అన్వేషించండి

నా కూతురితో పాటూ నేను చనిపోయా - కన్నీళ్లు పెట్టిస్తున్న విజయ్ ఆంటోనీ ట్వీట్!

కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ పెద్ద కూతురు మీరా అంటోని ఆత్మహత్య చేసుకొని మరణించిన విషయం తెలిసిందే. అయితే మొదటిసారి సోషల్ మీడియా వేదికగా కూతురూ మరణం పై విజయ్ ఆంటోనీ స్పందించారు.

ప్రముఖ తమిళ నటుడు సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ పెద్ద కూతురు మీరా ఆంటోనీ ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విషయం తెలిసిందే. మీరా మరణంతో తమిళ సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. డిప్రెషన్ స్ట్రెస్ తట్టుకోలేక 12వ తరగతి చదువుతున్న మీరా ఆంటోనీ మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో తన గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలో కన్నుమూసింది. మీరా మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ ఘటన తమిళ ఇండస్ట్రీ మొత్తాన్ని కుదిపేసింది.

ఎంతో అల్లారుముద్దుగా, అపురూపంగా పెంచుకున్న కూతురు కళ్ళముందు విగత జీవిగా పడుండడంతో తల్లిదండ్రులైన విజయ్, ఫాతిమా గుండెలు పగిలేలా రోదించారు. వాళ్ల పరిస్థితి చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకున్నారు. మరోవైపు కూతురు మృతి చెందిన దగ్గర నుంచి ఇప్పటివరకు విజయ్ మీడియాతో మాట్లాడింది లేదు. కూతురి మరణాన్ని విజయ్ అంటోని తట్టుకోలేకపోతున్నాడు. కూతురి మరణానంతరం దాదాపు మూడు రోజుల తర్వాత మొదటిసారి మీరా మరణంపై స్పందించాడు విజయ్ ఆంటోని. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా తన బాధను తెలియజేశాడు.

"ప్రియమైన స్నేహితులారా, నా కూతురు మీరా చాలా ప్రేమగా, ధైర్యంగా ఉంటుంది. కులం, మతం, డబ్బు, అసూయ, బాధ, పేదరికం, ద్వేషం ఈ ప్రపంచం కంటే మెరుగైన ప్రశాంతమైన ప్రదేశానికి ఆమె ఇప్పుడు వెళ్ళింది. ఆమె నాతో మాట్లాడుతోంది. నేను ఆమెతో పాటే చనిపోయాను. నేను ఇప్పుడు ఆమె కోసం సమయాన్ని వెచ్చిస్తున్నాను. ఇప్పటినుంచి ఏది చేసినా ఆమె కోసమే చేస్తాను. ఇక నుంచి నేను చేయబోయే మంచి పనులన్నీ ఆమె పేరు మీదనే ప్రారంభిస్తాను" అంటూ పేర్కొన్నారు విజయ్ ఆంటోని.

ఈ ట్వీట్ చూసిన అభిమానులు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. మంచి నిర్ణయం తీసుకున్నారని కొందరు చెబుతుంటే, మీకు ధైర్యం, సహనం ఇవ్వాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నట్లు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ట్వీట్ తో కూతురిపై విజయ్ ఆంటోనికి ఎంతటి ప్రేమానురాగాలు ఉన్నాయో స్పష్టమవుతుంది. మరోవైపు మీరా ఆత్మహత్య చేసుకున్న ప్రదేశంలోనే ఓ సూసైడ్ నోట్ దొరికినట్లు తెలుస్తోంది. పోలీసులు ఆ సూసైడ్ నోట్ ని మీరా నోట్ బుక్ లో గుర్తించినట్లు సమాచారం.

ఆ నోట్ లో మీరా తన స్నేహితులను, టీచర్స్ ని మిస్‌ అవుతున్నట్టు రాసిందట. అంతేకాకుండా తన మరణం వల్ల ఫ్యామిలీ బాధపడుతుందని చివర్లో లవ్‌ యూ ఆల్‌, మిస్‌ యూ ఆల్‌ అని రాసిందని సమాచారం. అయితే ఇందులో ఇంకా ఏం రాసిందనేది తెలియాల్సి ఉంది. గత కొన్నాళ్లుగా డిప్రెషన్‌తో బాధపడుతున్న మీరా అందుకు ట్రీట్‌మెంట్‌ కూడా తీసుకుంటుందట. కానీ అంతలోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం బాధాకరం. డిప్రెషన్‌కు చదువుల ఒత్తిడే మీరా మరణానికి కారణమని చెబుతున్నారు. ఇక కూతురి మరణంతో తీవ్రంగా కృంగిపోయిన విజయ్ ఆంటోనీ కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read : మంచు విష్ణు ‘కన్నప్ప' నుంచి తప్పుకున్న కృతి సనన్ సోదరి - కారణం?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Chandini Chowdary : నీ కమిట్మెంట్ ఏంటో చూస్తా? - క్యాస్టింగ్ కౌచ్‌పై టాలీవుడ్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్
నీ కమిట్మెంట్ ఏంటో చూస్తా? - క్యాస్టింగ్ కౌచ్‌పై టాలీవుడ్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్
Ramayana Release Date : విజువల్ వండర్ రామాయణ రిలీజ్ డేట్ - అదే రోజున మరో స్పెషల్
విజువల్ వండర్ రామాయణ రిలీజ్ డేట్ - అదే రోజున మరో స్పెషల్
Varanasi : వారణాసి నుంచి మరో లీక్ - మహేశ్ ఫ్యాన్స్ ఆందోళన... రాజమౌళి రియాక్షన్ ఏంటి?
వారణాసి నుంచి మరో లీక్ - మహేశ్ ఫ్యాన్స్ ఆందోళన... రాజమౌళి రియాక్షన్ ఏంటి?
Nandamuri Alekhya: మోడలింగ్‌లోకి నందమూరి అలేఖ్య... కెరీర్ రీస్టార్ట్ చేసిన తారకరత్న భార్య
మోడలింగ్‌లోకి నందమూరి అలేఖ్య... కెరీర్ రీస్టార్ట్ చేసిన తారకరత్న భార్య

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget