Top Headlines Today: అర్థరాత్రి రాజ్యసభలో మహిళా బిల్లుకు మోక్షం- అభ్యర్థులపై తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు దాదాపు పూర్తి
Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
Top 10 Headlines Today
విశాఖ వెళ్లడం ఈజీయేనా?
దసరాకు విశాఖ నుంచి పరిపాలన చేస్తామని అందరూ సిద్ధమవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేబినెట్ భేటీలో మంత్రి వర్గ సహచరులకు చెప్పారు. అయితే ఈ విషయంపై అధికారికంగా మాత్రం ఐ అండ్ పీఆర్ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పందించలేదు. ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటన చేస్తారని అన్నారు. అంటే దసరాకు విశాఖ రాజధాని తరలింపు ఇన్ సైడ్ న్యూస్ . కానీ వైసీపీ విశాఖ ఇంచార్జ్ వైవీ సబ్బారెడ్డి మాత్రం కార్యాలయాలు చూస్తున్నామని ప్రకటించారు. కానీ ఇక్కడే చాలా మందికి డౌట్ వస్తోంది. కార్యాలయాలు తరలింపు సాధ్యమేనా ? సుప్రీంకోర్టులో తేలకుండా ఎలా కార్యాలయాలు తరలిస్తారు ? పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
కాంగ్రెస్‌కు అస్త్రం ఇచ్చారా?
తల్లిని చంపి బిడ్డను బయటకు తీశారని తెలంగాణ ఏర్పాటు గురించి ప్రధాని మోదీ సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతూంటారు. దక్షిణాదిలో అయినా ఇతర రాష్ట్రాల్లో అయినా చివరికి పార్లమెంట్ లో అయినా ఆయన ప్రసంగాల్లో ఖచ్చితంగా ఉమ్మడి రాష్ట్ర విభజన తీరుపై వ్యాఖ్యలు చేస్తూంటారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాత పార్లమెంట్ భవనంలో చివరి ప్రసంగం చేశారు. అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఆ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఘాటుగా స్పందించింది. కానీ తెలంగాణ ఏర్పాటు ఎలా జరిగిందనే చర్చ మాత్రం తెరపైకి వచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
కాంగ్రెస్ వడపోత
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసేందుకు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ దేశ రాజదాని ఢిల్లీలో సమావేశమైంది. కాంగ్రెస్ వార్ రూములో స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ నాయకత్వంలో ఈ సమావేశం జరిగింది. స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి జిగ్నేష్ మేవాని, బాబా సిద్దిక్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధుయాష్కీ, భట్టి విక్రమార్క హాజరు అయ్యారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసిన రాష్ట్ర నాయకత్వం.. ఆ నివేదికను ఢిల్లీ సమావేశానికి తీసుకువచ్చింది. 119 నియోజవర్గాలకు దాదాపు 300 పేర్లను స్క్రీనింగ్ కమిటీకి తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సిఫారసు చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి
జైలులో భద్రతపై అనుమానం
రాజమండ్రి జైలులో ఓ రిమాండ్ ఖైదీ మృతిచెందడం సంచలనంగా మారింది. డెంగ్యూతో రిమాండ్ ఖైదీ మృతి చెందడంతో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రిమాండ్ ఖైదీ మృతితో వారి అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
తెలంగాణలో వర్షావరణం
తెలంగాణలో ఇప్పటికే పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. గత కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా పలు జిల్లాలో వానలు పడుతున్నాయి. అయితే ఈ వర్షాలు మరో మూడు రోజుల పాటు కూడా కొనసాగనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణశాఖ ప్రజలకు అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. అలాగే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ ఎల్లో అలర్ట్ కూడా వాతావరణశాఖ అధికారులు జారీ చేశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
బీజేపీలో రాములమ్మ రగడ
తెలంగాణ బీజేపీలో అసంతృప్తులు ఆ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారుతున్నాయి. గతంలో ఈటల వర్సెస్ బండి సంజయ్ వ్యవహారం నడిచిందనేది బహిరంగ రహస్యం. రాష్ట్ర అధ్యక్షుడి మార్పుతో వివాదం సద్దుమణిగింది. అంతలోపే విజయశాంతి, ఈటల రాజేందర్ మధ్య విభేదాలు రచ్చకెక్కాయని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా విజయశాంతి ట్విటర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
నేడు గరుడ సేవ
ఇల వైకుంఠం తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. గురువారం ఉదయం శ్రీ మలయప్పస్వామి కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో దర్శనమిచ్చారు. రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి సర్వభూపాల వాహనంపై వేణుగోపాలకృష్ణుడి అలంకారంలో భక్తులను కరుణించారు. శుక్రవారం శ్రీవారికి అంత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై విహరించనున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు లక్షల సంఖ్యలో భక్తులు ఇప్పటికే తిరుమలకు చేరుకున్నారు. దాదాపు 2 లక్షల మంది భక్తులు గ్యాలరీల్లో వేచి ఉండే అవకాశముంది. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
రాజ్యసభలో మహిళా బిల్లుకు ఆమోదం
రాజ్యసభలోనూ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లుకు అనుకూలంగా 215 ఓట్లు పడగా, ఒక్కటి కూడా వ్యతిరేక ఓటు పడలేదని రాజ్యసభ ఛైర్మన్ ప్రకటించారు. ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టగా.. దీనిపై సుదీర్ఘంగా 10 గంటల పాటు చర్చ జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
నేడు ఆస్ట్రేలియాతో వన్డే
రెండువారాల్లో స్వదేశంలోనే మొదలుకాబోయే వన్డే ప్రపంచకప్‌కు ముందు భారత జట్టుకు తమ బలాబలాలు, బలహీనతలు ఏంటి..? తుది జట్టులో ఎవరు ఉండాలి..? ఎవరి ఫిట్‌నెస్ ఎలా ఉంది..? మ్యాచ్ విన్నర్ ఎవరు..? ఆపద్బాంధవులు ఎవరు..? బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉండాలి..? బౌలర్ల పరిస్థితి ఏంటి..? తదితర అంశాలను కూలంకశంగా తెలుసుకోవడానికి ఆఖరి మోక (అవకాశం) దొరికింది. వన్డే ప్రపంచకప్‌కు ముందు టీమిండియా.. ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈనెల 22 నుంచి 27 వరకూ జరుగబోయే ఈ సిరీస్‌లో భారత్ - ఆస్ట్రేలియాలో తొలి మ్యాచ్.. గురువారం మొహాలీ వేదికగా జరుగుతుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
పాన్ ఇండియా మాస్
రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'టైగర్ నాగేశ్వరరావు'. ఇది మాస్ మహారాజా కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. అందుకే ప్రతిష్టాత్మకంగా తీసుకొని దూకుడుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు, టీజర్, ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా 'వీడు' అనే సెకండ్ సాంగ్ లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేసారు. ప్రోమోతోనే ఆసక్తిని కలిగించిన ఈ పాట, మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా సాగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
విజయ్ ఆంటోనీ ఆవేదన
ప్రముఖ తమిళ నటుడు సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ పెద్ద కూతురు మీరా ఆంటోనీ ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విషయం తెలిసిందే. మీరా మరణంతో తమిళ సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. డిప్రెషన్ స్ట్రెస్ తట్టుకోలేక 12వ తరగతి చదువుతున్న మీరా ఆంటోనీ మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో తన గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలో కన్నుమూసింది. మీరా మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ ఘటన తమిళ ఇండస్ట్రీ మొత్తాన్ని కుదిపేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి