Top Headlines Today: బీఆర్ఎస్‌కు జయేష్ రంజన్ కౌంటర్; చంద్రబాబు సైలెంట్‌గా పవర్ చూపించారా? - నేటి టాప్ న్యూస్
AP Telangana Latest News: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
అమెరికాలో పెట్టుబడుల ఒప్పందాలపై బీఆర్ఎస్ విమర్శలు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో చేసుకుంటున్న పెట్టుబడుల ఒప్పందాల విషయంలో జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వ వర్గాలు అసంతృప్తి చేస్తున్నాయి. స్వచ్చ్ బయో అనే కంపెనీ పెట్టుబడుల ఒప్పందాలను చేసుకుంది. ఈ కంపెనీ సీఎం రేవంత్ రెడ్డి సోదుడిదని బీఆర్ఎస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా హ్యాండిల్స్ ప్రచారం చేశాయి. ఈ ప్రచారం వైరల్ కావడంతో పాటు ఇతర పెట్టుబడులు కూడా అన్నీ ఉత్తుత్తివేనన్న ప్రచారం ప్రారంభించారు. అయితే ఈ ప్రచారాన్ని ఖండిస్తూ.. అమెరికా పర్యటన, పెట్టుబడుల వ్యవహారాలను చూస్తున్న పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ ఓ వీడియో విడుదల చేశారు. ఇంకా చదవండి
ఒక్కొక్కరిగా ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్న రేవంత్
తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకునే విషయంలో రేవంత్ రెడ్డి ప్లాన్ లేకుండా వ్యవహరిస్తున్నారని ఎవరు వస్తే వారికి కండువా కప్పుతున్నారని అనుకుంటున్నారు. ఇంకా చదవండి
హైదరాబాద్ లో చార్లెస్ స్క్వాబ్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్
తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా పలు ప్రముఖ కంపెనీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమవుతూ బిజీగా గడుపుతున్నారు. ఈ పర్యటనలో భాగంగానే ఆర్థిక కార్యకలాపాల్లో అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన డల్లాస్ లోని చార్లెస్ స్క్వాబ్ కేంద్ర కార్యాలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సందర్శించారు. హైదరాబాదులో ఈ సంస్థ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిందని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. ఈ చర్చల్లో చార్లెస్ స్క్వాబ్ సంస్థ ఎగ్జిక్యూటివ్స్ డెన్నిస్ హౌవార్డ్, రామ బొక్క పాల్గొన్నారు. ఇంకా చదవండి
చంద్రబాబు సైలెంట్‌గా పవర్ చూపించారా ?
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రశ్నే లేదని విశాఖ పర్యటనకు వచ్చిన కేంద్ర ఉక్కు శాఖామంత్రి కుమారస్వామి తేల్చి చెప్పారు. ఈ ప్రకటనకు ముందు తెలంగాణ బీఆర్ఎస్.. ఇంకా చదవండి
వైసీపీకి మంగళగిరి నుంచి నెక్ట్స్ షాక్
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్‌సీకి ఏమీ కలసి రావడం లేదు. తాజాగా మంగళగిరి నుంచి పోటీ చేసిన అభ్యర్థి మురుగుడు లావణ్య మామ , మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు వైసీపీకి గుడ్ బై చెప్పే అవకాశం కనిిస్తోంది. మంగళగిరిలో జరిగిన ఓ కల్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో నారా లోకష్ తో పాటు ఆయన కూడా పాల్గొన్నారు. అదే వేదిక మీద నుంచి చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు పద్మశాలి కుల వృత్తుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు వీవర్సకు జిఎస్టి లేకుండా కేంద్రంతో మాట్లాడి తీసేస్తామని హామీ ఇచ్చారన్నారు. చేనేతలకు మగ్గాలు లేని వారికి సొంత ఇల్లు నిర్మిస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీకి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అంశం మంగళగిరిలో చర్చనీయాంశంగా మారింది . టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకునే ఆయన ఇలా మాట్లాడుతున్నారని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇంకా చదవండి