Top Headlines Today: కౌశిక్ రెడ్డి Vs అరికెపూడి గాంధీ; మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం - నేటి టాప్ 5 న్యూస్
AP Telangana Latest News: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం..
కష్టతరంగా బోట్ల కటింగ్ పనులు!
విజయవాడలో క్రిష్ణా నదిపై ఉన్న ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద అడ్డుపడిన భారీ బోట్లను తొలగించేందుకు నిపుణులతో కూడిన టీమ్ శ్రమిస్తోంది. దాదాపు పది మందితో కూడిన డైవింగ్ టీమ్ నదిలోకి దిగి పడవలను ముక్కలుగా చేస్తున్నారు. ఆ భారీ పడవలను యథాతథంగా తొలగించేందుకు సాధ్యపడనందునే ముక్కలుగా బోట్లను కోసి తీయాలని భావించారు. కానీ, బోట్లు చాలా దృఢంగా ఉండటంతో ఉదయం నుంచి కొంతమేర మాత్రమే కట్ చేయగలిగారు. దీంతో ఈ ప్రక్రియ మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తొలుత బోట్లను క్రేన్ ద్వారా లిఫ్ట్ చేయాలని ప్రయత్నించినా సాధ్య పడలేదు. ఇక చేసేది లేక అధికారులు ఆ బోట్లను ముక్కలు చేసే పనిని వేగవంతం చేశారు. ఇంకా చదవండి
కౌశిక్ రెడ్డి Vs అరికెపూడి గాంధీ
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో రాజకీయాలు మరోసారి కాకమీద ఉన్నాయి. దీనిపై ప్రెస్‌మీట్ పెట్టిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్‌పైన, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేశారు. సిగ్గు ఉంటే పార్టీ మారిన స్పీకర్ నిర్ణయానికి ముందే రాజీనామా చేయాలని అన్నారు. లేకుంటే వారందరికీ చీర గాజులు పంపిస్తానంటూ అన్నారు. వాటిని వేసుకొని తిరగాలని సూచించారు. ఎప్పుడూ కేసీఆర్ వ్యక్తిగతగా ఏ ఎమ్మెల్యేలకు కండువాలు కప్పలేదని అలా నిరూపిస్తే రాజీనామా చేస్తానని అన్నారు. ఇంకా చదవండి
తెలంగాణ కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి ఢిల్లీ వెళ్లారు. ఆయన ప్రధాన లక్ష్యం.. కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ తెచ్చుకోవడం. ఇందు కోసంఆయన చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు.ఇప్పటికే అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతోంది. పాలన గాడిలో పెట్టుకుంటున్నారు. ఈ సమయంలో కీలకమైన హోం, విద్య వంటి శాఖలకు పూర్తి స్థాయి మంత్రులు లేరు. విధేయులకు ఆ పదవులు కట్టబెట్టి మరింత దూకుడుగా వెళ్లాలని రేవంత్ అనుకుంటున్నారు. కానీ సీనియర్లు రకరకాల కాంబినేషన్లతో తెర ముందుకు వస్తూండటంతో.. హైకమాండ్ ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తోంది. ఇంకా చదవండి
చంద్రబాబుకు క్లీన్‌చిట్‌లు రాజకీయ ప్రత్యర్థులే ఇప్పిస్తున్నారా ?
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుది సుదీర్ఘ రాజకీయ చరిత్ర. నాలుగు దశాబ్దాలకపైగా ప్రజా జీవితంలో ఉన్నారు. నాలుగోసారి సీఎంగా ఉన్నారు. మిగిలిన కాలం ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఇంత కీలకమైన బాధ్యతలు నిర్వర్తించిన వారిపై ఆరోపణలు రావడం.. కేసులు నమోదవడం సహజం. అయితే చంద్రబాబునాయుడు పై జగనమోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెట్టిన కేసులు తప్ప.. అంతకు ముంద కేసులు లేవు. ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న ఒకటి రెండు కేసులు ఉండేవి. కానీ ఆయనపై లెక్కేలేన్ని పిటిషన్లు కోర్టుల్లో పడ్డాయి. అలాగే హౌస్ కమిటీలు విచారణలు జరిపాయి. కానీ ఏమీ తేల్చలేకపోయాయి. తాజాగా ఐఎంజీ పిటిషన్లోనూ ప్రాథమిక ఆధారాలు లేవని హైకోర్టు తేల్చింది. దీంతో ఈ కేసు విషయంలో ఎవరిలోనైనా అనుమానాలు ఉంటే క్లియర్ అయినట్ల అయింది. చంద్రబాబుకు ఇలా క్లీన్ చిట్‌లు ఇప్పిస్తోంది రాజకీయ ప్రత్యర్థులే కావడం ఇక్కడ అసలు విశేషం. ఇంకా చదవండి
జగన్‌తో సెల్ఫీ, ఇదీ చాలా స్పెషల్ గురూ!
జగన్ తో సెల్ఫీ దిగేందుకు చాలామంది ఉత్సాహం చూపిస్తుంటారు. ఆయన కూడా ఎక్కడా ఎవర్నీ డిజప్పాయింట్ చేయకుండా తన వద్దకు వచ్చేవారందరితో సెల్ఫీ దిగుతుంటారు. 2019 ఎన్నికల ముందు జగన్ ప్రచారంలో ఆ సందడి బాగా కనపడింది. జగన్ సీఎంగా ఉన్నప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఓ మోస్తరు నాయకులకు ఆ అవకాశం ఎక్కువగా లభించేది. ఇప్పుడు మాజీ అయిన తర్వాత మళ్లీ సామాన్యులకు సెల్ఫీ అవకాశాలు బాగా వస్తున్నాయి. జగన్ పర్యటనలకు వచ్చినా, పులివెందుల క్యాంప్ ఆఫీస్ లో ఉన్నా సెల్ఫీ సెషన్ మాత్రం కామన్ గా జరుగుతుంది. తాజాగా జగన్ గుంటూరు జిల్లా సబ్ జైలు వద్ద కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఇంకా చదవండి