అన్వేషించండి
Advertisement
Morning Headlines: గనుల శాఖ మాజీ డైరెక్టర్‌వెంకటరెడ్డి అరెస్టు, డిజిటల్ హెల్త్ కార్డులపై సీఎం కీలక ప్రకటన వంటి మార్నింగ్ టాప్ న్యూస్
Top 10 Headlines Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తల సమాహారం ఇక్కడ చూడొచ్చు.
1. వెంకటరెడ్డి అరెస్ట్.. నేడు కోర్టులో హాజరు
వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీజి వెంకట్‌రెడ్డిని ఏసీబీ అరెస్టు చేసింది. తప్పించుకొని తిరుగుతున్న వెంకటరెడ్డిని గురువారం రాత్రి హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. గనుల శాఖలో టెండర్లు, అగ్రిమెంట్స్, ఇసుక తవ్వకాల్లో అవినీతి, నేరపూరిత కూట్ర, అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగాలు ఆయనపై ఉన్నాయి. వెంకటరెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు మరి కాసేపట్లో విజయవాడ కోర్టులో హాజరుపరచనున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
2. జగన్ పర్యటన.. తిరుమలలో పోలీస్ యాక్ట్
ఏపీ మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా తిరుపతిలో ఆంక్షలు విధించారు. జిల్లాలో పోలీస్ యాక్ట్ విధిస్తూ తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 25 వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. అప్పటివరకు నిరసనలు, సభలు ర్యాలీలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. జగన్ శనివారం శ్రీవారిని దర్శించుకోనున్నారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
3. ఏపీ రాజకీయాల్లో "శనివారం" అలజడి
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు శనివారం అలజడి రేపుతోంది. మాజీ సీఎం జగన్.. శనివారం శ్రీవారి దర్శనం కోసం వెళ్తున్నారు. జగన్ తిరుమల పర్యటన వేళ... డిక్లరేషన్ ఇవ్వాలంటూ టీడీపీ డిమాండ్ చేస్తోంది. జగన్ ఏ మతస్థుడో డిక్లరేషన్ ఇవ్వాలని బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కూడా డిమాండ్ చేశారు. ఇటు వైసీపీ నేతలు కూడా తాము కచ్చితంగా తిరుమలకు పోతామని.. ఏం చేస్తారో చూస్తామని అంటున్నారు. దీంతో అలజడి రేగుతోంది.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
4. ధర్మారెడ్డి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఐదేళ్లు అంతా తానై నడిపించిన టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఐదేళ్ల కాలంలో తిరుమల జేఈవోగా... అదనపు ఈవోగా.. ఈవోగా... ఎస్వీబీసీ ఛైర్మన్‌గా... ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఇన్చార్జి వీసీగా ఇలా ఏదైనా ధర్మారెడ్డి అనేలా పరిపాలన సాగింది. తాజాగా లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిపారన్న కలకలం రేగుతున్నా ధర్మెరెడ్డి ఇప్పటివరకూ స్పందించలేదు. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి ధర్మారెడ్డి అన్న ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
5. రెడ్ బుక్‌పై లోకేశ్ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ బుక్ అమలు ఇప్పటికే ప్రారంభమైందని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం రెడ్‌బుక్ అమలు చేస్తున్నామని, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వారికి శిక్ష తప్పదని మరోసారి హెచ్చరించారు. చట్టాన్ని అతిక్రమించిన ఎవరినీ వదిలేది లేదనే మాటకు కట్టుబడి ఉన్నామని గుర్తుచేశారు. రైట్ ప్లేస్‌లో రైట్ పర్సన్ ఉండాలనేదే కూటమి ప్రభుత్వ అభిమతం అని లోకేశ్ పేర్కొన్నారు.
6. తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతం చేయాలని హైకోర్టులో పిల్
తిరుపతి లడ్డూ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ అంశంపై రాజకీయంగా తీవ్ర విమర్శలు, ప్రతి విమర్శలకు తావిస్తోంది. ఈ క్రమంలోనే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. శ్రీవారి లడ్డూ వివాదం నేపథ్యంలో తిరుపతిని ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కేఏ పాల్ సంచలన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇదే విషయంపై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
7. డిజిటల్ హెల్త్ కార్డులపై కీలక ప్రకటన
తెలంగాణ డిజిటల్ హెల్త్ కార్డులపై కీలక ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మరో 30 రోజుల్లో ప్రజలకు డిజిటల్ హెల్త్ కార్డులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం విద్య, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని.. పేదలకు అతి తక్కువ ఖర్చుతో వైద్య అందించాల్సి ఉందని అన్నారు. ప్రతీ ఒక్కరి హెల్త్ ప్రొఫైల్‌ను డిజిటలైజ్ చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
8. హాస్టల్ వార్డెన్‌కు మరణ శిక్ష
అరుణాచల్ ప్రదేశ్‌లోని పోక్సో న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. 2014-2022 మధ్య కాలంలో ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో 21 మంది విద్యార్థులపై లైంగికదాడికి పాల్పడిన వార్డెన్‌కు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. బాధితులంతా మైనర్లేనని.. అందులో ఆరుగురు బాలురు కూడా ఉన్నారని సిట్ విచారణలో వెల్లడైంది. ఇదే కేసులో ప్రధానోపాధ్యాయుడు, హిందీ టీచర్‌కు 20 ఏళ్లు జైలు శిక్ష విధించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
9. పుతిన్ అణు హెచ్చరిక ప్రకంపనలు
రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం మరింత భీకరంగా మారే అవకాశం కనిపిస్తోంది. తమపై దాడులు చేసే దేశానికి సాయం చేసే దేశాలు కూడా తమపై దాడి చేసినట్లుగానే భావించి వాటిపై కూడా అణుదాడికి పాల్పడేందుకు వెనుకాడబోమని పుతిన్ అన్నారు. దీనికి సంబంధించి దేశ అణ్వస్త్ర పాలసీని కూడా మార్చి అధికారిక ప్రకటన కూడా చేశారు. నాటో దేశాల్లోని ఏ ఒక్క దేశం నుంచి ఉక్రెయిన్ కు ఆయుధాలు వచ్చినా.. ఆ ఆయుధాలతో రష్యాపై దాడి జరిగితే.. నాటో దాడి చేసినట్లుగానే భావిస్తామని పుతిన్ స్పష్టం చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం మరింత భీకరంగా మారే అవకాశం కనిపిస్తోంది. తమపై దాడులు చేసే దేశానికి సాయం చేసే దేశాలు కూడా తమపై దాడి చేసినట్లుగానే భావించి వాటిపై కూడా అణుదాడికి పాల్పడేందుకు వెనుకాడబోమని పుతిన్ అన్నారు. దీనికి సంబంధించి దేశ అణ్వస్త్ర పాలసీని కూడా మార్చి అధికారిక ప్రకటన కూడా చేశారు. నాటో దేశాల్లోని ఏ ఒక్క దేశం నుంచి ఉక్రెయిన్ కు ఆయుధాలు వచ్చినా.. ఆ ఆయుధాలతో రష్యాపై దాడి జరిగితే.. నాటో దాడి చేసినట్లుగానే భావిస్తామని పుతిన్ స్పష్టం చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
10. నేటి నుంచి రెండో టెస్టు
నేటి నుంచి భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. మూడేళ్ల తర్వాత ఓ టెస్ట్ మ్యాచ్‌కు కాన్పూర్ ఆతిథ్యమివ్వబోతోంది. ఈ నేపథ్యంలోనే టీమిండియా క్రికెటర్లు నెట్స్‌లో తీవ్రంగా సాధన చేశారు. తొలి టెస్టులో ఘన విజయం సాధించిన రోహిత్ సేన.. చివరిదైన రెండో టెస్ట్‌లోనూ గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
క్రైమ్
సినిమా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement