోంది. లక్షలాది మంది కోటి 60 లక్షల ఇళ్ల దగ్గరకు వెళ్లి ప్రజల అభిప్రాయం తీసుకుంటారు. 

సాయంత్రానికి బండి సంజయ్‌ విడుదల
టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ కేసులో అరెస్టై జైల్లో ఉన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ సాయంత్రం విడుదల అయ్యే అవకాశం ఉంది. సుదీర్ఘ విచారణ అనంతరం గురువారం అర్థరాత్రి పేపర్ లీకేజీ కేసులో హన్మకొండ కోర్టు బండి సంజయ్ కు బెయిల్ మంజూరు చేసింది. రూ. 20 వేల పూచికత్తు, ఇద్దరి వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది కోర్టు. డిఫెన్స్ వాదనలతో ఏకీభవించిన అనంతరం హన్మకొండ కోర్టు బండికి బెయిల్ మంజూరు చేసింది. అన్ని ఫార్మాలిటిస్ పూర్తయితే మధ్యాహ్నం తర్వాత బండి సంజయ్ కరీంనగర్ జైలు నుంచి విడుదల కానున్నారు. 

నేటి యువగళం షెడ్యూల్ ఇదే

టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 63వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు ఆయన 805.4 కిలోమీటర్లు నడిచారు. 63వరోజు యువగళం పాదయాత్ర వివరాలు శింగనమల అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగనుంది. ఉదయం 8గంటలకు మార్తాడు శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. 8.15 కు పాదయాత్ర 800 కిలోమీటర్లు అధిగమించిన సందర్భంగా మార్తాడులో శిలాఫలకం ఆవిష్కరిస్తారు. 8.55కు మార్తాడు కెనాల్ వద్ద స్థానికులతో మాటామంతీ ఉంటుంది. 10.20కి బుడేడు క్రాస్ వద్ద స్థానికులతో మాట్లాడతారు. 10.55కి గార్లదిన్నెలో భోజన విరామం తీసుకుంటారు. మళ్లీ సాయంత్రం 3గంటలకు గార్లదిన్నెనుంచి పాదయాత్ర కొనసాగిస్తారు. నాలుగు గంటలకు గార్లదిన్నె బహిరంగసభలో లోకేష్ ప్రసంగిస్తారు. 6.20కి పాదయాత్ర ముగించేసి జంబులదిన్నెలో బస చేస్తారు. 

నేడు బీజేపీలోకి మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి 
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి నేడు బీజేపీలో చేరనున్నారు. గత నెలలోనే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన తన లేఖను కాంగ్రెస్ అధిష్టానానికి పంపారు. బీజేపీలో చేరికపై ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరిగిపోయాయని.. ఇప్పుడు ఫైనల్‌గా అమిత్‌షా సమక్షంలో కాషాయం కండువా కప్పుకోనున్నారు. 

పెరుగుతున్న కేసుల టెన్షన్

భారత్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో మరోసారి ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. గత ఏడు రోజులుగా రోజువారీ కరోనా కేసుల సంఖ్య రెట్టింపు అయింది. మార్చి 19 నుంచి ఏప్రిల్ 30 మధ్య భారత్లో 5 వేల 26 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతకుముందు వారంలో (మార్చి 361 నుంచి 23 వరకు) 29 వేల 13గా ఉంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం (ఏప్రిల్ 274) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా 6 వేల 5 కరోనా కేసులు నమోదయ్యాయి.

1912 కేసులతో కేరళ అగ్రస్థానంలో ఉంది. ఏప్రిల్ 6న రోజువారీ కరోనా కేసుల్లో 20 శాతం పెరుగుదల నమోదైంది. గత ఏడాది సెప్టెంబర్ 22 తర్వాత రోజువారీ కరోనా కేసులు 5 వేలు దాటడం ఇదే తొలిసారి. అదే సమయంలో కేరళ, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, యూపీ వంటి రాష్ట్రాల్లో కరోనా కేసులు వేగంగా పెరిగాయి.

నేటి ఐపీఎల్‌లో ఎల్‌ఎస్‌జీ వర్సెస్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

ఐపీఎల్‌ 2023లో నేడు లక్నో సూపర్‌ జెయింట్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు తలపడనుంది. లక్నో లోని వాజ్‌పేయి క్రికెట్‌ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్‌కు ఇది రెండో మ్యాచ్‌. మొదటి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో ఓటమిపాలైంది హైదరాబాద్ జట్టు. అటు లక్నోకి ఇది మూడో మ్యాచ్‌. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడిన లక్నో మొదటి మ్యాచ్‌లో విజయం సాధించి.. రెండో మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఓటమిపాలైంది.   

Published at : 07 Apr 2023 09:05 AM (IST) Tags: Telangana Updates corona cases updates Headlines Today Andhra Pradesh Updates

సంబంధిత కథనాలు

Bandi Sanjay on TDP:

Bandi Sanjay on TDP: "టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలే, బాబు అమిత్ షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి"

Congress: నేను ఎటు పార్టీ మారితే అటు సీఎం అవుతారు! కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు

Congress: నేను ఎటు పార్టీ మారితే అటు సీఎం అవుతారు! కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు

MLC Kavitha: రాష్ట్రంలో కర్ఫ్యూ లేని పాలనకు తెలంగాణ పోలీసులే కారణం: ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: రాష్ట్రంలో కర్ఫ్యూ లేని పాలనకు తెలంగాణ పోలీసులే కారణం: ఎమ్మెల్సీ కవిత

Couple Died With Heart Attack: గుండెపోటుతో నవదంపతుల మృతి, శోభనం గదిలో విగతజీవులుగా మారిన కొత్త జంట

Couple Died With Heart Attack: గుండెపోటుతో నవదంపతుల మృతి, శోభనం గదిలో విగతజీవులుగా మారిన కొత్త జంట

Warangal News: ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ప్రజల్లో పోలీసులపై భరోసా పెరిగింది: దాస్యం వినయ భాస్కర్

Warangal News: ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ప్రజల్లో పోలీసులపై భరోసా పెరిగింది: దాస్యం వినయ భాస్కర్

టాప్ స్టోరీస్

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Tom Holland on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!

Tom Holland  on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్