Top 10 Headlines Today: ఢిల్లీ నుంచి ఈటలకు పిలుపు; సీఎం జగన్ కీలక హామీ - నేటి టాప్ 5 న్యూస్
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
బీజేపీ అధినాయకత్వం నుంచి ఈటలకు పిలుపు
కర్ణాటక ఎన్నికల తర్వాత డైలమాలో ఉన్న తెలంగాణ బీజేపీపై అధినాయకత్వం స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఈటల రాజేందర్ హుటాహుటిన ఢిల్లీ పిలిచిన అధినాయకత్వం కీలక బాధ్యతలు అప్పగించబోతుందని సమాచారం. ప్రచార కమిటీని ఏర్పాటు చేసి ఆయన దాని బాధ్యతలు అప్పగించనున్నారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇంకా చదవండి
60 రోజుల్లో కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాల అమలు - ఉద్యోగులకు సీఎం జగన్ భరోసా
ఉద్యోగుల విషయంలో కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను 60 రోజుల్లోగా అమలు చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగ సంఘాల నేతల ప్రతినిధులు తాడేపల్లిలో సీఎం జగన్ ను కలిశారు. కొత్తగా జీపీఎస్ ను తీసుకురావడం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ప్రభుత్వంలో ఏపీవీవీపీ ఉద్యోగుల విలీనం, పీఆర్సీ కమిషన్‌ఏర్పాటు సహా రాష్ట్ర కేబినెట్, ఉద్యోగుల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి జరగాల్సిన మంచి ఏదైనా ఉద్యోగులకు చేస్తామని జగన్ వారికి హామీ ఇచ్చారు. ఉద్యోగులు అనేవారు ప్రభుత్వంలో భాగస్వాములని.. ఉద్యోగులు బాగుంటేనే ప్రజలు బాగుంటారని విశ్వసించిన ప్రభుత్వం మనదని జన వారికి చెప్పారు. మీ మనసులో కష్టం ఉండకుండా చూడాలన్నదే తమ ఉద్దేశమన్నారు. ఇంకా చదవండి
సునీత పిటిషన్ స్వీకరించిన సుప్రీంకోర్టు- అవినాష్ ముందస్తు బెయిల్‌పై మంగళవారం విచారణ
వివేక హత్య కేసులో సునీత దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు తీసుకుంది. దీనిపై మంగళవారం విచారణ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వడంపై పిటిషన్ వేశారు సునీత. వివేక హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రధాన కుట్రదారుడని సుప్రీంకోర్టుకు తెలిపారు సునీత తరఫున న్యాయవాది. అలాంటి వ్యక్తికి ముందస్తు బెయిల్ ఇవ్వడం సరికాదని చెప్పారు. మీడియాలో వచ్చిన స్టోరీలు ఆధారంగా హైకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చిందని తెలిపారు. ఇంకా చదవండి
సస్పెన్స్ కొనసాగిస్తున్న పొంగులేటి - అనుచరులకు ఏం చెప్పారంటే ?
బీఆర్ఎస్ బహిష్కృత నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో చేరుతారన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న తన అనుచరులతో సమావేశం అయిన ఆయన ఏ పార్టీలో చేరేది 2, 3 రోజుల్లోనే తన నిర్ణయం ప్రకటిస్తానన్నారు. పార్టీ మార్పుపై ఎక్కువ సమయం తీసుకోనని, అధికారికంగా హైదరాబాద్‌లోనే ప్రకటిస్తానని చెప్పారు. తాను ఓ పార్టీలో చేరతానని బీఆర్ఎస్ నేతలు ఊహించారని, మందు పార్టీలు, పండగ చేసుకున్నారని అన్నారు. ‘నా అభిమానుల నిర్ణయమే.. నా నిర్ణయం’ అని స్పష్టం చేశారు. కార్యకర్తల సమక్షంలోనే కొత్త పార్టీ లో చేరతానన్నారు. ఇంకా చదవండి
టీడీపీకి మరో సన్‌స్ట్రోక్- చేరికలను వాయిదా వేసిన చంద్రబాబు
వారాల వ్యవధిలోనే టీడీపీకి రెండోసారి సన్ స్ట్రోక్ తగిలింది. మొన్నటికి మొన్న కోడెల శివప్రసాద్ కుమారుడు షాక్ ఇస్తే.. ఇప్పుడు బొజ్జల తనయుడు సైకిల్‌ను షేక్ చేశారు. దీంతో టీడీపీ తన వ్యూహాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. తిరుపతి జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు పార్టీ చేరుతున్నట్టు చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. చివరకు డేట్ ఫిక్స్ అయింది. గురువారం సాయంత్రం చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరేందుకు ప్లాన్ చేసుకున్నారు. నాయుడు అనుచరులు కూడా భారీ ఏర్పాట్లు చేశారు. చలో అమరావతి అంటూ హోర్డింగ్స్, కార్లు హంగామా మామూలుగా లేదు. శ్రీకాళహస్తి నుంచి బయల్దేరడమే ఆలస్యం అనుకున్నారంతా కానీ టీడీపీ నుంచి నాయుడికి ఫోన్ వెళ్లింది. ఇవాళ జాయినింగ్ వీలుపడదని తర్వాత డేట్ చేప్తామన్నారు. ఇంకా చదవండి