Telangana Investments : అమెరికాలో పెట్టుబడుల ఒప్పందాలపై బీఆర్ఎస్ విమర్శలు - కౌంటర్ ఇచ్చిన జయేష్ రంజన్ !
Jayesh Ranjan : అమెరికాలో పెట్టుబడుల ఒప్పందాలపై జరుగుతున్న ప్రచారాన్ని జయేష్ రంజన్ ఖండించారు. ప్రజా ప్రభుత్వంలో తెలంగాణ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.
Revanth US Tour : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో చేసుకుంటున్న పెట్టుబడుల ఒప్పందాల విషయంలో జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వ వర్గాలు అసంతృప్తి చేస్తున్నాయి. స్వచ్చ్ బయో అనే కంపెనీ పెట్టుబడుల ఒప్పందాలను చేసుకుంది. ఈ కంపెనీ సీఎం రేవంత్ రెడ్డి సోదుడిదని బీఆర్ఎస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా హ్యాండిల్స్ ప్రచారం చేశాయి. ఈ ప్రచారం వైరల్ కావడంతో పాటు ఇతర పెట్టుబడులు కూడా అన్నీ ఉత్తుత్తివేనన్న ప్రచారం ప్రారంభించారు. అయితే ఈ ప్రచారాన్ని ఖండిస్తూ.. అమెరికా పర్యటన, పెట్టుబడుల వ్యవహారాలను చూస్తున్న పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ ఓ వీడియో విడుదల చేశారు.
తెలంగాణ అభివృద్దికి దోహదపడే పెట్టుబడులను రాబట్టడంలో ప్రస్తుత అమెరికా పర్యటన సజావుగా సాగుతోందని పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. గడిచిన పదేండ్లుగా రాష్ట్రం తరఫున గ్లోబల్ లీడర్స్ తో ఒప్పందాల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తోన్న అనుభవం తనదని చెప్పారు. ప్రజా ప్రభుత్వంలో వృత్తి పట్ల నిబద్ధత కలిగిన అధికారిగా తాను తెలంగాణ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తానని రంజన్ పేర్కొన్నారు.
తెలంగాణ అభివృద్దికి దోహదపడే పెట్టుబడులను రాబట్టడంలో ప్రస్తుత అమెరికా పర్యటన సజావుగా సాగుతోందని పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ గారు తెలిపారు. గడిచిన పదేండ్లుగా రాష్ట్రం తరఫున గ్లోబల్ లీడర్స్ తో ఒప్పందాల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తోన్న అనుభవం తనదని చెప్పారు.… pic.twitter.com/8BNQCQxF6V
— CPRO to CM / Telangana (@CPRO_TGCM) August 7, 2024
అలాగే అమెరికా పర్యటనలో ఉన్న ఆర్థిక శాఖ మఖ్య కార్యదర్శి రామకృష్ణారావు కూడా ఓ వీడియో విడుదల చేశారు. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తోన్న తెలంగాణ బృందం పలు అంతర్జాతీయ సంస్థతో ఫలవంతమైన సమావేశాలు జరుపుతోందన్నారు. ప్రజాప్రభుత్వం భవిష్యత్ ప్రణాళికల పట్ల ప్రపంచ బ్యాంకు సహా అనే సంస్థలు ఆసక్తి కనబర్చాయని, రాష్ట్రంతో కలిసి పనిచేసేందుకు ముందుకొస్తున్నాయని చెప్పారు. గ్లోబల్ కంపెనీలతో సమావేశాల్లో ప్రధానంగా విద్య, నైపుణ్యాభివృద్ధి, నెట్ జీరో సిటీ అభివృద్ధి, మూసీ ప్రక్షాళన, డిజిటల్ హెల్త్ కార్డుల జారీ ప్రక్రియపై చర్చిస్తున్నామన్నారు.
పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తోన్న తెలంగాణ బృందం పలు అంతర్జాతీయ సంస్థతో ఫలవంతమైన సమావేశాలు జరుపుతోందని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గారు తెలిపారు. ప్రజాప్రభుత్వం భవిష్యత్ ప్రణాళికల పట్ల ప్రపంచ బ్యాంకు సహా అనే సంస్థలు ఆసక్తి కనబర్చాయని,… pic.twitter.com/HlSfdFWBY9
— CPRO to CM / Telangana (@CPRO_TGCM) August 7, 2024
పెట్టుబడుల అంశంలో ప్రభుత్వంపై సోషల్ మీడియాలో విపరీతంగా వ్యతిరేక ప్రచారం జరుగుతూండటంతో అధికారులు ఈ తరహా వివరణలు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. పెట్టుబడులు, ఒప్పందాల విషయంలో గత ప్రభుత్వంలోనూ జయేష్ రంజనే కీలకంగా వ్యవహరించేవారు. ఇప్పుడు కూడా ఆయనదే కీలక పాత్ర. అందుకే వివరణ ఇచ్చినట్లగా తెలుస్తోంది.