Top Headlines Today: కృష్ణా జిల్లాలో టెన్షన్‌గా యువగళం; తెలంగాణ సెక్రటేరియట్‌లో ప్రార్థనాలయాలు - నేటి టాప్ న్యూస్
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
28న ఢిల్లీలో ఓట్ల పంచాయితీ- పోటాపోటీగా వైసీపీ, టీడీపీ ఫిర్యాదులు
ఆంధ్రప్రదేశ్‌లోని అధికార, విపక్షాలు ఢిల్లీ వేదికగా యుద్దానికి సిద్ధమయ్యాయ్. రాష్ట్రంలో వెలుగుచూస్తున్న దొంగ ఓట్ల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి పోటాపోటీగా ఫిర్యాదు చేసేందుకు....ఇరు పార్టీల నేతలు రెడీ అవుతున్నారు. ఈ నెల 28న తెలుగుదేశం, వైసీపీ నేతలు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కనున్నారు. రెండు పార్టీల నేతలు కేంద్ర ఎన్నికల సంఘం అపాయింట్ మెంట్ కోరారు. ఇంకా చదవండి
కృష్ణా జిల్లాలో టెన్షన్ టెన్షన్ గా యువగళం
గన్నవరం లో జరిగిన యువగళం పాదయాత్ర పై రాజకీయ దుమారం మెదలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం నేతలు పోటా పోటీగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నారు. గన్నవరం నియోజకవర్గంలో జరిగిన యువగళం పాదయాత్ర పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురు దాడికి సిద్దం అయ్యింది. అదే సమయంలో పోటా పోటీగా తెలుగు దేశం నేతలు సై ... అంటే సై అంటూ రాజకీయంగా ఎదురు దాడి ప్రారంబించారు. గన్నవరం నియోజకవర్గంలో జరిగిన యువగళం సభ లో చేసిన కామెంట్స్ పై మాజీ మంత్రి పేర్ని నాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువగళం గన్నవరం బహిరంగ సభ ప్రసంగాలకు సంబంధించి తెలుగుదేశం నేతల పై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇంకా చదవండి
తెలంగాణ సచివాలయంలో ప్రార్థనాలయాలు ప్రారంభం
తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆలయ ప్రారంభోత్సవంలో గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన సచివాలయంలో నల్లపోచమ్మ ఆలయాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీన్ని ఇవాళ గవర్నర్‌తో కలిసి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్, సీఎం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఇంకా చదవండి
విజయనగరం జిల్లాలో గిరిజన యూనివర్శిటీకి శంకుస్థాపన
విజయనగరం జిల్లా చినమేడపల్లిలో గిరిజన యూనివర్సిటీకి కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్‌తో కలిసి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. 2వేల కోట్ల రూపాయలతో ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. గత ప్రభుత్వం హయాంలోనే ఈ యూనివర్శిటీకి ఒకసారి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు రెండోసారి సీఎం జగన్ ప్రభుత్వం ఆధ్వర్యంలో శంకుస్థాపన జరిగింది. ఇంకా చదవండి
చంద్రబాబు ఢిల్లీ టూర్‌లో రాజకీయం కూడా ఉందా? బీజేపీతో మరో విడత చర్చలుంటాయా?
ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల జాబితాలో అవకతవకలు, ఓట్ల గల్లంతుతో పాటు దొంగ ఓట్లను చేర్చిన అంశంపై ఈసీకి ఫిర్యాదు చేసేందుకు చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. 28వ తేదన రాష్ట్రపతి భవన్ లో జరగనున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆర్బీఐ రూపొందించిన రూ. వంద వెండి నాణెన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో కుటుంబసభ్యులందరితో పాల్గొంటారు. ఆ తర్వాత ఈసీని కలుస్తారు. రెండు రోజుల పాటు చంద్రబాబు ఢిల్లీలో ఉంటూండటంతో రాష్ట్ర రాజకీయాలపై కొన్ని కీలక చర్చలు నిర్వహించే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంకా చదవండి